తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pathaan Trailer On Burj Khalifa : బుర్జ్ ఖలీఫాపై 'పఠాన్' ట్రైలర్

Pathaan Trailer On Burj Khalifa : బుర్జ్ ఖలీఫాపై 'పఠాన్' ట్రైలర్

Anand Sai HT Telugu

15 January 2023, 11:27 IST

    • Pathaan Movie Trailer : పఠాన్ సినిమా కోసం చాలా మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. బేషరమ్ పాట విడుదలతో ఈ చిత్రంపై వివాదం మెుదలైంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు ఆదరణ లభిస్తోంది. బుర్జ్ ఖలీఫాపై పఠాన్ ట్రైలర్ ప్రదర్శించారు.
బుర్జ్ ఖలీఫాపై 'పఠాన్' ట్రైలర్
బుర్జ్ ఖలీఫాపై 'పఠాన్' ట్రైలర్

బుర్జ్ ఖలీఫాపై 'పఠాన్' ట్రైలర్

షారుఖ్ ఖాన్(Sharukh Khan) తన రాబోయే చిత్రం పఠాన్‌(Pathaan)తో సందడి చేయనున్నాడు. విడుదల తేదీ దగ్గర పడుతుండగా ప్రేక్షకులను కట్టిపడేసేందుకు.. ఎలాంటి అవకాశాన్ని వదులుకోవడం లేదు చిత్రం బృందం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా(Burj Khalifa)లో పఠాన్ ట్రైలర్‌ను ప్లే చేశారు. ప్రమోషన్‌ విషయంలో అస్సలు తగ్గడం లేదు. యష్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో బుర్జ్ ఖలీఫాపై ట్రైలర్ ప్లే చేస్తున్న వీడియోను షేర్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Prabhas: నా బుజ్జిని చూస్తారా: కల్కి 2898 ఏడీపై ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్

Prasanna Vadanam OTT Release date: ప్రసన్న వదనం ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఇలా చేస్తే 24 గంటలు ముందుగానే చూడొచ్చు..

Devara fear song promo: దేవర ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ప్రోమో చూశారా.. అదిరిపోయిన బీజీఎం

Suresh Babu on Theatres: ఓటీటీ మమ్మల్ని దెబ్బ కొడుతోంది.. థియేటర్లలను ఫంక్షన్ హాల్స్‌గా మార్చాల్సిందే: సురేశ్ బాబు

బుర్జ్ ఖలీఫా మీద పఠాన్ ట్రైలర్ ప్లే అవుతున్న సమయంలో షారుఖ్ అక్కడే ఉన్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్(Video Viral) అవుతోంది. జనవరి 25, 2023న పఠాన్ సినిమా విడుదల కానుంది. హిందీ, తమిళం, తెలుగులో విడుదలవుతోంది. సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించిన భారీ యాక్షన్‌ చిత్రం ఇది. షారుఖ్ ఖాన్‌, దీపికా పదుకొణె(Deepika Padukone) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. . జాన్‌ అబ్రహం ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ఆదిత్య చోప్రా సినిమాను నిర్మించాడు.

పఠాన్ సినిమా(Pathaan Movie) రిలీజ్‌కు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ముఖ్యంగా ఈ మూవీ నుంచి వచ్చిన బేషరమ్‌ రంగ్‌(besharam song) పాటపై తీవ్ర దుమారం రేగింది. ఇందులో దీపికా కాషాయ రంగు బికినీ వేసుకోవడంపై పలువురు హిందూ మత పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాను నిషేధించాలని డిమాండ్‌ చేశారు.

కాషాయ బికినీపై ఏమాత్రం స్పందించని సెన్సార్‌ బోర్డు.. మూవీకి మాత్రం మొత్తం 13 కట్స్‌ చెప్పింది. బేషరమ్‌ రంగ్‌ పాటలో దీపికా పిరుదులు కనిపించే సీన్‌తోపాటు ఆమె వక్షోజాలు ఎక్స్‌పోజ్‌ అయ్యే మరో సీన్‌ను కూడా కట్‌ చేయాలని ఆదేశించింది. ఇక ఇదే పాటలో బహుత్‌ తంగ్‌ కియా అనే లిరిక్స్‌ వచ్చే సమయంలో దీపికా వేసే అభ్యంతకర స్టెప్పులను కూడా కట్‌ చేయాలని స్పష్టం చేసింది.

ఇవే కాకుండా మొత్తంగా సినిమాలో 13 కట్స్‌ సూచించి u/a సర్టిఫికెట్‌ ఇచ్చింది. అసలు వివాదానికి కారణమైన కాషాయ రంగు బికినీ మాత్రం ఈ కట్స్‌లో లేటన్లు సమాచారం. ఇక సినిమాలో రా, పీఎంవోలాంటి పదాలను తరచూ వాడారు. రా (RAW) స్థానంలో హమారే అనే పదం వాడనున్నారు. పీఎంవో పదాన్ని తొలగించారు. పీఎం అన్న పదం స్థానంలో ప్రెసిడెంట్‌ లేదా మినిస్టర్‌ అనే పదాలు వాడాలని నిర్ణయించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం