తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rc15 Update: ఒక్క పాట కోసం ప‌ది కోట్లు - ఆర్‌సీ 15 కోసం శంక‌ర్ గ్రాండ్ ప్లాన్‌

RC15 Update: ఒక్క పాట కోసం ప‌ది కోట్లు - ఆర్‌సీ 15 కోసం శంక‌ర్ గ్రాండ్ ప్లాన్‌

09 March 2023, 5:59 IST

  • RC15 Update: రామ్‌చ‌ర‌ణ్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియ‌న్ సినిమా నెక్స్ట్ షెడ్యూల్‌లో పాట‌ను చిత్రీక‌రించ‌బోతున్నారు. ఈ ఒక్క పాట కోస‌మే దాదాపు 10 కోట్ల ఖ‌ర్చు చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

రామ్‌చ‌ర‌ణ్
రామ్‌చ‌ర‌ణ్

రామ్‌చ‌ర‌ణ్

RC15 Update: ఆర్ఆర్ఆర్ ఘ‌న విజ‌యం త‌ర్వాత భారీ చిత్రాల ద‌ర్శ‌కుడు శంక‌ర్‌తో ఓ పాన్ ఇండియ‌న్ సినిమా చేస్తోన్నాడు రామ్ చ‌ర‌ణ్‌. పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను దాదాపు రెండు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్‌రాజు నిర్మించ‌బోతున్నారు. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ఈ నెల 19 లేదా 20వ తేదీ నుంచి మొద‌లుకాబోతున్న‌ట్లు తెలిసింది.

ట్రెండింగ్ వార్తలు

Brahmamudi: డబ్బు కోసమే మాయా బిడ్డ డ్రామా.. కావ్యకు రాజ్ వార్నింగ్.. భయపడిపోయిన శైలేంద్ర.. కొత్తగా మీరా అబార్షన్ డ్రామా

OTT Movies To Watch: ఓటీటీలో ఈ వారం ఈ 4 మిస్ అవ్వొద్దు.. దేని దానికే డిఫరెంట్.. ఇక్కడ చూసేయండి మరి!

Silk Saree Movie: సీరియల్ నటుడు హీరోగా మూవీ.. సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరీగా సిల్క్ శారీ

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

ఈ షెడ్యూల్‌లో హైద‌రాబాద్‌లో రామ్‌చ‌ర‌ణ్. కియారా అద్వానీల‌పై ఓ పాట‌ను గ్రాండ్ స్కేల్‌లో చిత్రీక‌రించేందుకు శంక‌ర్ స‌న్నాహాలు చేస్తోన్న‌ట్లు స‌మాచారం. ఈ పాట కోసం శంషాబాద్‌లో ఆర్ట్ డైరెక్ట‌ర్ అవినాష్ కొల్లా సార‌ధ్యంలో ఓ భారీ సెట్ సిద్ధం చేస్తోన్నట్లు.

దాదాపు ప‌ది కోట్ల ఖ‌ర్చుతో లావిష్‌గా ఈ సాంగ్‌ను చిత్రీక‌రించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. శంక‌ర్ సినిమాల శైలిలోనే రిచ్‌గా ఈ సాంగ్ ఉంటుంద‌ని అంటున్నారు. దాదాపు ప‌ది రోజుల పాటు ఈ సాంగ్ షూట్ జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ సాంగ్ త‌ర్వాత నెక్స్ట్ షెడ్యూల్ ఏప్రిల్‌లో మొద‌లుకాబోతున్న‌ట్లు చెబుతున్నారు.

రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే రోజు...

ఆర్‌సీ 15 సినిమాకు సంబంధించిన టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్‌ను రామ్‌చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మార్చి 27న అనౌన్స్ చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. ఈ సినిమాకు సీఈవోతో పాటు సేనాని అనే టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఆర్‌సీ 15 సినిమాను రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలుచేస్తోన్నారు. ఈ సినిమాలో అంజ‌లి, సునీల్‌, శ్రీకాంత్, న‌వీన్‌చంద్ర కీల‌క పాత్ర‌ల్ని పోషిస్తోన్నారు. కాగా ఆస్కార్ వేడుక కోసం ప్ర‌స్తుతం అమెరికా వెళ్లాడు రామ్‌చ‌ర‌ణ్‌. ఈ ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్న అత‌డు ఈ నెల 15న ఇండియాకు తిరిగి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం