తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Sethupathi Web Series: నేష‌న‌ల్ అవార్డ్ డైరెక్ట‌ర్‌తో విజ‌య్ సేతుప‌తి వెబ్‌సిరీస్ - స్ట్రీమింగ్ ఎందులో అంటే

Vijay Sethupathi Web Series: నేష‌న‌ల్ అవార్డ్ డైరెక్ట‌ర్‌తో విజ‌య్ సేతుప‌తి వెబ్‌సిరీస్ - స్ట్రీమింగ్ ఎందులో అంటే

01 April 2023, 13:37 IST

  • Vijay Sethupathi Web Series: ఫ‌ర్జీ త‌ర్వాత మ‌రో వెబ్‌సిరీస్‌కు విజ‌య్ సేతుప‌తి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. త‌మిళ భాష‌లో రూపొందుతోన్న ఈ సిరీస్‌కు నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే...

విజయ్ సేతుపతి తమిళ్ వెబ్ సిరీస్
విజయ్ సేతుపతి తమిళ్ వెబ్ సిరీస్

విజయ్ సేతుపతి తమిళ్ వెబ్ సిరీస్

Vijay Sethupathi Web Series: ఫ‌ర్జీ సిరీస్‌తో ఓటీటీలోకి అరంగేట్రం చేశాడు కోలీవుడ్ వెర్స‌టైల్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి. రాజ్ డీకే ద‌ర్శ‌క‌త్వంలో క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సిరీస్‌లో నిజాయితీప‌రుడైన టాస్క్‌ఫోర్స్ ఆఫీస‌ర్‌గా విజ‌య్ సేతుప‌తి న‌ట‌న‌కు విమ‌ర్శ‌లు ద‌క్కాయి.

ట్రెండింగ్ వార్తలు

OTT: ఓటీటీలో అదరగొడుతున్న అభినవ్ గోమఠం కామెడీ డ్రామా సినిమా.. మరో మైల్‍స్టోన్ దాటేసింది

Brahmamudi: డబ్బు కోసమే మాయా బిడ్డ డ్రామా.. కావ్యకు రాజ్ వార్నింగ్.. భయపడిపోయిన శైలేంద్ర.. కొత్తగా మీరా అబార్షన్ డ్రామా

OTT Movies To Watch: ఓటీటీలో ఈ వారం ఈ 4 మిస్ అవ్వొద్దు.. దేని దానికే డిఫరెంట్.. ఇక్కడ చూసేయండి మరి!

Silk Saree Movie: సీరియల్ నటుడు హీరోగా మూవీ.. సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరీగా సిల్క్ శారీ

ఈ సిరీస్‌తోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు విజ‌య్ సేతుప‌తి. తాజాగా అత‌డు మ‌రో వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ సారి త‌మిళంలో చేయ‌బోతున్నాడు.

ఈ వెబ్‌సిరీస్‌కు నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ మ‌ణికంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఈ వెబ్‌సిరీస్ తెర‌కెక్క‌బోతున్న‌ట్లు స‌మాచారం. శ‌నివారం ఈ సిరీస్‌ ఓపెనింగ్ ఈవెంట్ జ‌రిగింది.

ఈ ఫొటోల‌ను విజ‌య్ సేతుప‌తి ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు. మ‌ణికంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తొలి త‌మిళ వెబ్‌సిరీస్ చేయ‌డం ఆనందంగా ఉంద‌ని ట్వీట్ చేశాడు.

శ‌నివారం నుంచి ఈ సిరీస్ షూటింగ్ మొద‌లైన‌ట్లు స‌మాచారం. కాగా ఈ త‌మిళ వెబ్‌సిరీస్ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. గ‌తంలో మ‌ణికంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఆనంద‌వాన్ క‌ట్టాలై, క‌డాసి వ్వ‌సాయి అనే సినిమాలు చేశాడు విజ‌య్ సేతుప‌తి. మూడోసారి వీరిద్ద‌రి కాంబోలో ఓ వెబ్‌సిరీస్ రూపొందుతోండ‌టం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన కాక‌ముట్టై సినిమాకుగాను నేష‌న‌ల్ అవార్డును అందుకున్నాడు మ‌ణికంద‌న్‌.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం