తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Laththi Movie Ott Release Date: థియేట‌ర్‌లో రిలీజైన ఇర‌వై రోజుల్లోనే టీవీలోకి వ‌చ్చేస్తోన్న విశాల్ లాఠీ

Laththi Movie OTT Release Date: థియేట‌ర్‌లో రిలీజైన ఇర‌వై రోజుల్లోనే టీవీలోకి వ‌చ్చేస్తోన్న విశాల్ లాఠీ

12 January 2023, 14:23 IST

  • Laththi Movie OTT Release Date: విశాల్ హీరోగా న‌టించిన లాఠీ సినిమా జ‌న‌వ‌రి 13న ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే...

విశాల్
విశాల్

విశాల్

Laththi Movie OTT Release Date: విశాల్ హీరోగా న‌టించిన లాఠీ సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్న‌ది. ఈ సినిమా స‌న్ నెక్స్ట్ ఓటీటీలో జ‌న‌వ‌రి 13న రిలీజ్ కానుంది. త‌మిళంతో పాటు తెలుగు భాష‌ల్లో లాఠీ స్ట్రీమింగ్ కాబోతున్న‌ది. అంతేకాదు ఓటీటీలో రిలీజైన మూడు రోజుల్లోనే ఈ సినిమా టీవీలో ప్రీమియ‌ర్ కానుంది.

ట్రెండింగ్ వార్తలు

Panchayat 3 Trailer: పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది.. మరింత రాజకీయం, నవ్వులతో అదిరిపోయింది

Getup Srinu: ఆ ఇద్దరు హీరోలపై నమ్మకం కుదర్లేదు.. గెటప్ శ్రీను పర్ఫెక్ట్.. డైరెక్టర్ కామెంట్స్

Suchitra Dhanush: హీరో ధనుష్ గే.. రాత్రి 3 గంటలకు నా భర్తతో ఏం పని.. సింగర్ సుచిత్ర కామెంట్స్

Maya Petika OTT: మరో ఓటీటీలోకి కూడా వచ్చేస్తున్న పాయల్ రాజ్‌పుత్ మాయా పేటిక మూవీ

పొంగ‌ల్ కానుక‌గా స‌న్ టీవీలో త‌మిళ వెర్ష‌న్ జ‌న‌వ‌రి 16న టీవీలో టెలికాస్ట్ కాబోతున్న‌ది. సాధార‌ణంగా ఓటీటీలో రిలీజైన నెల, రెండు నెలల గ్యాప్ త‌ర్వాత సినిమాలు టీవీలో ప్రీమియ‌ర్ అవుతుంటాయి. కానీ లాఠీ సినిమా మాత్రం ఓటీటీలో రిలీజైన మూడు రోజుల త‌ర్వాత టీవీలో ప్రీమియ‌ర్ కాబోతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. థియేటర్ రిలీజ్‌, టీవీ ప్రీమియ‌ర్‌కు నెల రోజుల గ్యాప్ కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన లాఠీ సినిమాకు ఏ వినోద్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

నిజాయితీప‌రుడైన పోలీస్ కానిస్టేబుల్ క‌థ‌తో లాఠీ సినిమా తెర‌కెక్కింది. రౌడీ గ్యాంగ్ నుంచి త‌న ఫ్యామిలీని ఓ కానిస్టేబుల్ ఎలా కాపాడుకున్నాడ‌నే పాయింట్‌తో రూపొందించారు. విశాల్ యాక్టింగ్ బాగున్నా క‌థ‌ను అర్థ‌వంతంగా చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు వినోద్ కుమార్ త‌డ‌బ‌డ‌టంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచింది. లాఠీ సినిమాలో సునైన హీరోయిన్‌గా న‌టించింది.

యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతాన్ని అందించాడు. లాఠీ త‌ర్వాత విశాల్ మార్కో ఆంటోనీ అనే పాన్ ఇండియ‌న్ సినిమాలో న‌టిస్తోన్నాడు. ఈ సినిమాతో పాటుగా స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తుప్ప‌రివాల‌న్ -2 సినిమా చేస్తోన్నాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం