తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Koose Munisamy Veerappan Ott: ఓటీటీలోకి వచ్చేసిన వీరప్పన్ బయోపిక్.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Koose Munisamy Veerappan OTT: ఓటీటీలోకి వచ్చేసిన వీరప్పన్ బయోపిక్.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Sanjiv Kumar HT Telugu

15 December 2023, 13:27 IST

  • Koose Munisamy Veerappan OTT Streaming: గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ బయోపిక్‌గా వచ్చిన కూసే మునిస్వామి వీరప్పన్ ఓటీటీలో గురువారం అంటే డిసెంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మరి కూసే మునిస్వామి వీరప్పన్ ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుందనే వివరాల్లోకి వెళితే..

ఓటీటీలోకి వచ్చేసిన వీరప్పన్ బయోపిక్.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన వీరప్పన్ బయోపిక్.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఓటీటీలోకి వచ్చేసిన వీరప్పన్ బయోపిక్.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Koose Munisamy Veerappan OTT Release: స్మగ్లర్ వీరప్పన్‌పై అనేక చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన బయోపిక్‌గా కిల్లింగ్ వీరప్పన్ అనే మూవీని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు. ఇప్పుడు వీర్పపన్ బయోపిక్‌గా డాక్యుమెంటరీ సిరీస్‌గా వస్తోంది కూసే మునిస్వామి వీరప్పన్ (Koose Munisamy Veerappan). అడవుల్లోకి పారిపోయి తలదాచుకున్న బందిపోటు దొంగ కూసే మునిస్వామి వీరప్పన్ జీవితానికి సంబంధించి లోతైన అధ్యయనం చేసి ఈ ఒరిజినల్‌ను రూపొందించారు.

ట్రెండింగ్ వార్తలు

Krishnamma Day 3 Collections: కృష్ణమ్మ సినిమా కలెక్షన్ల జోరు.. తొలి రోజు కంటే మూడో రోజు ఎక్కువగా..

Mahesh Babu - Ram Charan: ఓటేసిన మహేశ్ బాబు, రామ్‍చరణ్.. స్టైలిష్ లుక్‍లో స్టార్ హీరోలు

Bollywood: వాటి గురించి సుశాంత్ సింగ్ చాలా బాధపడేవారు: మనోజ్ బాజ్‍పేయ్

Pavithra Jayaram: టీవీ సీరియల్ నటి మృతి.. తిరిగి రావా అంటూ భర్త చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్

వీడియోలను చూపిస్తూ

వీరప్పన్‌కు సన్నిహితులైన వారి నుంచి వివరాలను సేకరించడం, అదేవిధంగా ఆయన్ని పట్టుకోవటానికి ప్రయత్నించిన అధికారుల నుంచి సేకరించిన వీడియోను ఈ డాక్యుమెంటరీలో పొందుపరిచారు. ఇది వీరప్పన్ రహస్య జీవితాన్ని, అతని నేర వారసత్వాన్ని స్పష్టంగా ఆవిష్కరించింది. ఈ సిరీస్ ముందు వీరప్పన్ నెరేషన్‌తో ప్రారంభమవుతుంది. అతని పూర్తి జీవితాన్ని ఆవిష్కరిస్తూనే అతని చుట్టూ జరిగిన ఘటనలను గురించి కూడా తెలియజేస్తుందని మేకర్స్ ఇదివరకు తెలిపారు.

వరదల కారణంగా వాయిదా

కూసే మునస్వామి వీరప్పన్ ఒరిజినల్‌ను తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ప్రముఖ ఓటీటీ జీ5 (Zee5 OTT) డిసెంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, మొదట డిసెంబర్ 8 నుంచి ప్రసారం చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన చెన్నైలో వరదల కారణంగా వాయిదా వేశారు. ఇప్పుడు డిసెంబర్ 14 నుంచి జీ5లో కూసే మునిస్వామి వీరప్పన్ డాక్యుమెంటరీని స్ట్రీమింగ్ చేస్తున్నారు.

వీరప్పన్‌తో నెరేషన్

కాగా వీరప్పన్‌ను పట్టుకోవటానికి మూడు దశాబ్దాల పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక అడవుల్లో పోలీసులు అన్వేషించారు. అయితే ఎవరూ ఊహించని రీతిలో నాటకీయంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) టీమ్ చేసిన ఎన్‌కౌంటర్‌లో వీరప్పన్ మరణించారు. పోలీసుల రికార్డుల్లో, చరిత్రలో తన చరిత్ర ఓ భాగంగా మాత్రమే మారింది. ఈ సిరీస్‌లో వీరప్పన్ స్వయంగా నెరేషన్ ఇచ్చారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం