తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ori Devuda Ott Release Date: విశ్వ‌క్‌సేన్ ఓరి దేవుడా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే

Ori Devuda OTT Release Date: విశ్వ‌క్‌సేన్ ఓరి దేవుడా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే

10 November 2022, 12:53 IST

  • Ori Devuda OTT Release Date: విశ్వ‌క్‌సేన్ హీరోగా న‌టించిన ఓరి దేవుడా సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖ‌రారైంది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఏ రోజు నుంచి స్ట్రీమింగ్ కానుందంటే...

ఓరి దేవుడా మూవీ
ఓరి దేవుడా మూవీ

ఓరి దేవుడా మూవీ

Ori Devuda OTT Release Date: విశ్వ‌క్‌సేన్ హీరోగా న‌టించిన ఓరి దేవుడా సినిమా ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను గురువారం ఫిక్స్ చేశారు. రొమాంటిక్ ఫాంట‌సీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఓరి దేవుడా సినిమా దీపావ‌ళి కానుక‌గా గ‌త నెల 21న థియేట‌ర్ల‌లో రిలీజైంది. విశ్వ‌క్‌సేన్‌, మిథిలా పాల్క‌ర్‌, ఆశాభ‌ట్ హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాకు అశ్వ‌త్ మారిముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ట్రెండింగ్ వార్తలు

Payal Rajput Rakshana Release Date: పాయల్ రాజ్‌పుత్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ డేట్ ఇదే.. వచ్చే నెలలోనే..

Pushpa 2 Anasuya First Look: పుష్ప 2 నుంచి అనసూయ ఫస్ట్ లుక్.. దాక్షాయణి మళ్లీ వచ్చింది

Devara First Single: దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది ఆ రోజే.. ఫియర్ సాంగ్ అంటూ భయపెడుతున్న మేకర్స్

Janhvi Kapoor Partner: తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన జాన్వీ కపూర్.. ఈ లక్షణాలు తప్పనిసరిగా ఉండాల్సిందేనట

అగ్ర హీరో వెంక‌టేష్ అతిథి పాత్ర‌లో క‌నిపించాడు. తాజాగా ఈ సినిమా ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్న‌ది. న‌వంబ‌ర్ 11 నుంచి ఆహా ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. గురువారం ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఆహా ఓటీటీ అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేసింది.

ఓరి దేవుడా క‌థేమిటి

ఈ సినిమాలో విశ్వ‌క్‌సేన్ అర్జున్ అనే యువ‌కుడిగా న‌టించాడు. అను అనే త‌న చిన్న‌నాటి స్నేహితురాలిని వివాహం చేసుకుంటాడు అర్జున్‌. కానీ మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో విడాకులు తీసుకోవ‌డానికి వారు సిద్ధ‌మ‌వుతారు. లైఫ్‌లో త‌న‌కు సెకండ్ ఛాన్స్ ఇవ్వ‌మ‌ని దేవుడిని కోరుకుంటాడు అర్జున్‌. నిజంగానే అర్జున్ కోరుకున్న‌ట్లుగా దేవుడు(వెంక‌టేష్‌)అత‌డికి సెకండ్ ఛాన్స్ ఇచ్చాడా? అర్జున్ జీవితంలోకి వ‌చ్చిన మీరా ఎవ‌ర‌న్న‌దే ఈ సినిమా ఇతివృత్తం.

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన ఓ మై క‌డావులే ఆధారంగా ఓరి దేవుడా రూపొందింది. త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి దేవుడి పాత్ర‌లో క‌నిపించ‌గా తెలుగులో ఆ క్యారెక్ట‌ర్‌ను వెంక‌టేష్ చేశాడు. పీవీపీ సినిమాస్‌, శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకాల‌పై ప్ర‌సాద్ వి పొట్లూరి ఈ సినిమాను నిర్మించాడు. ఓరి దేవుడా సినిమాకు త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ రాయ‌గా లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం