తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sj Suryah On Kiara Advani: శ్రీదేవి త‌ర్వాత అంత అంద‌గ‌త్తెవు నువ్వే - కియారాపై ఎస్‌జే సూర్య ట్వీట్ - నెటిజ‌న్ల‌ సెటైర్స్

Sj suryah On Kiara Advani: శ్రీదేవి త‌ర్వాత అంత అంద‌గ‌త్తెవు నువ్వే - కియారాపై ఎస్‌జే సూర్య ట్వీట్ - నెటిజ‌న్ల‌ సెటైర్స్

HT Telugu Desk HT Telugu

01 August 2023, 9:46 IST

  • Sj surya On Kiara Advani: కియారా అద్వానీని శ్రీదేవితో పోల్చుతూ ఎస్‌జే సూర్య చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అత‌డి ట్వీట్‌ను ఉద్దేశించి ప‌లువురు నెటిజ‌న్లు ఫ‌న్నీ కామెంట్స్ చేస్తున్నారు.

కియారా అద్వానీ
కియారా అద్వానీ

కియారా అద్వానీ

Sj surya On Kiara Advani: బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో స్టార్ హీరోల‌తో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది కియారా అద్వానీ. సోమ‌వారం కియారా అద్వానీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఆమెకు శుభాకాంక్ష‌లు అంద‌జేశారు. త‌మిళ ద‌ర్శ‌కుడు, న‌టుడు ఎస్‌జే సూర్య చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కియారాను శ్రీదేవితో పోలుస్తూ ఎస్‌జే సూర్య ట్వీట్ చేయ‌డంపై నెటిజ‌న్లు సెటైర్స్ వేస్తున్నారు. ఫ‌న్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Aarambham OTT: ఓటీటీల్లో వెతికి మరీ చూస్తారు.. అప్పటివరకు ఆగొద్దు: ఆరంభం డైరెక్టర్ అజయ్ నాగ్

Aavesham OTT Controversy: ప్రేక్షకులను బాధపెట్టిన ఓటీటీ మూవీ ఆవేశం.. భాషను అవమానించారంటూ ఫైర్

Brahmamudi: కావ్య మాటలకు ఖంగుతిన్న మామ సుభాష్- రాజ్‌తో సవాల్- శైలేంద్రకు తండ్రి వార్నింగ్- బయటపడనున్న మీరా ప్రెగ్నెన్సీ

Prasanna Vadanam OTT: ఓటీటీలోకి నెలలోపే సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

హ్యాపీ బ‌ర్త్‌డే అందాల యువ‌రాణి అంటూ కియారాపై ప్ర‌శంస‌లు కురిపించాడు ఎస్‌జే సూర్య‌. శ్రీదేవి త‌ర్వాత అంత‌టి అందం, అభిన‌యం నీ సొంతం... అంటూ కియారాపై పొగ‌డ్తల వ‌ర్షం కురిపించాడు ఎస్‌జే సూర్య‌. త‌న ట్వీట్‌కు ఫ్ల‌వ‌ర్ ఎమోజీస్ యాడ్ చేశాడు. అత‌డి ట్వీట్‌ఫై నెటిజ‌న్లు ఫ‌న్నీగా రియాక్ట్ అవుతోన్నారు. ఏ వాట్స‌ప్ స్టేట‌స్ నుంచి లేపేశావ‌ని సూర్య ట్వీట్‌పై కామెంట్స్ చేస్తున్నారు.

పొగ‌డ్త కొంచెం మితిమీరిపోయింద‌ని, మీ స్టేట‌స్‌కు త‌గ్గ‌ట్లుగా లేద‌ని మ‌రో నెటిజ‌న్ పేర్కొన్నాడు. అన్ని ఫ్ల‌వ‌ర్స్ ఎందుకు అంటూ మ‌రో నెటిజ‌న్ ఫ‌న్నీగా పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం తెలుగులో రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తోన్న గేమ్ ఛేంజ‌ర్ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాలో ఎస్‌జే సూర్య విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు.

విన‌య‌విధేయ‌రామ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ జంట‌గా న‌టిస్తోన్న ఈ సినిమాకు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ పాన్ ఇండియ‌న్ మూవీ వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మ‌రోవైపు బాలీవుడ్‌లో కియారా అద్వాణీ హీరోయిన్‌గా న‌టించిన స‌త్య‌ప్రేమ్ కీ క‌థ సినిమా వంద కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈ ఏడాది బాలీవుడ్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం