తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Deverakonda | విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ ‘జేజీఎమ్’ ముంబైలో షురూ...

Vijay Deverakonda | విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ ‘జేజీఎమ్’ ముంబైలో షురూ...

Nelki Naresh HT Telugu

29 March 2022, 15:18 IST

    • విజయ్ దేవ‌ర‌కొండ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ‘జేజీఎమ్’ (జనగణమన) మంగ‌ళ‌వారం ముంబైలో లాంఛ‌నంగా మొద‌లైంది. చిత్ర‌బృందం విడుద‌ల‌చేసిన పోస్ట‌ర్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి
జేజీఎమ్ సినిమా
జేజీఎమ్ సినిమా (twitter)

జేజీఎమ్ సినిమా

‘లైగ‌ర్’ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌,పూరి జ‌గ‌న్నాథ్ క‌ల‌యిక‌లో మ‌రో పాన్ ఇండియన్ చిత్రం రాబోతున్నది. ‘జేజీఎమ్’ (జనగణమన) పేరుతో తెర‌కెక్కుతున్న ఈ సినిమా మంగళవారం ముంబైలో లాంఛ‌నంగా మొద‌లైంది. ఈ సినిమాతో ద‌ర్శ‌కుడు వంశీపైడిప‌ల్లి నిర్మాత‌గా అరంగేట్రం చేయ‌బోతున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మిలతో క‌లిసి ఆయ‌న ఈ సినిమాను నిర్మించ‌నున్నారు. 

ట్రెండింగ్ వార్తలు

Murari Movie: మురారి సినిమాలో మహేశ్‍కు జీడీగా సోనాలీ కంటే ముందు ఈ బాలీవుడ్ భామను అనుకున్నారట!

Chandini Chowdary: కొత్తగా పెళ్లైన జంట ఎదుర్కొనే సమస్యతో మూవీ- గామి హీరోయిన్ చాందినీ చౌదరి మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

OTT Horror Movie: ఓటీటీలో భయపెట్టనున్న సరికొత్త హారర్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్! ఎక్కడంటే?

Siddharth40: సిద్ధార్థ్ హీరోగా 40వ సినిమా.. తెలుగు తమిళంలో ద్విభాషా చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?

యాక్ష‌న్ ఎంటర్ టైనర్ గా ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ సినిమా పోస్ట‌ర్‌ను మంగళవారం విడుద‌లచేశారు. ఇందులో ఆర్మీ సోల్జ‌ర్స్ లైఫ్ జాకెట్స్ ధ‌రించి ఆకాశం నుంచి భూమిపైకి దూకుతూ క‌నిపిస్తున్నారు. వారి పైకి యుద్ద రాకెట్స్ దూసుకువ‌స్తుండ‌టం ఆస‌క్తిని పంచుతోంది. వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతున్న‌ట్లుగా స‌మాచారం. జేజీఎమ్ పేరుతో టైటిల్ షార్ట్‌క‌ట్‌గా చూపించ‌డం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఏప్రిల్ నుండిఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది. 

వ‌చ్చే ఏడాది ఆగ‌స్ట్ 3న ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు పేర్కొన్నారు. త‌న కెరీర్‌లోనే ఛాలెంజింగ్ స్ర్కిప్ట్ ఇద‌ని,ప్ర‌తి భార‌తీయుడి హృద‌యాన్ని క‌దిలించేలా స్ఫూర్తిదాయ‌కంగా ఈ సినిమా ఉంటుంద‌ని ప్రారంభోత్స‌వ వేడుక‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ అన్నారు. పూరి జ‌గ‌న్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో భాగం కావ‌డం గ‌ర్వంగా ఉంద‌ని తెలిపారు. అల్టిమేట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంద‌ని పూరి జ‌గ‌న్నాథ్ అన్నారు. తెలుగు,హిందీ,మ‌ల‌యాళం,క‌న్న‌డ‌,త‌మిళ భాష‌ల్లో ఈ సినిమాను విడుద‌ల‌చేయ‌బోతున్నారు.

 

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం