తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Gopal Varma: పూనమ్ పాండే వ్యవహారంపై స్పందించిన రామ్‍గోపాల్ వర్మ

Ram Gopal Varma: పూనమ్ పాండే వ్యవహారంపై స్పందించిన రామ్‍గోపాల్ వర్మ

03 February 2024, 17:24 IST

    • Ram Gopal Varma on Poonam Pandey Death Stunt: హాట్ నటి పూనమ్ పాండే మృతి అంశం కలకలం రేపింది. అయితే, తాను జీవించే ఉన్నానంటూ నేడు వీడియో పోస్ట్ చేశారు పూనమ్. అయితే, ఈ విషయంపై డైరెక్టర్ రామ్‍గోపాల్ వర్మ స్పందించారు.
Ram Gopal Varma: పూనమ్ పాండే వ్యవహారంపై స్పందించిన రామ్‍గోపాల్ వర్మ
Ram Gopal Varma: పూనమ్ పాండే వ్యవహారంపై స్పందించిన రామ్‍గోపాల్ వర్మ

Ram Gopal Varma: పూనమ్ పాండే వ్యవహారంపై స్పందించిన రామ్‍గోపాల్ వర్మ

RGV on Poonam Pandey death stunt: బాలీవుడ్ నటి, టీవీ స్టార్, మోడల్ పూనమ్ పాండే మృతి చెందారని ఆమె టీమ్ శుక్రవారం ఇన్‍స్టాగ్రామ్‍ ద్వారా వెల్లడించింది. సర్వైకల్ క్యాన్సర్ వల్ల పూనమ్ కన్నుమూశారని తెలిపింది. అయితే, తాను బతికే ఉన్నానంటూ పూనమ్ పాండే నేడు (ఫిబ్రవరి 3) ఓ వీడియో పోస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు. సర్వైకల్ క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన తెచ్చేందుకే తాను ఇలా చేశానని ఆమె చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంపై ప్రముఖ దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ (RGV) తన స్టైల్‍లో స్పందించారు.

ట్రెండింగ్ వార్తలు

India Biggest Overseas Hit: చైనాలో 30 కోట్లకుపైగా టికెట్స్ అమ్ముడుపోయిన ఇండియన్ సినిమా ఇదే.. RRR కాదు!

Single Screen Theatres: సినీ ల‌వ‌ర్స్‌కు షాక్‌ - తెలంగాణ‌లో సింగిల్ స్క్రీన్ థియేట‌ర్లు మూత - కార‌ణం ఇదే

Double Ismart Teaser: బూతులతో డబుల్ ఇస్మార్ట్ టీజర్.. రామ్ పోతినేని-పూరి జగన్నాథ్ మ్యాజిక్ రిపీట్ అవుద్దా?

Rajinikanth: ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌తో భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియ‌న్ మూవీ తీయోచ్చు - ద‌ళ‌ప‌తి విజ‌య్ రికార్డ్ బ్రేక్‌

అందరి దృష్టి ఆకర్షించేందుకు ఎంచుకున్న పద్దతి వల్ల కొన్ని విమర్శలు ఎదురైనా.. పూనమ్ పాండే ఉద్దేశం మాత్రం మంచిదేనని రామ్‍గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్ అంశంపై అంతటా చర్చ జరుగుతోందని ట్వీట్ చేశారు. తనలాగే తన మనసు కూడా అందమైనదంటూ పూనమ్‍ను ఆర్జీవీ పొగిడారు.

“అందరి దృష్టిని తిప్పుకునేందుకు నువ్వు పాటించిన పద్ధతి వల్ల కొంత విమర్శలు రావొచ్చు. కానీ ఈ పుకారు వల్ల నువ్వు సాధించిన దాన్ని.. నీ ఉద్దేశాన్ని ఎవరూ ప్రశ్నించరు. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ పట్ల చర్చ అంతటా ట్రెండింగ్‍లో ఉంది. నీలాగే నీ మనసు కూడా చాలా అందమైనది. నువ్వు చాలా కాలం సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నా” అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

పూనమ్ ఏం చెప్పారంటే..

తాను చనిపోయానంటూ పూనమ్ పాండే కావాలనే టీమ్ ద్వారా పుకార్లను వ్యాప్తి చేశారని ఈ వ్యవహారంలో స్పష్టంగా అర్థమవుతోంది. అయితే, తాను బతికే ఉన్నానని, సర్వైకల్ క్యాన్సర్ గురించి అందరూ చర్చించుకునేందుకే తాను ఇలా చేశాననేలా నేడు ఇన్‍స్టాగ్రామ్‍లో వీడియో పోస్ట్ చేశారు పూనమ్.

నేను జీవించే ఉన్నా. నేను సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోలేదు. దురదృష్టవశాత్తు, సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోయిన వేలాది మంది మహిళల విషయంలో నేను ఇలా చెప్పలేను. దీని గురించి ఎలాంటి అవగాహన లేని కారణంగా.. వారు ఏమీ చేయలేకపోయారు. మిగితా క్యాన్సర్లలాగే.. సర్వైకల్ క్యాన్సర్‌ను కూడా నయం చేసుకోవచ్చని నేను చెప్పాలనుకుంటున్నా. మీరు చేయాల్సిందల్లా టెస్టులు చేయించుకోవాలి. హెచ్‍వీపీ వ్యాక్సిన్ వేయించుకోవాలి” అని పూనమ్ పాండే వీడియోలో చెప్పారు.

నెటిజన్ల రియాక్షన్ ఇదే..

పూనమ్ పాండే చనిపోయారంటూ శుక్రవారం సమాచారం రావడంతో చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే పూనమ్ మృతి చెందడం బాధగా ఉందంటూ పోస్టులు చేశారు. కొందరు బాలీవుడ్ సెలెబ్రెటీలు కూడా పూనమ్ మృతి పట్ల ఆవేదన చెందారు. అయితే, తాను జీవించే ఉన్నానంటూ పూనమ్ పాండే నేడు వీడియో రిలీజ్ చేయటంతో అందరూ అవాక్కయ్యారు. రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఈ విషయాన్ని తాను నమ్మలేకున్నామని, చావుతో ఆటలు ఆడడం ఏంటని కొందరు నెటిజన్లు పూనమ్ పాండేను విమర్శిస్తున్నారు. అయితే, ఆమె జీవించే ఉన్నారన్న విషయం సంతోషం కలిగిస్తోందని మరికొందరు స్పందిస్తున్నారు. సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించాలనుకోవడం మంచి ఆలోచన అని, అయితే ఇలా చేయడం సరికాదని మరికొందరు పోస్టులు చేస్తున్నారు.

పూనమ్ పాండే సినిమాల్లో ఎక్కువగా బోల్డ్ క్యారెక్టర్లు చేశారు. మోడల్ అయిన ఆమె ఎక్కువగా హాట్ డ్రెస్‍ల్లోనే కనిపిస్తుంటారు. లాక్ అప్ టీవీ షోలోనూ పూనమ్ పాల్గొన్నారు. గతంలోనూ కొన్ని టీవీ షోలు చేశారు. ఓ అడల్ట్ యాప్‍ను కూడా పూనమ్ నిర్వహిస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం