తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  మంచి తండ్రి కావడానికి రణబీర్ కపూర్ దగ్గర శిక్షణ తీసుకుంటున్న రణ్‌వీర్ సింగ్

మంచి తండ్రి కావడానికి రణబీర్ కపూర్ దగ్గర శిక్షణ తీసుకుంటున్న రణ్‌వీర్ సింగ్

HT Telugu Desk HT Telugu

22 March 2024, 5:41 IST

    • రణవీర్ సింగ్ మంచి భర్తగా మార్కులు కొట్టేశాడు. ఇప్పుడు ఇక అంతే మంచి తండ్రిగా కూడా ఉండాలనుకుంటున్నాడు. రణ్‌వీర్ తన రాబోయే బిడ్డ గురించి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు. 
రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్
రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్

రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్

రణబీర్ కపూర్ తన కుమార్తె రాహాను చాలా ప్రేమిస్తాడు. అభిమానులు దీనిని చాలాసార్లు గుర్తించారు. అతను దాదాపు ప్రతి ఇంటర్వ్యూలో తన కుమార్తె గురించి మాట్లాడుతూ కనిపిస్తాడు. తన గారాలపట్టితో వీలైనంత ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతాడు. రణబీర్ మంచి తండ్రిగా మారడం చూసి ఇప్పుడు రణవీర్ సింగ్ కూడా అతని వద్ద శిక్షణ పొందుతున్నాడు. ఎందుకంటే అతను కూడా త్వరలో ఈ జర్నీని ఎంజాయ్ చేయబోతున్నాడు. రణవీర్ మరియు దీపికా పదుకొనే దంపతులు తాము సెప్టెంబరులో తల్లిదండ్రులం కాబోతున్నామని ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

Flop Movies With super hit songs: పాట హిట్.. బొమ్మ ఫట్.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న ఫ్లాప్ మూవీస్ ఇవే

Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Love Me Trailer: భయపెడుతున్న వైష్ణవి చైతన్య లవ్ మి ట్రైలర్.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

Lampan OTT: బాల్యాన్ని గుర్తుచేసేలా ఉన్న వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.. ఏ ప్లాట్‍ఫామ్‍లో చూడొచ్చంటే..

రణ్‌వీర్‌ని ఆకట్టుకున్న రణ్‌‌బీర్

బాలీవుడ్ లైఫ్ రిపోర్ట్స్ ప్రకారం, తండ్రి కావడానికి ముందు రణవీర్ మంచి తండ్రిగా శిక్షణ తీసుకోవాలనుకుంటున్నాడు. ఇటీవల రణవీర్ అంబానీ కుటుంబ వేడుక సందర్భంగా రణ్‌బీర్‌ను కలిసినప్పుడు తండ్రిగా అతడి ప్రయాణం ఆకట్టుకుంది. వారిద్దరూ ఈ విషయం గురించి మాట్లాడుకున్నారు. ఇద్దరూ పిల్లల గురించే మాట్లాడుకున్నారు. రణబీర్ తన కూతురు రాహాను చూసుకుంటున్న తీరు చూసి రణ్‌వీర్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడట.

సుదీర్ఘ విరామం

బిడ్డ పుట్టాక రణ్‌వీర్ సుదీర్ఘ విరామం తీసుకుంటాడని వార్తలు వచ్చాయి. దీపిక కూడా ఇప్పటికే తన పనులన్నీ పూర్తి చేసిందని సమాచారం. బైజు బావ్రా తర్వాత రణ‌్‌వీర్ సుదీర్ఘ విరామం తీసుకుంటాడు. దీపిక, బిడ్డతో గడపనున్నాడు. విరామం తర్వాత అతను డాన్ 3, శక్తిమాన్ చిత్రాల షూటింగ్‌‌లో పాల్గొంటారు.

దీపిక సినిమాలు ఇవే

దీపిక ఇప్పుడు కల్కి 2898 AD చిత్రంలో కనిపించబోతోంది. ఈ చిత్రంలో దీపికతో పాటు ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్, దీపికల జోడీని పెద్ద తెరపై చూడాలని అభిమానులు ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. కాగా, దీపిక ఇప్పటికే బిగ్‌బితో పికూ సినిమా చేసింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం