తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tiger 3 Ott Release Date: టైగర్ 3 ఓటీటీ రిలీజ్ ఆలస్యం.. ఆ స్పెషల్ డే రోజున రానుందా!

Tiger 3 OTT Release Date: టైగర్ 3 ఓటీటీ రిలీజ్ ఆలస్యం.. ఆ స్పెషల్ డే రోజున రానుందా!

13 December 2023, 14:08 IST

    • Tiger 3 OTT Release Date: టైగర్ 3 సినిమా ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యమవుతోంది. ఈ మూవీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందో అంచనాలు బయటికి వచ్చాయి. ఆ వివరాలివే..
Tiger 3 OTT Release Date: టైగర్ 3 ఓటీటీ రిలీజ్ ఆలస్యం.. ఆ స్పెషల్ డే రోజున రానుందా!
Tiger 3 OTT Release Date: టైగర్ 3 ఓటీటీ రిలీజ్ ఆలస్యం.. ఆ స్పెషల్ డే రోజున రానుందా!

Tiger 3 OTT Release Date: టైగర్ 3 ఓటీటీ రిలీజ్ ఆలస్యం.. ఆ స్పెషల్ డే రోజున రానుందా!

Tiger 3 OTT Release Date: బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘టైగర్ 3’ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. నవంబర్ 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా రూ.450కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది. యశ్‍రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్‌లో భాగంగా టైగర్ 3 చిత్రానికి మనీశ్ శర్మ దర్శకత్వం వహించారు. కత్రినా కైఫ్ హీరోయిన్‍గా చేశారు. అయితే, టైగర్-3 మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యమైంది.

ట్రెండింగ్ వార్తలు

Pavithra Jayaram: టీవీ సీరియల్ నటి మృతి.. తిరిగి రావా అంటూ భర్త చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్

Kannappa Teaser Date: కన్నప్ప సినిమా టీజర్ రిలీజ్‍కు డేట్ ఖరారు.. ప్రతిష్టాత్మక వేదికపై..

Aha ott top trending: సుడిగాలి సుధీర్ షోనే టాప్.. ఆహా ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు, షోలు ఇవే

Keerthy Suresh: కీర్తి సురేష్ దూకుడు మామూలుగా లేదు.. ఆ స్టార్ బాలీవుడ్ నటుడి పక్కన ఛాన్స్!

టైగర్ 3 సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో డిసెంబర్ 12న స్ట్రీమింగ్‍కు రానుందని బజ్ నడిచింది. ఆ రోజున స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వస్తుందని లీకులు వచ్చాయి. అయితే, టైగర్-3 మూవీ డిసెంబర్ 12న స్ట్రీమింగ్‍కు రాలేదు. అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా ఈ విషయంపై ఇంకా అప్‍డేట్ ఇవ్వలేదు. అయితే, టైగర్ 3 మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఓ స్పెషల్ డేను సెలెక్ట్ చేసుకుందని అంచనాలు వెలువడుతున్నాయి.

టైగర్ 3 చిత్రాన్ని డిసెంబర్ 31వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని అమెజాన్ ప్రైమ్ వీడియో ఆలోచిస్తున్నట్టుగా తాజాగా అంచనాలు చక్కర్లు కొడుతున్నాయి. 2023 సంవత్సరం చివరి రోజైన స్పెషల్ డే డిసెంబర్ 31న ఈ చిత్రం స్ట్రీమింగ్ మొదలుపెట్టాలని అనుకుంటోందట. అయితే, ఈ విషయంపైనా ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మరి, ప్రైమ్ వీడియో ఏం చేస్తుందో చూడాలి. ఇక, టైగర్ 3 మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ స్ట్రీమింగ్‍కు వస్తుంది.

టైగర్ 3 మూవీలో ఇమ్రాన్ హష్మి, రేవతి, సిమ్రన్, రిధి డోగ్రా, విశాల్ జెత్వా, కుముద్ మిశ్రా కీలకపాత్రలు పోషించారు. ప్రీతమ్, తన్జూ టింకూ ఈ మూవీకి సంగీతం అందించారు. స్పై ఏజెంట్లుగా సల్మాన్, కత్రినా కైఫ్ యాక్షన్ సీన్లు టైగర్-3కి హైలైట్‍గా నిలిచాయి. షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ క్యామియోలు కూడా ఆకట్టుకున్నాయి.

టైగర్ 3 చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. సుమారు రూ.300కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందినట్టు అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.465కోట్ల వసూళ్లను రాబట్టింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం