తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar Release Trailer: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు ట్విస్ట్ - స‌లార్ సెకండ్ ట్రైల‌ర్ రిలీజ్‌ పోస్ట్‌పోన్‌

Salaar Release Trailer: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు ట్విస్ట్ - స‌లార్ సెకండ్ ట్రైల‌ర్ రిలీజ్‌ పోస్ట్‌పోన్‌

18 December 2023, 11:02 IST

  • Salaar Release Trailer: స‌లార్ సెకండ్ ట్రైల‌ర్ రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యింది. ఉద‌యం  రిలీజ్ కావాల్సిన ట్రైల‌ర్‌ను మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిల్మ్స్ ప్ర‌క‌టించింది. ట్రైల‌ర్ రిలీజ్ పోస్ట్‌పోన్ కావ‌డంతో ప్ర‌శాంత్ నీల్‌పై ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతోన్నారు.

ప్రభాస్ సలార్
ప్రభాస్ సలార్

ప్రభాస్ సలార్

Salaar Release Trailer: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ను ప్ర‌శాంత్ నీల్ అండ్ టీమ్ డిస‌పాయింట్ చేసింది. స‌లార్ సెకండ్ ట్రైల‌ర్ రిలీజ్ వాయిదాప‌డింది. ది ఫైన‌ల్ పంచ్ పేరుతో స‌లార్ సెకండ్ ట్రైల‌ర్‌ను సోమ‌వారం ఉద‌యం 10.42 నిమిషాల‌కు రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిల్మ్స్ ప్ర‌క‌టించింది. ట్రైల‌ర్ రిలీజ్‌కు నాలుగు నిమిషాల ముందు అభిమానుల‌కు షాకిచ్చింది. స‌లార్ సెకండ్ ట్రైల‌ర్‌ను 10.42 నిమిషాల‌కు కాకుండా మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ట్రెండింగ్ వార్తలు

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

రెండోసారి ట్రైల‌ర్ రిలీజ్ పోస్ట్‌పోన్ కావ‌డంతో హోంబ‌లే ఫిల్మ్స్‌తో పాటు ప్ర‌శాంత్ నీల్‌పై ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతోన్నారు. సోష‌ల్ మీడియాలో బూతుల‌తో విరుచుకుప‌డుతోన్నారు. ఈ ట్విస్ట్ ఎక్స్‌పెక్ట్ చేయ‌లేద‌ని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు కూడా ట్రైల‌ర్ రిలీజ్ కావ‌డం అనుమాన‌మేన‌ని మ‌రో నెటిజ‌న్ పేర్కొన్నాడు.

ట్రైల‌ర్ మాదిరిగా సినిమా షోస్ మాత్రం డిలే చేయ‌వ‌ద్దంటూ హోంబ‌లే ఫిల్మ్స్‌కు మ‌రికొంద‌రు నెటిజ‌న్లు స‌ల‌హా ఇస్తున్నారు. ట్రైల‌ర్‌కు సంబంధించిన కొన్ని ప‌నులు పూర్తికాక‌పోవ‌డంతోనే మ‌ధ్యాహ్నానికి పోస్ట్‌పోన్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌ర‌గుతోంది. తొలుత ఈ ట్రైల‌ర్‌ను ఆదివారం రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. కానీ పోస్ట్‌పోన్ చేసి సోమ‌వారం రిలీజ్ చేస్తోన్నారు.

స‌లార్ సినిమా సెకండ్ ట్రైల‌ర్ యాక్ష‌న్ అంశాల‌తో ప్ర‌శాంత్ నీల్ క‌ట్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. స‌లార్ సినిమాలో ప్ర‌భాస్‌, పృథ్వీరాజ్ సుకుమార‌న్ ప్రాణ స్నేహితులుగా న‌టిస్తోన్నారు. ఫ్రెండ్‌షిప్ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్ర‌శాంత్ నీల్ ఈ మూవీని తెర‌కెక్కిస్తోన్నాడు. డిసెంబ‌ర్ 22న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ కానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం