తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Venkatesh: జాతిరత్నాలు దర్శకుడితో వెంకటేశ్ మూవీ.. వినోదానికే కొరతే ఉండదేమో?

Venkatesh: జాతిరత్నాలు దర్శకుడితో వెంకటేశ్ మూవీ.. వినోదానికే కొరతే ఉండదేమో?

16 July 2022, 15:27 IST

    • విక్టరీ వెంకటేష్ తన తర్వాతి చిత్రాన్ని ఇంతవరకు ప్రకటించలేదు. అయితే ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఆయన జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కేవీతో ఓ సినిమాకు ఓకే చెప్పేశారని టాక్ వినిపిస్తోంది.
అనుదీప్ కేవీతో వెంకటేశ్ చిత్రం
అనుదీప్ కేవీతో వెంకటేశ్ చిత్రం (Twitter)

అనుదీప్ కేవీతో వెంకటేశ్ చిత్రం

టాలీవుడ్‌లో రీమేక్‌లు చేయడంలో దిట్ట ఎవరైన ఉన్నారంటే అది విక్టరీ వెంకటేశే. ఆయన సినిమాల్లో చాలా వరకు ఇతర భాషల్లో హిట్ కొట్టి అరవు తెచ్చుకున్న కథలే ఎక్కువగా ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో ఆయన ట్రాక్ మార్చి ఒరిజినల్‌ కథలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ వేసవిలో ఎఫ్3తో సందడి చేసిన వెంకీ మామ.. పెళ్లి చూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్‌తో ఓ సినిమా చేసేందుకు పచ్చ జెండా ఊపాడు. అయితే ఈ సినిమా ఇంకా కార్యరూపం దాల్చలేదు. తాజాగా మరో యువ దర్శకుడికి వెంకీ ఓకే చెప్పినట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

Thug Life Movie: ఆ విషయంలో రికార్డు సృష్టించిన కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ సినిమా!

Hotstar OTT Top-10: కొనసాగుతున్న మంజుమ్మల్ బాయ్స్ జోరు.. ఇంకా ఫస్ట్ ప్లేస్‍లోనే.. హాట్‍స్టార్ ఓటీటీలో టాప్-10 లిస్ట్ ఇదే

Krishnamma Day 3 Collections: కృష్ణమ్మ సినిమా కలెక్షన్ల జోరు.. తొలి రోజు కంటే మూడో రోజు ఎక్కువగా..

Mahesh Babu - Ram Charan: ఓటేసిన మహేశ్ బాబు, రామ్‍చరణ్.. స్టైలిష్ లుక్‍లో స్టార్ హీరోలు

ఇంతకీ ఆ యువ దర్శకుడు ఎవరో కాదు.. జాతిరత్నాలతో సూపర్ హిట్ కొట్టిన అనుదీప్ కేవీతో వెంకటేశ్ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అనుదీప్ వెంకీ మామను కలిసి స్టోరీ ఐడియా కూడా చెప్పేశారట. ఆ ఐడియా వెంకటేశ్‌కు కూడా నచ్చిందని సమాచారం.

ప్రస్తుతం అనుదీప్ తెలుగు, తమిళంలో శివాకార్తికేయన్ హీరోగా ఓ ద్విభాషా సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రిన్స్ అనే టైటిల్ పెట్టారు. దీపావళి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత వెంకీతో ప్రాజెక్టును అనుదీప్ ప్రారంభించనున్నారట. అన్నీ కుదిరితే ఈ డిసెంబరులో వెంకీ-అనుదీప్ చిత్రం పట్టాలెక్కే అవకాశముందని సమాచారం.

ఈ వేసవిలో ఎఫ్3తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేశ్.. సాలిడ్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న ఆయన.. ఇంతవరకు కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. అయితే బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌తో కభీ ఈద్ కభీ దివాలీ అనే చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం