తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sunny Leone: తన భర్త మోసం చేశాడంటున్న సన్నీ లియోనీ.. ఏ విషయంలో అంటే!

Sunny Leone: తన భర్త మోసం చేశాడంటున్న సన్నీ లియోనీ.. ఏ విషయంలో అంటే!

14 July 2023, 17:33 IST

    • Sunny Leone: తన భర్త మోసం తనను మోసం చేస్తుండగా.. రెడ్ హ్యాండెడ్‍గా పట్టుకున్నానంటూ సన్నీ లియోనీ ఓ వీడియో షేర్ చేసుకుంది. ఏ విషయంలో ఇది జరిగిందంటే..
డానియెల్, సన్నీ లియోనీ
డానియెల్, సన్నీ లియోనీ

డానియెల్, సన్నీ లియోనీ

Sunny Leone: బాలీవుడ్ హాట్ యాక్టర్ సన్నీ లియోనీ ప్రస్తుత లైఫ్‍ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. తన కుటుంబంతో కలిసి వెకేషన్లకు వెళుతూ సరదాగా గడుపుతోంది. ఇటీవలే తన భర్తతో కలిసి మాల్దీవులకు వెళ్లి చాలా రోజులు ఎంజాయ్ చేసింది సన్నీ. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు సిడ్నీ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం వెళ్లింది. ప్రస్తుతం దుబాయ్‍లో తన భర్త డానియెల్ వెబెర్‌తో వెకేషన్‍లో ఉంది సన్నీ లియోనీ. వారిద్దరూ అక్కడ సరదాగా సమయాన్ని గడుపుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Janhvi Kapoor: ఎంఎస్ ధోనీ ఫిలాసఫీ మా సినిమాలో ఉంటుంది: జాన్వీ కపూర్

Aranmanai 4 - Rathnam OTT: ఒకే రోజు ఓటీటీలోకి త‌మ‌న్నా అరాణ్మ‌ణై 4...విశాల్ ర‌త్నం - ట్విస్ట్ ఏంటంటే?

OTT Weekend Movies: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఈ సినిమాలు, వెబ్ సిరీస్‍ను మిస్ అవ్వొద్దు!

Furiosa A Mad Max Saga: మ్యాడ్‌మ్యాక్స్‌కు ప్రీక్వెల్ వ‌స్తోంది… 1400 కోట్ల విజువ‌ల్ వండ‌ర్‌ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

తనను మోసం చేసేందుకు ప్రయత్నించగా తన భర్తను రెడ్ హ్యాండెడ్‍గా పట్టుకున్నానంటూ సన్నీ లియోనీ తాజాగా ఓ వీడియోను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది. తన కళ్లుగప్పి అతడు ఐస్‍క్రీమ్ తింటూ దొరికిపోయాడని, మోసం చేసేందుకు ప్రయత్నిస్తే పట్టుకున్నానని వీడియోలో చెప్పింది. కిచెన్‍లోకి వెళ్లి డానియెల్ ఏదో తింటుంటే అద్దంలో లుక్కేసింది సన్నీ. ఏం చేస్తున్నావని అడిగితే.. నీళ్లు తాగుతున్నానంటూ సమాధానం చెప్పాడు డానియెల్. అయితే, “విండోలో నుంచి నీ ప్రతిబింబం కనిపిస్తోంది. ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చో” అని సన్నీ చెప్పింది. తాను ఐస్‍క్రీమ్ తినడం లేదని డానియెల్ చెప్పగా.. అబద్ధాలు చెబుతున్నావని సన్నీ అంది. అప్పుడు ఐస్‍క్రీమ్ పట్టుకొని బయటికి వస్తాడు డానియెల్. ఈ వీడియోను ఇన్‍స్టాలో పోస్ట్ చేసింది సన్నీ.

“నా భర్త నన్ను మోసం చేసినప్పుడు” అంటూ ఈ వీడియోను షేర్ చేసింది సన్నీ లియోనీ. ఈ వీడియోకు నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. బ్యూటిఫుల్ కపుల్ అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ‘నేను కూడా ఐస్‍క్రీమ్ విషయంలో చీట్ చేస్తా’ ఓ యూజర్ రాసుకొచ్చారు.

ప్రస్తుతం సినిమాల్లో ఎక్కువగా స్పెషల్ రోల్స్ చేస్తోంది సన్నీ లియోనీ. హిందీతో పాటు ఇతర భాషల చిత్రాల్లోనూ కనిపిస్తోంది. టాలీవుడ్‍లో చివరగా జిన్నా చిత్రంలో మెరిసింది ఈ బ్యూటీ.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం