తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chandrayaan 3 : చంద్రుడిపై సైట్ కొన్న స్టార్ హీరోలు.. ఎలా కొనాలి? ధర ఎంత?

Chandrayaan 3 : చంద్రుడిపై సైట్ కొన్న స్టార్ హీరోలు.. ఎలా కొనాలి? ధర ఎంత?

Anand Sai HT Telugu

24 August 2023, 13:02 IST

    • Chandrayaan 3 : చంద్రయాన్ 3 సక్సెస్ అయింది. ప్రపంచమంతా భారత్ వైపు చూసింది. అయితే అక్కడ సైట్ కొనుగోలు విషయంపై ఎప్పటి నుంచో ఓ చర్చ ఉంది. ఇప్పటికే కొంతమంది అక్కడ కొనుగోలు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. వారిలో నటులు కూడా ఉన్నారు. ఇంతకి ఎవరు వాళ్లు? ఎలా కొనుగోలు చేయాలి?
చంద్రయాన్ 3
చంద్రయాన్ 3

చంద్రయాన్ 3

చందమామపై చంద్రయాన్ 3(Chandrayaan 3) సక్సెస్ ఫుల్ గా ల్యాండ్ అయింది. యావత్ భారతదేశం ఇస్రోకు సలాం కొట్టింది. వెక్కిరించిన నోర్లు.. నోరెళ్లబెట్టి చూశాయి. అంతలేదు అనుకున్న వారు.. భారతదేశాన్ని ఆకాశమంత ఎత్తులో చూస్తున్నారు. చంద్రయాన్ 3 విజయవంతం(Chandrayaan 3 Success) అవ్వడంతో ప్రపంచం మెుత్తం ఇండియా వైపు ఆసక్తిగా చూసింది. అంతకుముందు విఫలమైన విషయాన్ని కసిగా తీసుకుని పని చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. చంద్రయాన్ 3 కోసం నిద్రలేని రాత్రులు గడిపారు. సమయం అంటూ.. లేకుండా పని చేసుకుంటూ పోయారు. ఫలితంగా దేశం మెుత్తం కాలర్ ఎగరేసింది.

ట్రెండింగ్ వార్తలు

Nani: నాని సినిమాపై సందిగ్ధత.. ఆ ప్రాజెక్ట్ ఉంటుందా?

Payal Rajput Rakshana Release Date: పాయల్ రాజ్‌పుత్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ డేట్ ఇదే.. వచ్చే నెలలోనే..

Pushpa 2 Anasuya First Look: పుష్ప 2 నుంచి అనసూయ ఫస్ట్ లుక్.. దాక్షాయణి మళ్లీ వచ్చింది

Devara First Single: దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది ఆ రోజే.. ఫియర్ సాంగ్ అంటూ భయపెడుతున్న మేకర్స్

భారత్ సాధించిన గొప్ప విషయమే కాకుండా మరో విషయంపై కూడా చర్చ జరుగుతుంది. ఇంతకీ చంద్రుడిపై మనిషి ఉండేదుకు ఆస్కారం ఉందా? ఎలా బతకాలి? అక్కడ ప్రాపర్టీ ఎలా కొనాలి? అనే చర్చ చాలా ఏళ్ల నుంచి ఉంది. కొనాలి అనుకుంటే ఎలా? అనే ప్రశ్నలు చాలా మందికి ఉన్నాయి. అయితే ఇప్పటికే కొందరూ హీరోలు అక్కడ సైట్ కొనుగోలు చేశారట.

కొంతమందికి అంతరిక్షంపై ఉన్న ఆసక్తి, మరికొందరు భవిష్యత్తులో పెట్టుబడిగా భావించి స్పేస్ మీద డబ్బులు పెడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ ధరలు విపరీతంగా పెరుగుతున్నందున చాలా మంది ధనిక వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు చంద్రునిపై ప్రాపర్టీ కొన్నారు. మరికొందరు అంతరిక్షంపై వారి ఆసక్తి, అభిరుచి కారణంగా కొందరు దీనిని భవిష్యత్తు పెట్టుబడిగా భావిస్తారు. కొంతమంది బాలీవుడ్ నటులు చంద్రుడిపై సైట్ కొనుగోలు చేశారు.

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) 52వ పుట్టినరోజు సందర్భంగా ఆస్ట్రేలియాలోని ఓ అభిమాని చంద్రుడిపై ప్రాపర్టీని(Land On Moon) బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని కొన్నేళ్ల క్రితం షారుఖ్ వెల్లడించాడు. అక్కడ షారుఖ్ ఖాన్ కొన్న ప్రాంతానికి అతడి పేరే ఉంది. చంద్రుడిపై కొనుగోలు చేసిన మరో వ్యక్తి.. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌(Sushanth Singh Rajput). అతడికి సైన్స్, ఆకాశం పట్ల చాలా ఆసక్తి. ఈ ప్రముఖ బాలీవుడ్ నటుడు చంద్రుడిపై సైట్ కొన్నాడు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కొన్న ప్రాంతాన్ని మేర్ ముస్కోవియన్స్ లేదా 'మస్కోవి సీ' అని పిలుస్తారు.

ప్రతి ఒక్కరూ చంద్రునిపై ఆస్తిని కలిగి ఉండగలరా? చంద్రునిపై ప్రాపర్టీకి ఎంత ఖర్చవుతుంది? ఇలాంటి ప్రశ్నలు చాలామందికే వస్తాయి. చంద్రునిపై ఆస్తిని సొంతం చేసుకోవడం అనేది ఒక ప్రత్యేకమైన ఒప్పందంలా కనిపిస్తున్నప్పటికీ, చంద్రునిపై ఎవరైనా ఆస్తిని కలిగి ఉండవచ్చు. చందమామపై సైట్(Lunar Land Purchase)ని కొనుగోలు చేయడానికి ఒక మార్గం ఉంది. అది లూనార్ రిజిస్ట్రీ అనే వెబ్‌సైట్ ద్వారా. వారి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రాంతాన్ని ఎంచుకోవచ్చు. ఇందులో సీ ఆఫ్ ట్రాంక్విలిటీ, లేక్ ఆఫ్ డ్రీమ్స్ వంటి అనేక ప్రాంతాలను కలిగి ఉంది.

మీకు నచ్చిన ప్రాంతాన్ని ఎంచుకున్న తర్వాత డాక్యుమెంట్లను అందించి కొనుగోలు చేయవచ్చు. చంద్రునిపై ఎకరం సైట్ దాదాపు రూ.35 లక్షలపైనే ఉంటుందని అంటున్నారు. ఈ మేరకు పలు వార్తలు వచ్చాయి. అక్కడ మనిషి జీవించేందుకు అనుకూలంగా ఉందో లేదో తెలియదు కానీ.. సైట్ కొనేందుకు మాత్రం పలువురు ఆసక్తి చూపిస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం