తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sarkaaru Noukari Ott: సింగర్ సునీత కొడుకు మూవీ సర్కారు నౌకరికి ఓటీటీ ఫిక్స్.. ఎందులో అంటే?

Sarkaaru Noukari OTT: సింగర్ సునీత కొడుకు మూవీ సర్కారు నౌకరికి ఓటీటీ ఫిక్స్.. ఎందులో అంటే?

Sanjiv Kumar HT Telugu

31 December 2023, 6:44 IST

  • Sarkaaru Noukari OTT Partner: ప్రముఖ సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా చేస్తున్న సర్కారు నౌకరి మూవీ విడుదలకు ముందే ఓటీటీ పార్టనర్ ఫిక్స్ అయింది. జనవరి 1న థియేటర్‌లో విడుదల కానున్న ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసింది.

సింగర్ సునీత కొడుకు మూవీ సర్కారు నౌకరికి ఓటీటీ ఫిక్స్.. ఎందులో అంటే?
సింగర్ సునీత కొడుకు మూవీ సర్కారు నౌకరికి ఓటీటీ ఫిక్స్.. ఎందులో అంటే?

సింగర్ సునీత కొడుకు మూవీ సర్కారు నౌకరికి ఓటీటీ ఫిక్స్.. ఎందులో అంటే?

Singer Sunitha Son Akash: తెలుగులో గాయనీగా సునీత మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆమె కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయవుతున్న సినిమా "సర్కారు నౌకరి". ఈ చిత్రంలో భావన హీరోయిన్ గా నటిస్తోంది. సర్కారు నౌకరి చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Heeramandi 2: హీరామండి వెబ్ సిరీస్‍ రెండో సీజన్ వస్తుందా? డైరెక్టర్, యాక్టర్ ఏం చెప్పారంటే..

OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

"సర్కారు నౌకరి" సినిమాను న్యూఇయర్ సందర్భంగా వచ్చే జనవరి 1న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. అయితే థియేట్రిలక్ రిలీజ్‌కు ముందుగానే సర్కారు నౌకరి సినిమా ఓటీటీ పార్టనర్ ఫిక్స్ అయింది. సర్కారు నౌకరి సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ టీవీ ఛానెల్ ఈటీవీ నెట్‌వర్క్‌కు చెందిన "ఈటీవీ విన్" ఓటీటీ సంస్థ కొనుగోలు చేసింది.

అంటే, సర్కారు నౌకరి జనవరి 1న విడుదలైన తర్వాత దాదాపు నెలరోజులకు ఈటీవీ విన్‌లో మూవీ స్ట్రీమింగ్ కానుంది. అయితే, ప్రముఖ ఈటీవీ సంస్థకు నిర్మాత రాఘవేంద్ర రావు, సింగర్ సునీతకు మంచి అనుబంధం ఉంది. పాడుతా తీయగా షోకి సునీత జడ్జ్‌గా వ్యవహరిస్తే.. దర్శకేంద్రుడు హోస్ట్ చేసిన టాక్ షో ఈటీవీలోనే ప్రసారం అయింది.

ఈ అనుబంధంతోనే సింగర్ కుమారుడు ఆకాష్ మూవీ సర్కారు నౌకరి ఓటీటీ హక్కులను ఈటీవీ సంస్థ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సర్కారు నౌకరి సినిమాలో ఆకాష్, భావనా వళపండల్‌తోపాటు తనికెళ్ల భరణి, సూర్య, సాయి శ్రీనివాస్ వడ్లమాని, మణిచందన, రాజేశ్వరి మూళ్లపూడి, రమ్య పొందూరి, త్రినాథ్, సాహితి దాసరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం