తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Devarakonda - Gowtam Tinnanuri Movie: గూఢ‌చారిగా విజ‌య్ దేవ‌ర‌కొండ - జెర్సీ ద‌ర్శ‌కుడితో సినిమా ఫిక్స్‌

Vijay Devarakonda - Gowtam Tinnanuri Movie: గూఢ‌చారిగా విజ‌య్ దేవ‌ర‌కొండ - జెర్సీ ద‌ర్శ‌కుడితో సినిమా ఫిక్స్‌

13 January 2023, 19:24 IST

  • Vijay Devarakonda Gowtam Tinnanuri: విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా జెర్సీ ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రాబోతున్న‌ది. స్పై థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాను గురువారం అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ
విజ‌య్ దేవ‌ర‌కొండ

విజ‌య్ దేవ‌ర‌కొండ

Vijay Devarakonda Gowtam Tinnanuri: విజ‌య్ దేవ‌ర‌కొండ నెక్స్ట్ మూవీ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. ఖుషి, జ‌న‌గ‌ణ‌మ‌న సెట్స్‌పై ఉండ‌గానే మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. జెర్సీ ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరితో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. గురువారం ఈ సినిమాను అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Madgaon Express OTT: ఓటీటీలోకి వచ్చేసిన యానిమల్ యాక్టర్ సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

Yuvaraj OTT: ఓటీటీలోకి వ‌చ్చేసిన కాంతార‌ హీరోయిన్ యాక్ష‌న్ డ్రామా మూవీ - తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!

Bollywood Actor: 200 సినిమాల్ని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ న‌టుడు - సూప‌ర్‌స్టార్ కావాల్సినోడు .. సీరియ‌ల్స్ చేస్తోన్నాడు

Prabhas Marriage: ప్రభాస్ లైఫ్‌లోకి స్పెషల్ పర్సన్.. కాబోయే భార్య గురించేనా డార్లింగ్ పోస్ట్?

సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ , ఫార్ఛ్యూన్ ఫోర్ ప‌తాకాల‌పై నాగ‌వంశీ , సాయి సౌజ‌న్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, గౌత‌మ్ తిన్న‌నూరి సినిమా అనౌన్స్‌మెంట్‌తో పాటు కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో పోలీస్ దుస్తుల్లో ఓ వ్య‌క్తి క‌నిపిస్తున్నాడు. అత‌డు ఎవ‌ర‌న్న‌ది తెలియ‌కుండా ముఖానికి ముసుగు ధ‌రించి ఉండ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

నేను ఎక్క‌డివాడినో, ఎవ‌రిని మోసం చేశాను తెలియ‌దు అంటూ పోస్ట‌ర్‌పై ఉన్న అక్ష‌రాలు ఆస‌క్తిని రేకెత్తిస్తోన్నాయి. అజ్ఞాత గూఢ‌చారి అంటూ క్యాప్ష‌న్ చివ‌ర‌లో ఉన్న అక్ష‌రాలు చూస్తుంటే విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమాలో స్పైగా క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

స‌ముద్ర తీర ప్రాంతం, మంట‌ల్లో కాలిపోతున్న ప‌డ‌వ‌లు పోస్ట‌ర్‌లో క‌నిపిస్తున్నాయి. స్పై థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభంకాబోతున్న‌ట్లు తెలిసింది. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తోన్న 12వ సినిమా ఇది. ఇందులో అత‌డి క్యారెక్ట‌ర్ కొత్త కోణంలో సాగుతుంద‌ని స‌మాచారం.

ప్ర‌స్తుతం శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో ప్యూర్ ల‌వ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాలో స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తోంది.

అలాగే లైగ‌ర్ త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్‌తో జ‌న‌గ‌ణ‌మ‌న అనే సినిమాను అనౌన్స్ చేశాడు. లైగ‌ర్ డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌డంతో ఈ సినిమా ఆగిపోయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ‌రోవైపు బాలీవుడ్ జెర్సీకి ముందే రామ్‌చ‌ర‌ణ్‌తో ఓ సినిమా క‌మిట్ అయ్యాడు ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి. క‌థ విష‌యంలో పూర్తిస్థాయిలో సంతృప్తి రాక‌పోవ‌డంతో రామ్‌చ‌ర‌ణ్ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. రామ్‌చ‌ర‌ణ్‌కు సిద్ధం చేసిన క‌థ‌తోనే విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాను గౌత‌మ్ తిన్న‌నూరి తెర‌కెక్కిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం