తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Skanda Bookings: రామ్ - బోయపాటి ‘స్కంద’ సినిమా బుకింగ్స్ షురూ.. మరో ట్రైలర్ రెడీ

Skanda Bookings: రామ్ - బోయపాటి ‘స్కంద’ సినిమా బుకింగ్స్ షురూ.. మరో ట్రైలర్ రెడీ

24 September 2023, 20:03 IST

    • Skanda Bookings: స్కంద సినిమా టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ మాస్ యాక్షన్ మూవీలో రామ్ పోతినేని హీరోగా నటించారు. 
స్కంద సినిమా పోస్టర్
స్కంద సినిమా పోస్టర్

స్కంద సినిమా పోస్టర్

Skanda Bookings: స్కంద సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ చిత్రానికి మాస్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. బోయపాటి మార్క్ మూవీగానే హెవీ యాక్షన్ సీన్లతో, ఫ్యామిలీ సెంటిమెంట్‍తో స్కంద ఉండనుందని ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించారు. స్కంద చిత్రం మరో నాలుగు రోజుల్లో అంటే సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ కానుంది.

ట్రెండింగ్ వార్తలు

Laya: ఆ డైరెక్టర్ చంపుతానని బెదిరించాడు.. 18 ఏళ్లకు నిజం బయటపెట్టిన హీరోయిన్ లయ

Sunil: మ‌మ్ముట్టి సినిమాలో విల‌న్‌గా సునీల్ - ట‌ర్బోతో మ‌ల‌యాళంలోకి ఎంట్రీ - ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

Vijay Sethupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కొత్త ప్రయోగం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా ఏసీఈ

NNS May 18th Episode: పుట్టింటికి అరుంధతి.. సరస్వతిని చంపేస్తున్న మనోహరి.. అందరికీ తెలియనున్న నిజం​​​!

స్కంద సినిమా టికెట్ల ముందస్తు బుకింగ్స్ ఆన్‍లైన్‍లో నేడు (సెప్టెంబర్ 24) మొదలయ్యాయి. స్కంద సినిమాకు సంబంధించి చాలా థియేటర్లలో బుకింగ్‍కు టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇప్పటికే చాలా చోట్ల స్కంద మూవీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇంకా కాని చోట్ల రేపటి కల్లా అందుబాటులోకి రానున్నాయి. స్కంద సినిమా సెప్టెంబర్ 28న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ కానుంది. రామ్ పోతినేనికి ఇది తొలి పాన్ ఇండియా మూవీగా ఉంది.

మరో ట్రైలర్..

స్కంద సినిమాకు సంబంధించి గతంలోనే ఓ ట్రైలర్ వచ్చింది. యాక్షన్ సీక్సెన్సులు, డైలాగ్‍లతో ఆకట్టుకుంది. కాగా రేపు (సెప్టెంబర్ 25) రిలీజ్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఈ కొత్త ట్రైలర్ రిలీజ్ గురించి ఈ సినిమాను నిర్మిస్తున్న శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ వెల్లడించింది. మరోవైపు, కరీంనగర్‌లోని వీ కన్వెన్షన్‍లో రేపు సాయంత్రం కల్ట్ జాతర పేరుతో స్కంద మూవీ ఈవెంట్ జరగనుంది.

స్కంద చిత్రం నుంచి వచ్చిన గండరబాయ్, కల్ట్ మామ పాటలు ఆకట్టుకున్నాయి. గండరబాయ్ పాటలో హీరో రామ్, హీరోయిన్ శ్రీలీల డ్యాన్స్ అదిరిపోయింది. కల్ట్ మామ అనే స్పెషల్ సాంగ్‍లో ఊర్వశి రౌతేలా చిందేశారు.

స్కంద సినిమాలో సాయీ మంజ్రేకర్, ప్రిన్స్ సెసిల్, శరత్ లోహితశ్వ, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించారు శ్రీనివాస చిట్టూరి. సెప్టెంబర్ 15వ తేదీన రిలీజ్ కావాల్సిన స్కంద సినిమా అనంతరం సెప్టెంబర్ 28వ తేదీకి వాయిదా పడింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం