తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rrr Promotions | గోల్డెన్‌ టెంపుల్‌లో ఆర్ఆర్ఆర్‌ టీమ్‌.. పిక్స్‌ వైరల్‌

RRR Promotions | గోల్డెన్‌ టెంపుల్‌లో ఆర్ఆర్ఆర్‌ టీమ్‌.. పిక్స్‌ వైరల్‌

HT Telugu Desk HT Telugu

21 March 2022, 13:30 IST

    • RRR Promotions పీక్‌ స్టేజ్‌కు చేరుకుంటున్నాయి. మూవీ రిలీజ్‌ టైమ్‌ దగ్గర పడుతున్న కొద్దీ టీమ్‌ నార్త్‌ ఇండియాలో విస్తృతంగా ప్రమోషనల్‌ ఈవెంట్స్ చేపడుతోంది.
స్వర్ణమందిరం బయట ఆర్ఆర్ఆర్ త్రయం
స్వర్ణమందిరం బయట ఆర్ఆర్ఆర్ త్రయం (Twitter)

స్వర్ణమందిరం బయట ఆర్ఆర్ఆర్ త్రయం

రాజమౌళి తన ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్స్‌ను కొత్త లెవల్‌కు తీసుకెళ్తున్నాడు. ఆదివారం ఢిల్లీలో బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌తో మూవీ ప్రమోషనల్‌ ఈవెంట్‌ నిర్వహించిన టీమ్‌.. సోమవారం పంజాబ్‌ టూర్‌లో బిజీగా గడుపుతోంది. ఈ సందర్భంగా అమృత్‌సర్‌లోని గోల్డెన్‌ టెంపుల్‌కు వెళ్లింది ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌. 

ట్రెండింగ్ వార్తలు

Chandini Chowdary: కొత్తగా పెళ్లైన జంట ఎదుర్కొనే సమస్యతో మూవీ- గామి హీరోయిన్ చాందినీ చౌదరి మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

OTT Horror Movie: ఓటీటీలో భయపెట్టనున్న సరికొత్త హారర్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్! ఎక్కడంటే?

Siddharth40: సిద్ధార్థ్ హీరోగా 40వ సినిమా.. తెలుగు తమిళంలో ద్విభాషా చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?

Balakrishna vs Jr NTR: బాక్సాఫీస్ వద్ద బాబాయి, అబ్బాయి పోటీ ఉండనుందా?

ఆర్‌ఆర్‌ఆర్‌ త్రయం రాజమౌళి, రామ్‌చరణ్‌, రామారావు స్వర్ణ మందిరాన్ని సందర్శించుకుందంటూ మేకర్స్‌ ఆ ఫొటోలను రిలీజ్‌ చేశారు. గోల్డెన్‌ టెంపుల్‌కు వెళ్లే సమయంలో ఈ ముగ్గురూ అక్కడి సాంప్రదాయ దుస్తులను ధరించారు. మూవీ రిలీజ్‌కు మరో మూడు రోజులే సమయం ఉండటంతో నార్త్‌ ఇండియాను మొత్తం వేగంగా చుట్టేయాలని టీమ్‌ భావిస్తోంది. 

ఈ భారీ బడ్జెట్‌ మూవీకి హిందీ బెల్ట్‌ చాలా ముఖ్యం. బాహుబలి 2 మూవీ ఇండియన్‌ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులన్నింటినీ తిరగరాసిందంటే దానికి కారణం ఈ హిందీ బెల్టే. దీంతో నార్త్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్స్‌ను ఎక్కువగా నిర్వహించాలని రాజమౌళి భావిస్తున్నాడు. ఆలియా భట్‌, అజయ్‌ దేవ్‌గన్‌లాంటి బాలీవుడ్‌ స్టార్లను తీసుకొని అక్కడి ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం రాజమౌళి చేశాడు. 

దీనికితోడు దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ ఓ మెగా ఈవెంట్‌ను టీమ్‌ ప్లాన్‌ చేస్తోంది. ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా మూవీ రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు బెనిఫిట్‌ షోలు, రోజుకు ఐదు షోలకు సిద్ధమవుతుండగా.. తొలి రోజే ఇండస్ట్రీ రికార్డులన్నీ చెరిపేయడానికి ఆర్‌ఆర్‌ఆర్‌ రెడీగా ఉంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం