తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gandeevadhari Arjuna Release Date: వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్టైలిష్ యాక్షన్ మూవీగా..

Gandeevadhari Arjuna Release Date: వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్టైలిష్ యాక్షన్ మూవీగా..

07 June 2023, 19:10 IST

  • Gandeevadhari Arjuna Release Date: గాండీవధారి అర్జున చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. 

Gandeevadhari Arjuna Release Date: వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్టైలిష్ యాక్షన్ మూవీగా.. (Photo: SVCC)
Gandeevadhari Arjuna Release Date: వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్టైలిష్ యాక్షన్ మూవీగా.. (Photo: SVCC)

Gandeevadhari Arjuna Release Date: వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్టైలిష్ యాక్షన్ మూవీగా.. (Photo: SVCC)

Gandeevadhari Arjuna Release Date: మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న గాండీవధారి అర్జున నుంచి బిగ్ అప్‍డేట్ వచ్చింది. ఈ చిత్రం విడుదల తేదీని మూవీ యూనిట్ అధికారంగా ప్రకటించింది. అలాగే వరుణ్ తేజ్ నయా లుక్‍ను కూడా రివీల్ చేసింది. గన్ పట్టుకొని సూటు ధరించి స్టైలిష్ లుక్‍లో వరుణ్ తేజ్ ఈ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ఉన్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

Indian 2 Update: స్పోర్ట్స్ ఛానెల్‌లో వినూత్నంగా ఇండియన్ 2.. ఫస్ట్ సింగిల్‌ వచ్చేది ఆరోజే!

Malayalam Movies Box office: నాలుగు నెలల్లోనే రూ.1000 కోట్లు.. మలయాళం సినిమా బ్లాక్‌బస్టర్

Chiranjeevi Getup Srinu: గెటప్ శ్రీనుపై చిరంజీవి ప్రశంసలు.. అలనాటి కామెడీ హీరో గుర్తుకు వస్తున్నారంటూ!

Sriranga Neethulu OTT: ఓటీటీలోకి ఆలస్యంగా సుహాస్ శ్రీరంగనీతులు.. రిలీజ్ డేట్ ఇదే! స్ట్రీమింగ్ ఎక్కడంటే?

గాండీవధారి అర్జున సినిమా ఆగస్టు 25వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని ఈ మూవీని నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర (SVCC) అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు నేడు ఓ ట్వీట్ చేసింది. పెద్ద స్క్రీన్‍లపై బ్లేజింగ్ యాక్షన్‍ చూడండి అంటూ పేర్కొంది.

గాండీవధారి అర్జున సినిమాకు యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ చేస్తున్నారు. ఈ చిత్రం కూడా పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండనుంది. వరుణ్ తేజ్ లుక్ మాత్రం చాలా స్టైలిష్‍గా ఉంది. ఇప్పుడు విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్‌లోనూ తేజ్ కొత్తగా కనిపిస్తున్నారు. సూటు ధరించిన వరుణ్ చేతిలో గన్ ఉండగా.. ముందు ఓ బాక్సుపై హ్యాండ్ గ్రనైడ్ ఉంది. ఇక ఆయుధాలు ఉన్న బాక్సులు కూడా పక్కన ఉన్నాయి. బ్యాక్‍గ్రౌండ్‍లో బ్లాస్ట్‌ జరుగుతున్నాయి. దీంతో ఈ మూవీలో యాక్షన్ బద్దలయ్యేలా ఉంది.

బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ గాండీవధారి మూవీని నిర్మిస్తుండగా.. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్‍గా నటిస్తోంది. ప్యూర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రవీణ్ సత్తారు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ జానర్ వరుణ్‍కు కొత్తదే అయినా.. ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్లలో అతడి లుక్ మాత్రం అదిరిపోయింది.

వరుణ్ తేజ్ చివరగా ఎఫ్3 సినిమాతో ప్రేక్షకులకు కనిపించారు. ఆ మూవీ మోస్తరు ఫలితాన్ని ఇచ్చింది. అంతకు ముందు గని మూవీ పరాజయం పాలైంది. దీంతో గాండీవధారి అర్జున సినిమా సక్సెస్ అవడం వరుణ్‍కు ముఖ్యంగా ఉంది. ప్రవీణ్ సత్తారు గత మూవీ ఘోస్ట్ కూడా విజయం సాధించలేకపోయింది. దీంతో వీరిద్దరికీ ఈ మూవీ హిట్ అవడం చాలా కీలకంగా ఉంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం