తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suriya 43 Announced: సూర్య 43 అప్‌డేట్ అదిరిపోయింది.. సిల్వర్ స్క్రీన్‌పై సూర్య, దుల్కర్, విజయ్

Suriya 43 announced: సూర్య 43 అప్‌డేట్ అదిరిపోయింది.. సిల్వర్ స్క్రీన్‌పై సూర్య, దుల్కర్, విజయ్

Hari Prasad S HT Telugu

26 October 2023, 20:11 IST

    • Suriya 43 announced: సూర్య 43 మూవీ అప్‌డేట్ అదిరిపోయింది. సిల్వర్ స్క్రీన్‌పై సూర్య, దుల్కర్ సల్మాన్, విజయ్ వర్మ కలిసి నటించనున్నారు. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సుధ కొంగరే ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండటం విశేషం.
సూర్య 43లో కలిసి నటించనున్న సూర్య, దుల్కర్ సల్మాన్, విజయ్ వర్మ
సూర్య 43లో కలిసి నటించనున్న సూర్య, దుల్కర్ సల్మాన్, విజయ్ వర్మ

సూర్య 43లో కలిసి నటించనున్న సూర్య, దుల్కర్ సల్మాన్, విజయ్ వర్మ

Suriya 43 announced: సూర్య 43వ సినిమా అనౌన్స్‌మెంట్ గురువారం (అక్టోబర్ 26) వచ్చింది. మూడేళ్ల కిందట సూరారై పొట్రు సినిమాతో నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న సుధ కొంగరతోనే సూర్య ఈ మూవీ చేస్తుండటం విశేషం. అంతేకాదు ఈ సినిమాలో సూర్యతోపాటు సిల్వర్ స్క్రీన్ పై దుల్కర్ సల్మాన్, విజయ్ వర్మ కూడా నటిస్తుండటం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

Prabhas: నా బుజ్జిని చూస్తారా: కల్కి 2898 ఏడీపై ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్

Prasanna Vadanam OTT Release date: ప్రసన్న వదనం ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఇలా చేస్తే 24 గంటలు ముందుగానే చూడొచ్చు..

Devara fear song promo: దేవర ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ప్రోమో చూశారా.. అదిరిపోయిన బీజీఎం

Suresh Babu on Theatres: ఓటీటీ మమ్మల్ని దెబ్బ కొడుతోంది.. థియేటర్లలను ఫంక్షన్ హాల్స్‌గా మార్చాల్సిందే: సురేశ్ బాబు

2020లో వచ్చిన సూరారై పొట్రు (ఆకాశమే నీ హద్దురా) సినిమాకుగాను సూర్య, సుధ కొంగర ఇద్దరూ నేషనల్ అవార్డులు గెలుచుకున్నారు. ఇప్పుడీ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుండటంతో అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. తన 43వ సినిమా అనౌన్స్‌మెంట్ ను సూర్యనే సోషల్ మీడియా ఎక్స్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

"మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం. సుధ కొంగరతో మరో సినిమా చేస్తున్నాను. జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అతనికిది 100వ సినిమా. నా సోదరుడు దుల్కర్ సల్మాన్, టాలెంటెడ నజ్రియా, పర్ఫార్మెన్స్ ఛాంప్ విజయ్ వర్మతో కలిసి పని చేయడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను. 2డీ ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ స్పెషల్ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది" అని సూర్య ట్వీట్ చేశాడు.

సూర్య ట్వీట్ పై జీవీ ప్రకాశ్ కుమార్ రియాక్ట్ అయ్యాడు. అతడు ఫైర్ ఎమోజీలను పోస్ట్ చేశాడు. సూరారై పొట్రు సినిమాకుగాను జీవీ ప్రకాశ్ కూడా బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కేటగిరీలో నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు. అటు విజయ్ వర్మ కూడా సూర్య 43 మూవీని అనౌన్స్ చేశాడు. సూర్య 43లో ఎంతో టాలెంట్ ఉన్న నటీనటులతో కలిసి పని చేయనుండటం చాలా సంతోషంగా ఉంది అని అతడు అన్నాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం