తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suriya Kanguva: కంగువ మూవీపై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన సూర్య

Suriya Kanguva: కంగువ మూవీపై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన సూర్య

Hari Prasad S HT Telugu

10 January 2024, 20:53 IST

    • Suriya Kanguva: తన కంగువ మూవీపై కోలీవుడ్ స్టార్ సూర్య అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ఈ మూవీలో అతడు తన చివరి సీన్ షూట్ చేసినట్లు వెల్లడించాడు. ఈ సందర్భంగా ఓ ఫొటో షేర్ చేశాడు.
కంగువ మూవీలో సూర్య
కంగువ మూవీలో సూర్య

కంగువ మూవీలో సూర్య

Suriya Kanguva: తమిళ స్టార్ హీరో సూర్య నటించిన కంగువ మూవీ ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాపై బుధవారం (జనవరి 10) సూర్య ఓ అప్‌డేట్ ఇచ్చాడు. పైన ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. సినిమాలో తన చివరి సీన్ షూటింగ్ చేసినట్లు అతడు చెప్పడం విశేషం. భారీ బడ్జెట్ తో కంగువ మూవీ రానుంది.

ట్రెండింగ్ వార్తలు

Tabu in Dune series: ఆ ఇంగ్లిష్ వెబ్ సిరీస్‌లో కీలకపాత్ర చేయబోతున్న బాలీవుడ్ నటి

Guppedantha Manasu May 14th Episode: గుప్పెడంత మనసు- తన ఉచ్చులో తానే పడిన శైలేంద్ర- పిచ్చోడిన చేసిన మహేంద్ర, వసుధార

GV Prakash Kumar: పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత భార్యతో విడిపోయిన మ్యూజిక్ డైరెక్టర్.. మానసిక ప్రశాంతత కోసమే అంటూ..

Krishna mukunda murari serial: కృష్ణని గొడ్రాలన్న మీరా.. ముకుందకు ప్రపోజ్ చేసేందుకు ఫిక్స్ అయిన ఆదర్శ్

శివ డైరెక్షన్ లో వస్తున్న కంగువ మూవీలో సూర్య ఓ వారియర్ గా కనిపిస్తున్నాడు. పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ లెవల్లో ఈ సినిమా రానుంది. ఇండియన్ భాషల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జపనీస్, కొరియన్ లాంటి పలు విదేశీ భాషల్లోనూ రానుంది. అయితే ఈ సినిమాలో తన చివరి సీన్ షూటింగ్ పూర్తి చేసినట్లు తాజాగా సోషల్ మీడియా ఎక్స్ ద్వారా సూర్య చెప్పాడు.

"కంగువలో నా చివరి షాట్ పూర్తయింది. మొత్తం మూవీ యూనిట్ సానుకూలంగా ఉంది. ఇది ఒకదానికి ముగింపు కాగా.. మరెన్నింటికో ఆరంభం. మంచి జ్ఞాపకాలు అందించిన డైరెక్టర్ శివ, టీమ్ కు థ్యాంక్స్. కంగువ నాకు చాలా స్పెషల్. మీ అందరూ ఈ సినిమాను స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేయడం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని సూర్య ట్వీట్ చేశాడు.

ఈ సందర్భంగా మూవీలోని తన ఫొటోను పోస్ట్ చేశాడు. ఈ కంగువ మూవీ 3డీలోనూ రిలీజ్ కానుంది. కంగువ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఈ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కిస్తోంది.

గతేడాది జులైలోనే కంగువ గ్లింప్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూర్య బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ గిఫ్ట్ ఇచ్చారు. ఈ గ్లింప్స్ రిలీజైన తొలి 24 గంటల్లోనే ఏకంగా 2.2 కోట్ల వ్యూస్ రావడం విశేషం. ఇక సుమారు 7 లక్షల లైక్స్ కూడా వచ్చాయి. ఒక్క రోజులో అత్యధిక వ్యూస్ సాధించిన గ్లింప్స్ గా కంగువ నిలిచింది. సూర్య మూవీపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో చెప్పడానికి ఇదే నిదర్శనం.

కంగువ గురించి పెద్దగా డిటేల్స్ బయటకు రాక ముందే ఈ మూవీ డిజిటల్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తం చెల్లించడం ఆశ్చర్యం కలిగించింది. ఏకంగా రూ.80 కోట్లతో హక్కులను సొంతం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అది కూడా సౌతిండియా భాషలైన తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వరకూ ఇంత మొత్తం చెల్లించారు. ఇక హిందీ కోసం ఎంతనేది తెలియలేదు.

ఇక 2024లో రానున్న మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో ఇదీ ఒకటి. కోలీవుడ్ లో దళపతి విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ తోపాటు ఈ కంగువ కూడా ఆసక్తి రేపుతోంది. మరోవైపు కమల్ హాసన్ ఇండియన్ 2 కూడా ఈ ఏడాదే రిలీజ్ కాబోతోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం