తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar New Poster: ఫ్యాన్స్‌కు స‌లార్ టీమ్ ప్ర‌భాస్ బ‌ర్త్‌డే ట్రీట్ - కొత్త పోస్ట‌ర్ రిలీజ్‌

Salaar New Poster: ఫ్యాన్స్‌కు స‌లార్ టీమ్ ప్ర‌భాస్ బ‌ర్త్‌డే ట్రీట్ - కొత్త పోస్ట‌ర్ రిలీజ్‌

24 October 2022, 6:31 IST

  • Salaar New Poster: ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా స‌లార్ కొత్త పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పోస్ట‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

ప్ర‌భాస్
ప్ర‌భాస్

ప్ర‌భాస్

Salaar New Poster: ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా స‌లార్ టీమ్ ఇంటెన్స్ పోస్ట‌ర్ రిలీజ్ చేసింది. ఈ పోస్ట‌ర్‌లో శ‌త్రువుల‌పై పోరాటానికి సిద్ధ‌మైన‌ట్లుగా ప‌వ‌ర్‌ఫుల్ లుక్‌లో ప్ర‌భాస్ క‌నిపిస్తున్నాడు. అత‌డి లుక్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. అలాగే ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ కూడా ప్ర‌భాస్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అంద‌జేస్తూ స‌లార్ వ‌ర్కింగ్ స్టిల్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. నీ కెరీర్‌లో ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా ఈ ఏడాది ప్ర‌త్యేకంగా నిలిచిపోవ‌డానికి మా వంతు కృషి చేస్తున్నాం అంటూ ఫొటోకు క్యాప్ష‌న్ జోడించాడు.

ట్రెండింగ్ వార్తలు

Laya: ఆ డైరెక్టర్ చంపుతానని బెదిరించాడు.. 18 ఏళ్లకు నిజం బయటపెట్టిన హీరోయిన్ లయ

Sunil: మ‌మ్ముట్టి సినిమాలో విల‌న్‌గా సునీల్ - ట‌ర్బోతో మ‌ల‌యాళంలోకి ఎంట్రీ - ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

Vijay Sethupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కొత్త ప్రయోగం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా ఏసీఈ

NNS May 18th Episode: పుట్టింటికి అరుంధతి.. సరస్వతిని చంపేస్తున్న మనోహరి.. అందరికీ తెలియనున్న నిజం​​​!

ఈ ఫొటోలో ప్ర‌శాంత్ నీల్ మాట‌ల‌కు ప్ర‌భాస్ న‌వ్వుతూ క‌నిపిస్తున్నాడు. చిత్ర నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిల్మ్స్ కూడా ప్ర‌భాస్ వ‌ర్కింగ్ స్టిల్‌ను త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఖాకీ డ్రెస్‌లో ప్ర‌భాస్ క‌నిపిస్తున్నాడు. స‌లార్‌కు సంబంధించిన ప్ర‌భాస్ పోస్ట‌ర్‌, వ‌ర్కింగ్ స్టిల్స్‌ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. దాదాపు రెండు వంద‌ల కోట్ల వ్య‌యంతో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను పాన్ ఇండియ‌న్ స్థాయిలో తెలుగు, క‌న్న‌డం, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు.

శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆద్య అనే జ‌ర్న‌లిస్ట్‌గా ఆమె క‌నిపించ‌బోతున్న‌ది. విల‌న్‌గా మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ న‌టిస్తున్నాడు. ఇటీవ‌లే అత‌డి ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. వ‌చ్చే స‌లార్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం