తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Pothineni: మళ్లీ సిక్స్ ప్యాక్‌తో రామ్ పోతినేని నయా లుక్.. పూరీ కోసమే అలా.. అక్కడ 'డబుల్ ఇస్మార్ట్' షురూ

Ram Pothineni: మళ్లీ సిక్స్ ప్యాక్‌తో రామ్ పోతినేని నయా లుక్.. పూరీ కోసమే అలా.. అక్కడ 'డబుల్ ఇస్మార్ట్' షురూ

Sanjiv Kumar HT Telugu

02 November 2023, 10:03 IST

  • Ram Pothineni Six Pack Look: ఉస్తాద్ రామ్ పోతినేని మరోసారి సిక్స్ ప్యాక్ లుక్‌లో దర్శనం ఇచ్చాడు. మొన్నటివరకు బోయపాటి శీను స్కంద సినిమా కోసం బరువు పెరిగిన రామ్ పోతినేని ఇప్పుడు పూరీ జగన్నాత్ డబుల్ ఇస్మార్ట్ కోసం సిక్స్ ప్యాక్ పెంచాడు.

డబుల్ ఇస్మార్ట్ కోసం రామ్ పోతినేని సిక్స్ ప్యాక్ లుక్
డబుల్ ఇస్మార్ట్ కోసం రామ్ పోతినేని సిక్స్ ప్యాక్ లుక్

డబుల్ ఇస్మార్ట్ కోసం రామ్ పోతినేని సిక్స్ ప్యాక్ లుక్

హీరో రామ్ పోతినేని మళ్లీ ఉస్తాద్ మోడ్‌లోకి వచ్చాడు. సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్‌ తో చేస్తున్న పాన్ ఇండియా చిత్రం 'డబుల్ ఇస్మార్ట్' షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు మేకర్స్. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది. తన మునుపటి చిత్రం 'స్కంద' కోసం బాగా బరువు పెరిగిన రామ్ పోతినేని.. డబుల్ ఇస్మార్ట్ సినిమా కోసం కొన్ని కిలోల బరువు తగ్గాడు. ఈ సినిమా కోసం రామ్ బాగా కష్టపడి సిక్స్-ప్యాక్ అబ్స్ సాధించాడు.

ట్రెండింగ్ వార్తలు

Pushpa 2 Second Song: పుష్ప 2 రెండో పాటపై అప్‍డేట్ వచ్చేస్తోంది.. మెలోడీకి రెడీ అవండి!

Yakshini OTT: బాహుబలి మేకర్స్ నుంచి యక్షిణి వెబ్ సిరీస్.. వేదిక ఫస్ట్ లుక్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Kalki 2898 AD Event: కల్కి ఈవెంట్‍కు డేట్, టైమ్ ఫిక్స్.. అత్యంత గ్రాండ్‍గా కార్యక్రమం.. ఆ విషయంపై క్లారిటీ వస్తుందా!

Sarkaar 4 OTT: సుధీర్ గేమ్ షోకు వైష్ణవి చైతన్య.. ఎంటర్‌టైనింగ్‍గా ప్రోమో: చూసేయండి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

తాజాగా సోషల్ మీడియాలో రామ్ పోతినేని షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో కండలు తిరిగిన దేహం, సిక్స్ ప్యాక్ ఆబ్స్ తో రామ్ పోతినేని ఫిజిక్ కేక పెట్టించేలా ఉంది. దీంతో రామ్ పోతినేని ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాడు. సినిమాపై అతను చూపించే డెడికేషన్‌కు అంతా ఫిదా అవుతున్నారు. మొన్నటివరకు స్కంద కోసం బాగా ఒళ్లు పెంచిన రామ్ ఇప్పుడు బరువు తగ్గి సిక్స్ ప్యాక్ చేయడం గొప్ప విషయంగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

రామ్ కొత్త పోస్టులో తన ముఖాన్ని దాచుకున్నప్పటికీ, వెస్ట్ లో మాచోగా కనిపిస్తున్నాడు. రామ్‌ని ఈ మేకోవర్ చేసిన క్రెడిట్ పూరి జగన్నాధ్‌కి కూడా దక్కుతుందని అంటున్నారు. కాగా డెడ్లీ కాంబినేషన్‌లో బ్లాక్‌బస్టర్ అయిన 'ఇస్మార్ట్ శంకర్‌'కి సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, సీనియర్ హీరోయిన్ ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. మాస్, యాక్షన్ సినిమాలని ఇష్టపడేవారికి ఈ సినిమా సరికొత్త అనుభూతి ఇవ్వనుందని తెలుస్తోంది.

రామ్ పోతినేని సిక్స్ ప్యాక్ ఆబ్స్ లుక్

సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో డబుల్‌ ఇస్మార్ట్‌ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రాన్ని మార్చి 8, 2024న మహా శివరాత్రి పండుగ కానుకగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు మేకర్స్. ఇందులో రామ్‌కు విలన్‌గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ చేయనున్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం