తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar Prabhas Cutout: కటౌట్ చూసి నమ్మేయాలి డ్యూడ్.. ప్రభాస్ 120 అడుగుల కటౌట్ చూశారా?

Salaar Prabhas Cutout: కటౌట్ చూసి నమ్మేయాలి డ్యూడ్.. ప్రభాస్ 120 అడుగుల కటౌట్ చూశారా?

Hari Prasad S HT Telugu

18 December 2023, 15:55 IST

    • Salaar Prabhas Cutout: సలార్ మూవీ కోసం ఏకంగా 120 అడుగుల ప్రభాస్ కటౌట్ ఏర్పాటు చేయడం విశేషం. అది కూడా తెలుగు రాష్ట్రాల్లో కాదు.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో.
ముంబైలో ఏర్పాటు చేసిన ప్రభాస్ 120 అడుగుల కటౌట్
ముంబైలో ఏర్పాటు చేసిన ప్రభాస్ 120 అడుగుల కటౌట్

ముంబైలో ఏర్పాటు చేసిన ప్రభాస్ 120 అడుగుల కటౌట్

Salaar Prabhas Cutout: దేశాన్ని సలార్ మూవీ మేనియా పట్టి ఊపేస్తోంది. అందులో భాగంగానే ముంబైలో ప్రభాస్ కు చెందిన 120 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు. ఈ మహా నగరంలోని ఆర్ మాల్ లో ఈ అత్యంత భారీ కటౌట్ పెట్టడం విశేషం. ముంబైలో ఇప్పటి వరకూ ఏ సినిమా ప్రమోషన్ కోసం కూడా ఇంత భారీ కటౌట్ ఏర్పాటు చేయలేదు.

ట్రెండింగ్ వార్తలు

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఈ భారీ కటౌట్ ఏర్పాటు చేస్తున్న వీడియోను సలార్ అధికారిక ఎక్స్ సోషల్ మీడియా అకౌంట్ పోస్ట్ చేసింది. "ముంబైలోని ఆర్ మాల్ ఇప్పుడే సలారిఫైడ్ అయింది. ఈ యాక్షన్ ఎపిక్ కి ఉన్న హైప్ ఎలాంటిదో రెబల్ స్టార్ ప్రభాస్ 120 అడుగుల ఈ కటౌట్ చెబుతోంది. డిసెంబర్ 22 నుంచి సలార్ సీజ్‌ఫైర్ సినిమాస్ లో రాబోతోంది" అంటూ సలార్ టీమ్ ఓ వీడియో పోస్ట్ చేసింది.

ఈ వీడియోలో ఈ 120 అడుగుల భారీ ప్రభాస్ కటౌట్ ఎలా చేశారో చూపించారు. ఆ కటౌట్ చూసి ఆ దారిలో వెళ్తున్న ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ప్రభాస్ కటౌట్ ను వీడియోలు, ఫొటోలు తీయడానికి పోటీ పడుతున్నారు. సెల్ఫీలు దిగుతున్నారు. సలార్ మూవీ డిసెంబర్ 22న రిలీజ్ కానుండగా.. సోమవారం (డిసెంబర్ 18) మధ్యాహ్నం రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ మొదటి ట్రైలర్ కంటే కూడా గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. మొదటి ట్రైలర్ లో ప్రభాస్ ను చివర్లో చూపించిన మేకర్స్.. ఇందులో మాత్రం కాస్త ఎక్కువగానే అతడు కనిపించేలా జాగ్రత్త పడ్డారు. 2 నిమిషాల 53 సెకన్ల ఈ ట్రైలర్ ఖాన్సార్ నగర హింసాత్మక స్టోరీని కళ్లకు కట్టే ప్రయత్నం చేసింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం