తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nani 30 Unveiled: నాని తదుపరి సినిమా నుంచి క్రేజీ అప్డేట్.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్

Nani 30 Unveiled: నాని తదుపరి సినిమా నుంచి క్రేజీ అప్డేట్.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్

01 January 2023, 19:00 IST

    • Nani 30 Unveiled: నేచురల్ స్టార్ నాని తన తదుపరి చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమాకు సంబంధించిన వీడియోను విడుదల చేశాడు. మరోసారి ఫీల్ గుడ్ మూవీకి శ్రీకారం చుట్టినట్లు ఈ వీడియోను చూస్తే తెలుస్తోంది.
నాని 30
నాని 30

నాని 30

Nani 30 Unveiled: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్‌పైకి ఉండగానే మరో చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఇది అతడు నటించబోయే 30వ చిత్రం. వైర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాతలు మోహన్ చేరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ను రెండు రోజుల క్రితమే మేకర్స్ ప్రకటించగా.. తాజాగా ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Pushpa 2 Anasuya First Look: పుష్ప 2 నుంచి అనసూయ ఫస్ట్ లుక్.. దాక్షాయణి మళ్లీ వచ్చింది

Devara First Single: దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది ఆ రోజే.. ఫియర్ సాంగ్ అంటూ భయపెడుతున్న మేకర్స్

Janhvi Kapoor Partner: తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన జాన్వీ కపూర్.. ఈ లక్షణాలు తప్పనిసరిగా ఉండాల్సిందేనట

Panchayat 3 Trailer: పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది.. మరింత రాజకీయం, నవ్వులతో అదిరిపోయింది

న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ #Nani30 వరల్డ్‌ను ఆవిష్కరిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోను గమనిస్తే.. నాని ఓ భవనంపై కూర్చుని ఫొటోలు క్లిక్ చేస్తూ తన తదుపరి ప్రాజెక్టు గురించి తన ఆన్ స్క్రీన్ కుమార్తేతో చర్చిస్తున్నట్లు ఉంటుంది. దసరా చిత్రానికి పెంచిన గడ్డాన్ని, మీసాన్ని తొలగిస్తానని నాని అంటాడు. ఇందుకు మీసం వద్దులే నాన్న అంటూ నాని కుమార్తే బదులిస్తుంది.

ఈ వీడియోను చూస్తుంటే ఇది వైవిధ్యమైన కథతో రానున్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా అనిపిస్తోంది. తండ్రి-కూతుళ్ల మధ్య ఉన్న బాండింగ్‌ను ఇందులో చూపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వీడియోలో ఈ సినిమాకు పనిచేయబోయే ప్రధాన సాంకేతిక నిపుణులను కూడా ప్రకటించారు. నూతన దర్శకుడు శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించనుంది.

మలయాళ సినిమా హృదయం లాంటి సూపర్ హిట్‌కు సంగీతాన్ని సమకూర్చిన హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ వీడియో కోసం రూపొందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరే అద్భుతంగా ఉంది. మంచి ఫీల్ గుడ్‌ను, పాజిటివీ వైబ్‌ను ఇస్తుంది. సాను జాన్ వర్గీస్ ఐఎస్‌సీ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. జెర్సీ, శ్యామ్ సింగరాయ్ తర్వాత నానితో వర్గీస్ చేయనున్న మూడో సినిమా ఇదే.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం