తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shruti Haasan On Waltair Veerayya: అలాంటి పాట‌ల‌తో హీరోయిన్ల‌ను ఇబ్బంది పెట్టొద్దు - ద‌ర్శ‌కుల‌కు శృతిహాస‌న్ రిక్వెస్ట్‌

Shruti Haasan on Waltair Veerayya: అలాంటి పాట‌ల‌తో హీరోయిన్ల‌ను ఇబ్బంది పెట్టొద్దు - ద‌ర్శ‌కుల‌కు శృతిహాస‌న్ రిక్వెస్ట్‌

09 April 2023, 18:23 IST

  • Shruti Haasan on Waltair Veerayya: వాల్తేర్ వీర‌య్య సినిమాలోని శ్రీదేవి చిరంజీవి సాంగ్‌పై శృతిహాస‌న్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ పాట చిత్రీక‌ర‌ణ‌లో తాను చాలా ఇబ్బందిగా ఫీల‌య్యాన‌ని అన్న‌ది. .

శృతిహాస‌న్‌, చిరంజీవి
శృతిహాస‌న్‌, చిరంజీవి

శృతిహాస‌న్‌, చిరంజీవి

Shruti Haasan on Waltair Veerayya: చిరంజీవి, ర‌వితేజ హీరోలుగా న‌టించిన వాల్తేర్ వీర‌య్య సినిమా సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. 250 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించింది. వాల్తేర్ వీర‌య్య ప్ర‌మోష‌న్స్‌లో అంత‌గా క‌నిపించ‌ని శృతిహాస‌న్ ఈ సినిమాపై ఇటీవ‌ల ఒ త‌మిళ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

Keerthy Suresh Kalki 2898 AD: కల్కి 2898 ఏడీలో కీర్తి సురేష్.. ప్రభాస్‌కు ప్రాణ మిత్రుడిగా మహానటి

Murari Movie: మురారి సినిమాలో మహేశ్‍కు జీడీగా సోనాలీ కంటే ముందు ఈ బాలీవుడ్ భామను అనుకున్నారట!

Chandini Chowdary: కొత్తగా పెళ్లైన జంట ఎదుర్కొనే సమస్యతో మూవీ- గామి హీరోయిన్ చాందినీ చౌదరి మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

ఇందులోని శ్రీదేవిచిరంజీవిసాంగ్‌లో న‌టిస్తోన్న‌ప్పుడు చాలా ఇబ్బంది ప‌డ్డాన‌ని అన్న‌ది. ఈ పాట‌ను యూర‌ప్‌లోని మంచు కొండ‌ల్లో ద‌ర్శ‌కుడు బాబీ చిత్రీక‌రించారు. మైన‌స్ డిగ్రీ టెంప‌రేచ‌ర్‌లో డ్యాన్స్ చేయ‌డం చాలా క‌ష్ట‌మైంద‌ని శృతిహాస‌న్ అన్న‌ది. ఈ పాట‌లో చిరంజీవి లెద‌ర్ జాకెట్ ధ‌రించి క‌నిపిస్తే తాను మాత్రం చీర‌లోనే డ్యాన్స్ చేయాల్సివ‌చ్చింద‌ని, చ‌లిని త‌ట్టుకుంటూ స్టెప్పులు వేయ‌లేక‌పోయాన‌ని అన్న‌ది.

మంచు ప్ర‌దేశాల్లో రొమాంటిక్ సాంగ్స్‌ను చిత్రీక‌రించాల‌నే ఆలోచ‌న మంచిదే. కానీ వాటి వ‌ల్ల హీరోయిన్లు ఇబ్బందిగా ఫీల‌వుతోన్న‌విష‌యాన్ని ద‌ర్శ‌కులు గుర్తిస్తే బాగుంటుంద‌ని శృతిహాస‌న్ కామెంట్స్ చేసింది. ఇలాంటి లోకేష‌న్స్ కావాల‌ని అనుకుంటే హీరోయిన్ల డ్రెస్‌ల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ద‌ర్శ‌కుల‌కు సూచించింది.

వాల్తేర్‌ వీర‌య్య సినిమాపై శృతిహాస‌న్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి. కొంద‌రు ఆమెను స‌మ‌ర్థిస్తుండ‌గా చాలా మంది విమ‌ర్శిస్తోన్నారు. కోట్ల‌లో రెమ్యున‌రేష‌న్స్ తీసుకుంటూ ఇలాంటి కామెంట్స్ చేయ‌డం స‌రికాద‌ని అంటోన్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం