తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sai Pallavi: సాయిప‌ల్ల‌వి గార్గి థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేది ఎప్పుడంటే...

Sai Pallavi: సాయిప‌ల్ల‌వి గార్గి థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేది ఎప్పుడంటే...

HT Telugu Desk HT Telugu

03 July 2022, 13:46 IST

  • విరాటపర్వం అనంతరం నెల రోజుల గ్యాప్ లోనే మరోసారి ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది సాయిపల్లవి(sai pallavi). ఆమె ప్రధాన పాత్రలో నటించిన గార్గి(gargi movie release date) సినిమా ఈ నెలలోనే రిలీజ్ కానుంది. గార్గి థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే...

సాయిపల్లవి
సాయిపల్లవి (twitter)

సాయిపల్లవి

సాయిప‌ల్ల‌వి న‌టించిన విరాట‌ప‌ర్వం చిత్రం గ‌త నెల‌లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో న‌క్స‌లిజం భావ‌జాలం ప‌ట్ల ఆక‌ర్షితురాలైన ప‌ల్లెటూరి యువ‌తిగా అద్భుత‌మైన అభిన‌యంతో ఆక‌ట్టుకున్న‌ది సాయిపల్లవి. ఆమె న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. క‌మ‌ర్షియ‌ల్‌గా సినిమా విజ‌యం సాధించ‌లేక‌పోయినా న‌టిగా మాత్రం సంతృప్తిని మిగిల్చింద‌ని విరాటపర్వం ఫలితం గురించి ఇటీవలే సాయిప‌ల్ల‌వి పేర్కొన్న‌ది.

ట్రెండింగ్ వార్తలు

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

నెల రోజుల గ్యాప్ లోనే సాయిప‌ల్ల‌వి న‌టించిన మ‌రో చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన గార్గి చిత్రం జూలై 15న రిలీజ్ కానుంది. ఈ విష‌యాన్ని సాయిప‌ల్ల‌వి సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది. ఈ చిత్రానికి గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఛాలెంజింగ్ పాత్రలో సాయిపల్లవి కనిపించబోతున్నది. న్యాయం కోసం పోరాడే యువతిగా డిఫరెంట్ గా ఆమె క్యారెక్టర్ సాగనున్నట్లు సమాచారం.

హీరో సూర్య నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణలో గార్గి సినిమా రూపొందుతోంది. తమిళ చిత్రం 96 ఫేమ్ గోవింద్ వసంత సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ భాషల్లో ఏకకాలంలో గార్గి సినిమాను చిత్రీకరించారు. తన పుట్టినరోజు సందర్భంగా సాయిపల్లవి ఈ సినిమా ఫస్ట్ లుక్ ను అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం