తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ramcharan | రామ్‌చరణ్‌ భార్యకు భయపడతాడా? తండ్రికా?.. అతని సమాధానం ఇదీ!

Ramcharan | రామ్‌చరణ్‌ భార్యకు భయపడతాడా? తండ్రికా?.. అతని సమాధానం ఇదీ!

HT Telugu Desk HT Telugu

24 April 2022, 17:39 IST

    • ఆచార్య మూవీ రిలీజ్‌కు టైమ్‌ దగ్గర పడుతోంది. మెగాస్టార్‌, మెగా పవర్‌ స్టార్‌ కలిసి నటించనుండటమే ఈ మూవీకి అసలు సిసలు హైలైట్‌.
ఆచార్య ప్రీరిలీజ్ వేడుకలో చిరంజీవి, రామ్ చరణ్
ఆచార్య ప్రీరిలీజ్ వేడుకలో చిరంజీవి, రామ్ చరణ్ (Twitter)

ఆచార్య ప్రీరిలీజ్ వేడుకలో చిరంజీవి, రామ్ చరణ్

మెగా ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఆచార్య. ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ మూవీ మొత్తానికి ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కాబోతోంది. సైరా తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా అనే కాదు.. ఇందులో అతని తనయుడు రామ్‌చరణ్‌ కూడా నటించనుండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం చిరంజీవి, రామ్‌చరణ్‌తోపాటు సినిమా యూనిట్‌ ప్రమోషన్లలో బిజీగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Srikanth on Rave Party: మొన్న నా భార్యతో విడాకులు ఇప్పించేశారు.. ఇప్పుడిలా.. వాడెవడో నాలాగే ఉన్నాడు కానీ..: శ్రీకాంత్

Deepika Padukone Baby Bump: దీపికా బేబీ బంప్.. భర్తతో కలిసి ఓటేయడానికి వస్తూ చూపించిన బ్యూటీ

Laapataa Ladies: అందరినీ ఆలోచింపజేసేలా మంజూ మాయ్ చెప్పిన పవర్‌ఫుల్ హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ ఇవి.. మిస్ అవకండి

Devara Fear Song Lyrics: దేవర మూవీ ఫియర్ సాంగ్ లిరిక్స్ ఇవే.. అదరగొడుతున్న అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్

శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కూడా జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి హాజరయ్యాడు. ఈ ఈవెంట్‌తోపాటు చిరంజీవి, రామ్‌చరణ్‌ ఇతర ఇంటర్వ్యూల్లోనూ సినిమాను ప్రమోట్‌ చేస్తున్నారు. మీడియాతోనూ మాట్లాడుతూనే ఉన్నారు. ఈ సందర్భంగా ఓ ఈవెంట్‌లో.. మీరు ఎక్కువగా ఎవరికి భయపడతారు.. మీ భార్యకా లేక మీ తండ్రి చిరంజీవికా అని అడిగితే.. చెర్రీ కూడా చాలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు.

"మా డాడీ కూడా మా అమ్మ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాడు. అందుకే నేను కూడా అతన్నే ఫాలో అవుతూ.. నా భార్య ఉపాసన దగ్గర జాగ్రత్తగా ఉంటాను. అయినా మా ఇంట్లో నాకు, మా డాడీకి, పవన్‌ కల్యాణ్‌కు కూడా మా అమ్మే బాస్‌" అని రామ్‌చరణ్‌ చెప్పడం విశేషం. ఇంతకుముందు కూడా ఓ ఇంటర్వ్యూలో చరణ్‌ మాట్లాడుతూ.. తాను, చిరంజీవి కలిసి నటించడం అనేది తన తల్లి కోరిక అని చెప్పిన విషయం తెలిసిందే.

కొరటాల శివ డైరెక్షన్‌లో ఆచార్య మూవీ వస్తోంది. ఇందులో కాజల్‌, పూజా హెగ్డే నటిస్తున్నారు. మరోవైపు ట్రిపుల్‌ ఆర్‌ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న చెర్రీ.. ఇప్పుడు ఆచార్య రిలీజ్‌ కోసం ఎదురుచూస్తుండగా.. తన తర్వాతి మూవీని గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌తో చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ కోసమే ఈ మధ్య అతడు పంజాబ్‌ కూడా వెళ్లాడు. ఈ సినిమాలో చెర్రీ డ్యుయల్‌ రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం