తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha: నాగ చైతన్య విషయంలో దొరికిపోయిన సమంత.. ఆ పుకార్లకు చెక్.. ఫొటోలు వైరల్

Samantha: నాగ చైతన్య విషయంలో దొరికిపోయిన సమంత.. ఆ పుకార్లకు చెక్.. ఫొటోలు వైరల్

Sanjiv Kumar HT Telugu

05 November 2023, 12:12 IST

  • Samantha Tattoo: సౌత్ ముద్దుగుమ్మ సమంత తన మాజీ భర్త నాగ చైతన్య విషయంలో మరోసారి టాటూ ద్వారా దొరికిపోయింది. గత కొంతకాలంగా వస్తున్న టాటూ పుకార్లకు తాజాగా చెక్ పెట్టినట్లయింది. అందుకు సంబంధించిన సమంత ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

నాగ చైతన్య విషయంలో దొరికిపోయిన సమంత.. ఆ పుకార్లకు చెక్.. ఫొటోలు వైరల్
నాగ చైతన్య విషయంలో దొరికిపోయిన సమంత.. ఆ పుకార్లకు చెక్.. ఫొటోలు వైరల్ (Instagram)

నాగ చైతన్య విషయంలో దొరికిపోయిన సమంత.. ఆ పుకార్లకు చెక్.. ఫొటోలు వైరల్

Samantha Naga Chaitanya Tattoo: తెలుగు బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండి మయోసైటిస్ నుంచి కోలుకోవడానికి చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, అనారోగ్యం నుంచి కోలుకున్న సమంత మళ్లీ సినిమాలపై ఫోకస్ పెడుతూ ఫుల్ జోష్‌లో ఉంది. ఇటీవలే రక్షిత్ శెట్టి సప్త సాగరాలు దాటి సైడ్ బి ట్రైలర్ విడుదల చేసిన సమంత హాలీవుడ్ మార్వెల్స్ సంస్థ మూవీ 'ది మార్వెల్స్' ప్రమోషన్స్ లో పాల్గొంది.

ట్రెండింగ్ వార్తలు

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

రిలేషన్‌లో ఉన్నప్పుడు

ది మార్వెల్స్ సినిమాలో మెయిన్ మార్వెల్ క్యారెక్టర్‌కు తెలుగు కోసం సమంత డబ్బింగ్ చెప్పింది. దానికి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత తన సూపర్ హీరో మార్వెల్స్ అని తెలిపింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా హాట్ పిక్స్ వదులుతూ హీట్ పెంచుతున్న సమంత తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలతో అడ్డంగా దొరికిపోయింది. హీరో నాగ చైతన్యతో రిలేషన్‌లో ఉన్నప్పుడు అతని పేరుతో నడుముపై భాగమైన పక్కటెముకలపై టాటూ వేయించుకుంది.

సమంత లేటెస్ట్ ఫొటోలతో

ఇటీవల పింక్ చీరలో, అప్పట్లో కొన్ని ఫొటోల్లో సమంత ఒంటిపై ఆ టాటూ కనిపించలేదు. దాంతో సమంత చై టాటూ తీసేసుకుందా, లేదా మేకప్‌తో కవర్ చేసిందా అనే చర్చ మొదలైంది. తాజాగా సిటాడెల్ వెబ్ సిరీస్ లండన్ ప్రీమియర్‌కు హాజరైంది. ఈ క్రమంలోనే దిగిన కొన్ని ఫొటోలను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో సమంత రిబ్స్ పై ఆ టాటూ స్పష్టంగా కనిపించింది. అంటే నాగ చైతన్య టాటూను సమంత తీయించేసుకోలేదని క్లియర్‌గా చెబుతూ గతంలోని రూమర్స్ కు చెక్ పెట్టింది సామ్.

ఎదకి దగ్గరగా

జీన్ పాయింట్, బ్లాక్ హుడీ వేసుకున్న సమంత లేటెస్ట్ ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో సమంత సూపర్ హాట్‌గా కనిపించి అట్రాక్ట్ చేస్తోంది. కాగా సమంత మెడపై వైఎంసీ (ఏం మాయ చేశావే) అనే అర్థం వచ్చేలా షార్ట్ ఫామ్‌లో ఒక టాటూ ఉంటుంది. అలాగే సామ్ కుడి చేతి మీద మరో టాటూ, ఎదకి దగ్గరగా సీక్రెట్ ప్లేసులో (రిబ్స్) చై అనే టాటూ ఇంకొకటి వేయించుకుంది. ఇవే కాకుండా సమంత, నాగ చైతన్య ఇద్దరూ తమ చేతుల మీద రెండు గీతలతో ఉన్న ఒకే రకమైన టాటూ ఉంటుంది.

టాటూ అర్థం

ఆ టాటూకి అర్థం ఏంటో కూడా సమంత గతంలో తెలిపింది. నీ మార్గాన్ని నువ్వు ఎంచుకో.. క్రియేట్ చేసుకో అనే అర్థంలో ఆ రెండు గీతలను వాడతారట. అయితే, సమంత లేటెస్ట్ ఫొటోలతో ఈ టాటూల విషయం మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం