తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rashmika Mandanna | తలపతి సరసన కన్నడ బ్యూటీ

Rashmika Mandanna | తలపతి సరసన కన్నడ బ్యూటీ

HT Telugu Desk HT Telugu

05 April 2022, 22:28 IST

    • రష్మిక మందన్నా బర్త్‌డే సర్‌ప్రైజ్‌లు మామూలుగా లేవు. ఉదయం ప్రొడక్షన్‌ నంబర్‌ 7 నుంచి ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ రిలీజ్‌ కాగా.. సాయంత్రం తలపతి 66లో విజయ్‌ సరసన ఫిమేల్‌ లీడ్‌ రష్మికనే అని మూవీ మేకర్స్‌ ప్రకటించారు.
మంగళవారం 26వ పుట్టిన రోజు జరుపుకున్న రష్మిక మందన్నా
మంగళవారం 26వ పుట్టిన రోజు జరుపుకున్న రష్మిక మందన్నా (HT_PRINT)

మంగళవారం 26వ పుట్టిన రోజు జరుపుకున్న రష్మిక మందన్నా

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లలో ఒకరైన రష్మిక మందన్నా వరుస మూవీలతో బిజీబిజీగా గడుపుతోంది. పుష్ప ఫస్ట్‌ పార్ట్‌ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేసే టైమ్‌ కూడా ఆమెకు దొరకడం లేదు. మిషన్‌ మజ్ను మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ఆమె.. బిగ్‌బీ అమితాబ్‌తో గుడ్‌బై మూవీలోనూ నటిస్తోంది. అటు పుష్ప సెకండ్‌ పార్ట్‌ సెట్‌లోకీ త్వరలోనే వెళ్లనుంది. ఇక తాజాగా మంగళవారం ఆమె బర్త్‌డే సందర్భంగా తలపతి 66 మేకర్స్‌ ఈ మూవీలో ఫిమేల్‌ లీడ్‌ ఆమే అంటూ అధికారికంగా ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

Maya Petika OTT: మరో ఓటీటీలోకి కూడా వచ్చేస్తున్న పాయల్ రాజ్‌పుత్ మాయా పేటిక మూవీ

Aquaman and the Lost Kingdom OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్.. ఫ్రీగా చూసేయండి

Dakshina Trailer: తెలుగులో క‌బాలి హీరోయిన్ సైకో కిల్ల‌ర్ మూవీ - ట్రైల‌ర్ రిలీజ్ చేసిన ఉప్పెన డైరెక్ట‌ర్‌

Zee Mahotsavam OTT: టీవీలో రమ్యకృష్ణ కాజల్ జయప్రద సందడి.. ఓటీటీలో కూడా చూడొచ్చు.. ఎలా అంటే?

ఓ స్పెషల్‌ పోస్టర్‌ను ప్రొడక్షన్‌ హౌజ్‌ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. టాలెంటెడ్‌, గార్జియస్‌ రష్మిక మందన్నాకు హ్యాపీ బర్త్‌డే. వెల్‌కమ్‌ ఆన్‌బోర్డ్‌ తలపతి 66 అంటూ ట్వీట్‌ చేసింది. అటు మూవీకి మ్యూజిక్ తమన్ అందించనున్నట్లు కూడా మరో  ట్వీట్ లో తెలిపింది. ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనుండగా.. లీడ్‌ రోల్‌లో తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ నటిస్తున్నాడు. నిజానికి గతేడాది సెప్టెంబర్‌లోనే ఈ మూవీలో విజయ్‌ నటిస్తున్నట్లు శ్రీ వెంకటేశ్వర్‌ క్రియేషన్స్‌ చెప్పింది. మొత్తానికి ఇన్నాళ్లకు ఫిమేల్‌ లీడ్‌ పేరునూ ప్రకటించింది.

విజయ్‌, రష్మిక కాంబినేషన్‌లో వస్తున్న తొలి మూవీ ఇదే కావడం విశేషం. మరోవైపు విజయ్‌ తన లేటెస్ట్‌ మూవీ బీస్ట్‌ రిలీజ్‌ కూడా వెయిట్‌ చేస్తున్నాడు. ఈ యాక్షన్‌ డ్రామా మూవీ ట్రైలర్‌ యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం