తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajanikanth : రజనీకాంత్ పేరు, ఫొటో, వాయిస్ ఉపయోగించినా చర్యలే..

Rajanikanth : రజనీకాంత్ పేరు, ఫొటో, వాయిస్ ఉపయోగించినా చర్యలే..

Anand Sai HT Telugu

29 January 2023, 11:01 IST

    • Rajanikanth Public Notice : సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే కాదు.. ఆయనకు జపాన్ లో నూ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయనే ఒక బ్రాండ్. అయితే దీనిని కొంతమంది ఉపయోగించుకుంటున్నారు. అది కొన్నిసార్లు ఇబ్బందులకు కూడా గురిచేస్తోంది.
రజనీకాంత్
రజనీకాంత్ (twitter)

రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్(Super Star Rajanikanth) ఎదిగిన తీరు ఎంతో మందికి ఆదర్శం. ఒక్కడిగా వచ్చి.. ఎన్నో విజయాలు సాధించాడు. అభిమానులు దేవుడిలా ఆరాధిస్తారు. రజనీకి ఉన్న క్రేజ్.. మరే హీరోకు లేదేమో. అన్ని భాషల్లోనూ అతడికి ఫ్యాన్స్ ఉన్నారు. రజనీ ఏం చేసినా.. అదో స్టైల్. అదే ఫాలో అవుతుంటారు ఫ్యాన్స్. రజనీ అంటే ఓ బ్రాండ్.. అయితే ఇప్పుడు ఆయన క్రేజ్ ను కొంతమంది ఉపయోగించుకుంటున్నారు. కొన్ని తప్పుడు ప్రకటనలకు వాడుకుంటున్నారు. దీంతో రజనీ లాయర్ నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Devara vs NBK 109: బాక్సాఫీస్ వద్ద బాబాయి, అబ్బాయి పోటీ ఉండనుందా?

Kalki 2898 AD Bujji: ‘బుజ్జీ’ కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన కల్కి 2898 ఏడీ టీమ్.. ఎప్పుడు.. ఎక్కడ అంటే!

OTT: ఓటీటీలో అదరగొడుతున్న అభినవ్ గోమఠం కామెడీ డ్రామా సినిమా.. మరో మైల్‍స్టోన్ దాటేసింది

Brahmamudi: డబ్బు కోసమే మాయా బిడ్డ డ్రామా.. కావ్యకు రాజ్ వార్నింగ్.. భయపడిపోయిన శైలేంద్ర.. కొత్తగా మీరా అబార్షన్ డ్రామా

రజనీ కాంత్(Rajanikanth)కు ఉన్న ఇమేజ్ ను కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటారు. మరికొంతమంది తమ వస్తువులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వాడుతుంటారు. ఇలాంటి వాటితో కొన్నిసార్లు రజనీకాంత్ కు ఇబ్బందులు వస్తుంటాయి. దీంతో రజనీ లాయర్ రంగంలోకి దిగారు.

తమ అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, వాయిస్ ఉపయోగిస్తే.. చర్యలు తీసుకుంటామని పబ్లిక్ నోటీసు జారీ చేశారు. సూపర్ స్టార్ రజనీ తరఫు లాయర్ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. 'దశాబ్దాలుగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్నో భాషల్లో నటించారు. అలాంటి వ్యక్తికి చాలా ఇమేజ్ ఉంది. ఆయన ప్రతిష్ఠకు లేదా వ్యక్తిత్వానికి ఏదైనా నష్టం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే.. చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని సోషల్ మీడియా(Social Media) ప్లాట్ ఫారమ్స్ లతోపాటుగా కంపెనీలు, రజనీ పేరు, వాయిస్, ఫొటోలతోపాటు ఇమేజ్ ని ఉపయోగిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఆ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, జనాలను ప్రలోభపెట్టేందుకు వినియోగిస్తున్నట్టుగా గుర్తించాం. ఇక నుంచి ఎవరైనా వ్యక్తిగత, వ్యాపార అవసరాలు సహా ఎందులో అయినా ఆయన అనుమతి లేనిదే వినియోగిస్తే.. నోటీసులు ఇస్తాం.' అని న్యాయవాది వెల్లడించారు.

రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో జైలర్‌(jailer) షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. సునీల్, తమన్నా, విజయకన్, వసంత్ రవి, రమ్యకృష్ణ నటిస్తున్నారు. జైలర్ ఈ ఏడాది చివర్లో థియేటర్లలోకి రానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం