తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shraddha Srinath In Saindhav: అఫీషియ‌ల్‌: వెంక‌టేష్ సైంధ‌వ్‌లో జెర్సీ హీరోయిన్ - ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

Shraddha Srinath In Saindhav: అఫీషియ‌ల్‌: వెంక‌టేష్ సైంధ‌వ్‌లో జెర్సీ హీరోయిన్ - ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

15 April 2023, 11:39 IST

  • Shraddha Srinath In Saindhav: వెంక‌టేష్ సైంధ‌వ్ సినిమా నుంచి మ‌రో అప్‌డేట్ వ‌చ్చేసింది. ఈ సినిమాలో జెర్సీ ఫేమ్ శ్ర‌ద్ధా శ్రీనాథ్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ది. ఆమె లుక్‌ను శ‌నివారం రిలీజ్ చేశారు

శ్ర‌ద్ధా శ్రీనాథ్
శ్ర‌ద్ధా శ్రీనాథ్

శ్ర‌ద్ధా శ్రీనాథ్

Shraddha Srinath In Saindhav: వెంక‌టేష్ సైంధ‌వ్ సినిమాకు సంబంధించి మ‌రో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ను శ‌నివారం చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఈ సినిమాలో జెర్సీ ఫేమ్ శ్ర‌ద్ధా శ్రీనాథ్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆమె క్యారెక్ట‌ర్ పేరుతో పాటు లుక్‌ను రిలీజ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Pushpa 2 Anasuya First Look: పుష్ప 2 నుంచి అనసూయ ఫస్ట్ లుక్.. దాక్షాయణి మళ్లీ వచ్చింది

Devara First Single: దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది ఆ రోజే.. ఫియర్ సాంగ్ అంటూ భయపెడుతున్న మేకర్స్

Janhvi Kapoor Partner: తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన జాన్వీ కపూర్.. ఈ లక్షణాలు తప్పనిసరిగా ఉండాల్సిందేనట

Panchayat 3 Trailer: పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది.. మరింత రాజకీయం, నవ్వులతో అదిరిపోయింది

ఇందులో శ్ర‌ద్ధా శ్రీనాథ్ మ‌నోజ్ఞ అనే పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో చీర‌క‌ట్టులో సీరియ‌స్ లుక్‌లో శ్ర‌ద్ధా శ్రీనాథ్ క‌నిపిస్తోంది. కారులో కూర్చొని ఉన్న ఆమె చేతిలో టిఫిక్ బాక్స్ ఉండ‌టం ఆస‌క్తిని పంచుతోంది. సైంధ‌వ్‌లో క‌థ‌ను మ‌లుపు తిప్పే ముఖ్య‌మైన పాత్ర‌లో శ్ర‌ద్ధా శ్రీనాథ్ న‌టిస్తోన్న‌ట్లు స‌మాచారం. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న సైంధ‌వ్ సినిమాకు హిట్‌, హిట్ 2 ఫేమ్ శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

వెంక‌టేష్ హీరోగా న‌టిస్తోన్న 75వ సినిమా ఇది. ఇందులో బాలీవుడ్ న‌టుడు న‌వాజుద్ధీన్ సిద్ధిఖీ ప్ర‌ధాన పాత్రో పోషిస్తోన్నాడు. ఈ సినిమాతోనే అత‌డు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం వైజాగ్‌లో సైంధ‌వ్ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతోంది.

ఈ సెకండ్ షెడ్యూల్‌లో వెంక‌టేష్, శ్ర‌ద్ధా శ్రీనాథ్‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణం మొత్తం పాల్గొంటున్న‌ట్లు తెలిసింది. సైంధ‌వ్ సినిమాను క్రిస్మ‌స్ కానుక‌గా ఈ ఏడాది డిసెంబ‌ర్ 22న రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ సినిమాకు ద‌స‌రా ఫేమ్ సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతాన్ని అందిస్తోన్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం