తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Eagle Twitter Review: ఈగ‌ల్ ట్విట్ట‌ర్ రివ్యూ - ర‌వితేజ శివ‌తాండ‌వం - మాస్ మ‌హారాజా క‌మ్‌బ్యాక్‌

Eagle Twitter Review: ఈగ‌ల్ ట్విట్ట‌ర్ రివ్యూ - ర‌వితేజ శివ‌తాండ‌వం - మాస్ మ‌హారాజా క‌మ్‌బ్యాక్‌

09 February 2024, 5:46 IST

  • Eagle Twitter Review: ర‌వితేజ హీరోగా కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈగ‌ల్ మూవీ ఫిబ్ర‌వ‌రి 9న (శుక్ర‌వారం ) థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, కావ్య థాప‌ర్ హీరోయిన్లుగా న‌టించారు.

ఈగ‌ల్ ట్విట్ట‌ర్ రివ్యూ
ఈగ‌ల్ ట్విట్ట‌ర్ రివ్యూ

ఈగ‌ల్ ట్విట్ట‌ర్ రివ్యూ

Eagle Twitter Review: మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టించిన ఈగ‌ల్ మూవీ ఈ శుక్ర‌వారం (ఫిబ్ర‌వ‌రి 9న‌) థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. సినిమాటోగ్రాఫ‌ర్ కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని ఈగ‌ల్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ధ‌మాకా స‌క్సెస్ త‌ర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌లో ర‌వితేజ చేసిన మూవీ ఇది. ఈగ‌ల్‌లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, కావ్య థాప‌ర్ హీరోయిన్లుగా న‌టించారు. రావ‌ణాసుర‌, టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు డిజాస్ట‌ర్స్ త‌ర్వాత వ‌చ్చిన ఈ మూవీ ర‌వితేజ మ‌ళ్లీ క‌మ్ బ్యాక్ ఇచ్చాడా? బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడా? ఈగ‌ల్ సినిమా ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉందంటే?

ట్రెండింగ్ వార్తలు

Preminchoddu: పిల్లలకు తల్లిదండ్రులు చూపించాల్సిన సినిమా.. తెలుగులో తమిళ ఫ్లేవర్‌తో ప్రేమించొద్దు

Blink OTT Streaming: వీకెండ్‌లో ఈ కన్నడ సై-ఫి థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దంటున్న ఓటీటీ ప్రేక్షకులు

Flop Movies With super hit songs: పాట హిట్.. బొమ్మ ఫట్.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న ఫ్లాప్ మూవీస్ ఇవే

Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

ర‌వితేజ క‌మ్‌బ్యాక్‌...

టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు, రావ‌ణాసుర బ్యాక్ టూ బ్యాక్ డిజాస్ట‌ర్స్ త‌ర్వాత ఈగ‌ల్‌తో ర‌వితేజ మ‌ళ్లీ అదిరిపోయే క‌మ్‌బ్యాక్ ఇచ్చాడ‌ని నెటిజ‌న్లు ట్వీట్స్ చేస్తున్నారు. తెలుగులో వ‌చ్చిన వ‌న్ ఆఫ్ ది బెస్ట్ యాక్ష‌న్ మూవీగా ఈగ‌ల్ నిల‌వ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. డిఫ‌రెంట్ పాయింట్‌తో కంప్లీట్ స్క్రీన్‌ప్లే బేస్‌డ్ మూవీగా ద‌ర్శ‌కుడు కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని ఈగ‌ల్‌ను తెర‌కెక్కించాడ‌ని ఓ నెటిజ‌న్ ట్వీట్ చేశాడు. లాస్ట్ 40 మినిట్స్ ఈ మూవీ గూస్‌బంప్స్‌ను క‌లిగిస్తుంద‌ని అంటున్నారు. ఇంట‌ర్వెల్ ముందు వ‌చ్చే యాక్ష‌న్ సీక్వెన్స్‌కు థియేట‌ర్లు బ్లాస్ట్ అవ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ర‌వితేజ శివ‌తాండ‌వం...

స‌హ‌దేవ వ‌ర్మ పాత్ర‌లో ర‌వితేజ యాక్టింగ్‌, మేన‌రిజ‌మ్స్ ఈగ‌ల్ మూవీలో కొత్త‌గా ఉన్నాయ‌ని అంటున్నారు. యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌లో ర‌వితేజ శివ‌తాండ‌వం చూస్తార‌ని పేర్కొంటున్నారు. క్లైమాక్స్ ఎపిసోడ్‌లో అయితే ర‌వితేజ ర్యాంప్ ఆడించాడ‌ని ట్వీట్స్ చేస్తున్నారు. ర‌వితేజ లుక్ కూడా గ‌త సినిమాల‌కు పూర్తి భిన్నంగా ఉంటుంద‌ని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. ర‌వితేజ ఫ్యాన్స్‌కు పూన‌కాలు క‌లిగించ‌డం ఖాయ‌మ‌ని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. మాస్ జాత‌ర‌లా ఉంటుంద‌ని అన్నాడు. డైలాగ్స్ ఇంప్రెసివ్‌గా ఉన్నాయ‌ని చెబుతున్నారు.

సెకండ్ పార్ట్‌...

మెసేజ్‌, క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను ఈగ‌ల్‌లో ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా బ్లెండ్ చేశాడ‌ని చెబుతున్నారు. క‌రెంట్ ఇష్యూను బేస్ చేసుకొని ఈ మూవీని తెర‌కెక్కించాడ‌ని అంటున్నారు. ఈగ‌ల్‌కు సెకండ్ పార్ట్ కూడా ఉండ‌బోతున్న‌ట్లు క్లైమాక్స్‌లో రివీల్ చేశార‌ని అంటున్నారు. సెకండ్ పార్ట్‌కు సంబంధించిన ఇచ్చిన హింట్ అద్భుతంగా ఉంటుంద‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

బీజీఎమ్, సినిమాటోగ్ర‌ఫీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంద‌ని అంటున్నారు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, కావ్య థాప‌ర్ న‌ట‌న, వారి క్యారెక్ట‌ర్స్ రాసుకున్న తీరు కూడా బాగుంద‌ని ఓ నెటిజ‌న్ ట్వీట్ చేశాడు.. హీరోహీరోయిన్ల‌తో పాటు ప్ర‌తి పాత్ర‌కు సినిమాలో ఇంపార్టెన్స్ ఉండేలా ద‌ర్శ‌కుడు స్క్రీన్‌ప్లే రాసుకున్న తీరు బాగుంద‌ని అంటున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం