తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha In Swimsuit: స్విమ్ సూట్‌లో సమంత.. నెవ్వర్ బిఫోర్ ఎక్స్ పోజింగ్ పిక్ వైరల్

Samantha In Swimsuit: స్విమ్ సూట్‌లో సమంత.. నెవ్వర్ బిఫోర్ ఎక్స్ పోజింగ్ పిక్ వైరల్

Sanjiv Kumar HT Telugu

09 November 2023, 15:32 IST

  • Samantha In Black Colour Swimsuit: టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత సోషల్ మీడియాలో హాట్ షో చేస్తూనే ఉంటుంది. తాజాగా సమంత బ్లాక్ కలర్ స్విమ్ సూట్‌లో కనిపించి షాక్ ఇచ్చింది. దీంతో సమంత లేటెస్ట్ స్విమ్ సూట్ పిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

బ్లాక్ కలర్ స్విమ్ సూట్‌లో సమంత.. నెవ్వర్ బిఫోర్ ఎక్స్ పోజింగ్ పిక్ వైరల్
బ్లాక్ కలర్ స్విమ్ సూట్‌లో సమంత.. నెవ్వర్ బిఫోర్ ఎక్స్ పోజింగ్ పిక్ వైరల్ (Instagram)

బ్లాక్ కలర్ స్విమ్ సూట్‌లో సమంత.. నెవ్వర్ బిఫోర్ ఎక్స్ పోజింగ్ పిక్ వైరల్

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ఏ మాయ చేశావే మూవీతో అడుగు పెట్టిన బ్యూటిఫుల్ సమంత తర్వాతి కాలంలో స్టార్ హీరోయిన్‍ రేంజ్ సంపాదించుకుంది. మొన్నటివరకు లేడి ఒరియెంటెడ్ చిత్రాలు చేసి మంచి హిట్ కొట్టింది. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్, యశోద సినిమా మంచి విజయాలు సాధించగా.. విజయ్ దేవరకొండతో చేసిన ఖుషి మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. మజిలి డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Prasanna Vadanam OTT Release date: ప్రసన్న వదనం ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఇలా చేస్తే 24 గంటలు ముందుగానే చూడొచ్చు..

Devara fear song promo: దేవర ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ప్రోమో చూశారా.. అదిరిపోయిన బీజీఎం

Suresh Babu on Theatres: ఓటీటీ మమ్మల్ని దెబ్బ కొడుతోంది.. థియేటర్లలను ఫంక్షన్ హాల్స్‌గా మార్చాల్సిందే: సురేశ్ బాబు

Prabhas Instagram Story: ప్రభాస్ పెళ్లి కాదు.. అతని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వెనుక అసలు విషయం ఇదీ

ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఆమె ఖుషికి ముందు కమిట్ అయిన సిటాడెల్ ఇండియన్ అడాప్షన్ సిరీస్ వంటివి పూర్తి చేసి రెస్ట్ తీసుకుంది. మయోసైటిస్ చికిత్స కోసం సామ్ అమెరికా కూడా వెళ్లింది. అక్కడే పూర్తిగా కోలుకునేందుకు చికిత్స తీసుకుంది. చికిత్స తర్వాత మరింత ఉత్సాహంగా కెరీర్ పరంగా ముందుకు సాగుతోంది సమంత. సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం హాట్ షోతో హీట్ పెంచేస్తోంది.

ఇటీవలే సాకి వరల్డ్, బల్గారి జ్యూవెల్లరీ వంటి పాపులర్ బ్రాండ్లకు ప్రచారం చేస్తూ ఫొటోషూట్ చేసింది సమంత. అందులో ఆ బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడమే కాకుండా సమంత అందాలను చాలా ఘాటుగా ఎక్స్స పోజ్ చేసింది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. తాజాగా సామ్ చేసిన ఫొటోషూట్ అంతకుమించి అనేలా ఉంది. సమంత బజార్ ఇండియా సంస్థకు ఫొటోషూట్ చేసింది. ఇందులో బ్లాక్ కలర్ స్విమ్ సూట్ ధరించి సమంత నెవ్వర్ బిఫోర్ ఎక్స్ పోజింగ్ చేసింది.

షార్ట్ హెయిర్‌తో చురకత్తుల్లా చూసే చూపులతో సమంత అందాలు సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తున్నాయి. సినిమాల్లో బికినీ వేసిన సమంత చాలా రోజులకు ఇలా చాలా హాట్‌గా కనిపించడంతో నెటిజన్లు, ప్రేక్షకులు, అభిమానులు నోరు వెళ్లబెడతున్నారు. దీంతో సమంత స్విమ్ సూట్ పిక్ తెగ వైరల్ అవుతోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం