తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salman Khan Trisha Movie: ప‌ద‌మూడేళ్ల త‌ర్వాత బాలీవుడ్‌లోకి త్రిష రీఎంట్రీ - స‌ల్మాన్ ఖాన్ మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్‌

Salman Khan Trisha Movie: ప‌ద‌మూడేళ్ల త‌ర్వాత బాలీవుడ్‌లోకి త్రిష రీఎంట్రీ - స‌ల్మాన్ ఖాన్ మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్‌

29 December 2023, 11:56 IST

  • Salman Khan Trisha Movie: దాదాపు 13 ఏళ్ల‌ విరామం అనంత‌రం త్రిష బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. స‌ల్మాన్ ఖాన్, పంజా ఫేమ్ విష్ణువ‌ర్ధ‌న్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న బాలీవుడ్ మూవీలో త్రిష హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

స‌ల్మాన్ ఖాన్, త్రిష
స‌ల్మాన్ ఖాన్, త్రిష

స‌ల్మాన్ ఖాన్, త్రిష

Salman Khan Trisha Movie: లియో మూవీతో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ అందుకున్న‌ది త్రిష‌. ఈ మూవీతో కోలీవుడ్‌లోకి అదిరిపోయే క‌మ్‌బ్యాక్ ఇచ్చిన త్రిష తాజాగా బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. ప‌ద‌మూడేళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత హిందీలో ఓ మూవీకి త్రిష గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Game Changer Release Date:రామ్ కోసం భీమ్ త్యాగం...దేవ‌ర డేట్‌కు థియేట‌ర్ల‌లోకి వ‌స్తోన్న గేమ్‌ఛేంజ‌ర్‌

Pawan Kalyan Vote: హెలికాప్టర్‌లో వచ్చి ఓటేసిన పవన్ కల్యాణ్ దంపతులు.. ఫొటోలు, వీడియోలు వైరల్

Allu Arjun Vote: అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నాడా? నంద్యాలో వైఎస్సార్సీపీ అభ్యర్థికి మద్దతుపై ఇదీ అతని సమాధానం

Bhale Unnade OTT: థియేట‌ర్ల‌లో రిలీజ్‌కు ముందే రాజ్‌త‌రుణ్ భ‌లే ఉన్నాడే ఓటీటీ డీల్ క్లోజ్ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

స‌ల్మాన్‌ఖాన్‌తో రొమాన్స్ చేయ‌బోతున్న‌ది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పంజా ఫేమ్ విష్ణువ‌ర్ధ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ల్మాన్ ఖాన్ హీరోగా ది బుల్ పేరుతో ఓ మూవీ తెర‌కెక్కుతోంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా న‌టిస్తోంది.

సౌత్‌లో అగ్ర హీరోయిన్ల‌లో ఒక‌రిగా చెలామ‌ణి అయిన త్రిష బాలీవుడ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఒకే ఒక సినిమా చేసింది. 2010లో అక్ష‌య్ కుమార్ హీరోగా న‌టించిన క‌ట్టా మీటా సినిమాతో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది త్రిష‌. క‌ట్టా మీటా త‌ర్వాత హిందీలో అవ‌కాశాలు వ‌చ్చినా ద‌క్షిణాదిలో బిజీగా ఉండ‌టంతో ఆ ఆఫ‌ర్స్‌ను తిర‌స్క‌రించింది.

ది బుల్.. త్రిష హిందీలో న‌టిస్తోన్న సెకండ్ మూవీ కావ‌డం గ‌మ‌నార్హం. ది బుల్ మూవీకి క‌ర‌ణ్ జోహార్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. దాదాపు 25 ఏళ్ల అనంత‌రం స‌ల్మాన్ ఖాన్‌, క‌ర‌ణ్ జోహార్ క‌లిసి సినిమా చేస్తోండటం బాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. కాగా ప్ర‌స్తుతం త్రిష తెలుగులో చిరంజీవి విశ్వంభ‌ర‌లో హీరోయిన్‌గా న‌టిస్తోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం