తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sir Trailer Out: లెక్చరర్ ధనుష్ వచ్చేశాడు.. సార్ ట్రైలర్ అదుర్స్

Sir Trailer Out: లెక్చరర్ ధనుష్ వచ్చేశాడు.. సార్ ట్రైలర్ అదుర్స్

Hari Prasad S HT Telugu

08 February 2023, 19:34 IST

    • Sir Trailer Out: లెక్చరర్ ధనుష్ వచ్చేశాడు. సార్ మూవీతో మరోసారి తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు. ఈ మూవీ ట్రైలర్ బుధవారం (ఫిబ్రవరి 8) రిలీజైంది.
సార్ మూవీలో ధనుష్, సంయుక్త
సార్ మూవీలో ధనుష్, సంయుక్త

సార్ మూవీలో ధనుష్, సంయుక్త

Sir Trailer Out: తమిళ స్టార్ హీరో ధనుష్ మరో బైలింగ్వుల్ మూవీతో వస్తున్నాడు. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన సార్ మూవీ ట్రైలర్ బుధవారం (ఫిబ్రవరి 8) రిలీజైంది. ఈ మూవీ తమిళంలో వాతిగా వస్తోంది. ఈ మూవీ ట్రైలర్ ను హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కు ధనుష్, సంయుక్త హాజరయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

Chandini Chowdary: కొత్తగా పెళ్లైన జంట ఎదుర్కొనే సమస్యతో మూవీ- గామి హీరోయిన్ చాందినీ చౌదరి మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

OTT Horror Movie: ఓటీటీలో భయపెట్టనున్న సరికొత్త హారర్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్! ఎక్కడంటే?

Siddharth40: సిద్ధార్థ్ హీరోగా 40వ సినిమా.. తెలుగు తమిళంలో ద్విభాషా చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?

Balakrishna vs Jr NTR: బాక్సాఫీస్ వద్ద బాబాయి, అబ్బాయి పోటీ ఉండనుందా?

డబ్బును ఎలాగైనా సంపాదించవచ్చు.. కానీ మర్యాదను చదువు మాత్రమే సంపాదించి పెడుతుందంటూ చదువుకున్న గొప్పతనం గురించి చెబుతాడు ధనుష్ ఈ ట్రైలర్‌లో. దీనిని బట్టే ఈ సార్ కథ చదువు, ఆ చదువును వ్యాపారంగా మార్చేసిన వారి చుట్టూ తిరుగుతుందని స్పష్టమవుతోంది. ఈ సినిమాలో సంయుక్త మేనన్ ఫిమేల్ లీడ్ రోల్ లో కనిపిస్తోంది.

ఈ ట్రైలర్ లో ధనుష్, సంయుక్త మధ్య లవ్ ట్రాక్ ను కూడా చూపించారు. ఇక విలన్ రోల్ లో సముద్రఖని నటించాడు. చదువును అమ్ముకునే ఓ విద్యా వ్యాపారవేత్తగా సార్ మూవీలో అతడు కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన మాస్టారూ మాస్టారూ అనే మెలోడీ సాంగ్ ను కూడా ఈ ట్రైలర్ లో ఉంచారు. ఇక ధనుష్ మార్క్ యాక్షన్ సీన్స్ కూడా అతని ఫ్యాన్స్ ను అలరిస్తాయనడంలో సందేహం లేదు.

తనదైన మార్క్ నటనతో ఎప్పటిలాగే ధనుష్ అదరగొట్టాడు. లెక్చరర్ గా అతని స్టైల్, మేనరిజం, బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకుంటున్నాయి. విద్యను ఫక్తు వ్యాపారంగా మార్చేసిన ఇప్పటి కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పై సంధించిన అస్త్రంగా ఈ సార్ మూవీ కనిపిస్తోంది.

సార్ మూవీలో ధనుష్, సంయుక్త మేనన్ తోపాటు సాయి కుమార్, తనికెళ్ల భరణి ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. సితారా ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాను నిర్మించాయి. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించాడు. ఫిబ్రవరి 17న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం