తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vaarasudu First Look:దళపతి విజయ్‌, వంశీ పైడిపల్లి 'వారసుడు' ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

Vaarasudu First Look:దళపతి విజయ్‌, వంశీ పైడిపల్లి 'వారసుడు' ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

Hari Prasad S HT Telugu

21 June 2022, 21:50 IST

    • దళపతి విజయ్‌ నటిస్తున్న తొలి స్ట్రెయిట్‌ తెలుగు ఫిల్మ్‌ వారసుడు. అతని 66వ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ రిలీజైంది.
వారసుడు మూవీలో విజయ్
వారసుడు మూవీలో విజయ్ (Twitter)

వారసుడు మూవీలో విజయ్

నేషనల్ అవార్డ్‌ విన్నింగ్ డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి, తమిళ సూపర్‌ స్టార్‌ దళపతి విజయ్‌లాంటి క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ఫ్యాన్స్‌లో ఎంతగానో ఆసక్తి రేపుతోంది. ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేసినప్పటి నుంచీ దీనికి సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇందులో విజయ్‌ సరసన టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లలో ఒకరైన రష్మికా మందన్నా యాక్ట్‌ చేస్తుండటం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

NNS May 17th Episode: మళ్లీ భూలోకానికి అరుంధతి.. ఈసారి యముడు కూడా.. అమర్​కి తలంటిన భాగీ.. పిల్లలను రెచ్చగొట్టిన మనోహరి

Brahmamudi May 17th Episode: బ్రహ్మముడి- అనామికకు కల్యాణ్ విడాకులు- లేచిపోదామన్న అప్పు- తాతయ్య వార్నింగ్- కావ్యకు 2 డేస్

Ntr Prashanth Neel Movie: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీ టైటిల్ ఇదేనా? - కేజీఎఫ్‌కు మించి యాక్ష‌న్‌…ఎలివేష‌న్స్?

Krishna mukunda murari serial:ముకుందకు మురారి సేవలు.. మీరా నెల తప్పిందన్న భవానీ, షాక్ లో కృష్ణ

ఈ మూవీ ఇప్పటికే రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు విజయ్‌ బర్త్‌డేకు ముందు రోజు ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఈ మూవీకి వారసుడు అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఇందులో విజయ్‌ స్టన్నింగ్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. త్రీ పీస్‌ గ్రే సూట్‌లో విజయ్‌ బాస్‌ లుక్‌లో అదరగొట్టాడు. వారసుడు మూవీ ద బాస్‌ రిటర్న్స్‌ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోంది.

దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా తన గత షెడ్యూల్‌లో విజయ్‌, రష్మికలపై కీలక సీన్లను చిత్రీకరించింది. ఈ మూవీలో ప్రభు, శరత్‌ కుమార్‌, ప్రకాశ్‌ రాజ్‌, జయసుధ, శ్రీకాంత్‌, సంగీతలాంటి భారీ తారాగణం నటిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్‌ వంశీ పైడిపల్లే కథ కూడా రాశాడు. ఇది భారీ బడ్జెట్‌తో వస్తున్న సినిమా. థమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్‌ చేయనున్నారు.

<p>వారసుడు ఫస్ట్ లుక్</p>

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం