తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Gopal Varma |కేసీఆర్ బయోపిక్ కథ రెడీ అంటున్న వర్మ

Ram Gopal Varma |కేసీఆర్ బయోపిక్ కథ రెడీ అంటున్న వర్మ

Nelki Naresh HT Telugu

01 April 2022, 6:31 IST

  • తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీర్ బ‌యోపిక్‌ను తెరకెక్కించబోతున్నట్లు దర్శకుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ ప్ర‌క‌టించాడు. ఈ బ‌యోపిక్ గురించి వ‌ర్మ ఏమ‌న్నారంటే
రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మ (twitter)

రామ్ గోపాల్ వర్మ

గత కొన్నేళ్లుగా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు రామ్ గోపాల్ వర్మ. సినిమాలకంటే  వివాదాస్పద ప్రకటనలు, వ్యాఖ్యలతో ఎక్కువగా మీడియాలో కనిపిస్తున్నాడు. వర్మ నుంచి వచ్చిన సినిమాలతో పోలిస్తే అనౌన్స్ మెంట్స్ ఎక్కువైపోయాయి. వారానికో కొత్త సినిమా అనౌన్స్ చేస్తున్నారు వర్మ.  

ట్రెండింగ్ వార్తలు

OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

Keerthy Suresh Kalki 2898 AD: కల్కి 2898 ఏడీలో కీర్తి సురేష్.. ప్రభాస్‌కు ప్రాణ మిత్రుడిగా మహానటి

తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితం ఆధారంగా ఓ సినిమా చేయబోతున్నట్లు వర్మ ప్రకటించారు. డేంజరస్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రామ్ గోపాల్ వర్మ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ బయోపిక్ గురించి వెల్లడించారు. 2024 ఎన్నిక‌ల కంటే ముందుగానే కేసీఆర్ బ‌యోపిక్‌ను తీసి రిలీజ్ చేస్తాన‌ని వెల్ల‌డించారు. ఈ సినిమాకు ఎలా చేయాలనే విషయంలో తన మనసులో కొన్ని ఆలోచనలు ఉన్నాయని అన్నారు.  అయితే కేసీఆర్ బ‌యోపిక్ ను అనౌన్స్ చేయ‌డం వ‌ర్మ‌కు ఇది కొత్తేమీ కాదు. 2019లోనే టైగ‌ర్ కేసీఆర్ పేరుతో వ‌ర్మ సినిమాను ప్ర‌క‌టించారు. అనౌన్స్ మెంట్ చేసిన తర్వాత సినిమాను పక్కనపెట్టారు. దాదాపు మూడేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ కేసీఆర్ బ‌యోపిక్‌ను మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు వర్మ ప్ర‌క‌టించ‌డం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సారైనా వ‌ర్మ మాట మీద నిల‌బ‌డ‌తాడో లేదో చూడాల‌ని అభిమానులు అంటున్నారు. 

కాగా ఇద్ద‌రు అమ్మాయిల మ‌ధ్య స్నేహం ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీసింద‌నే క‌థాంశంతో రామ్‌గోపాల్ వ‌ర్మ ‘డేంజ‌ర‌స్’ సినిమాను తెర‌కెక్కించారు. ఇందులో అప్ప‌రారాణి, నైనా గంగూలీ లెస్బియ‌న్స్ పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. సెక్ష‌న్ 377ను సుప్రీంకోర్టు ర‌ద్దు చేసిన సంఘ‌ట‌న నుంచి స్ఫూర్తి పొందుతూ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్లుగా వ‌ర్మ చెప్పారు. ఏప్రిల్ 8న ఈ సినిమా విడుద‌ల‌కానుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం