తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Muthu Re Release: రజనీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీ ముత్తు రీ రిలీజ్.. ఎప్పుడంటే?

Muthu Re Release: రజనీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీ ముత్తు రీ రిలీజ్.. ఎప్పుడంటే?

Sanjiv Kumar HT Telugu

19 November 2023, 7:23 IST

  • Rajinikanth Muthu Movie Re Release: సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ముత్తు ఒకటి. 1995 సంవత్సరంలో వచ్చిన ముత్తు సినిమాను రి రిలీజ్ చేస్తున్నారు. దీంతో తలైవా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. విడుదల తేది కోసం ఎదురుచూస్తున్నారు.

రజనీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీ ముత్తు రీ రిలీజ్.. ఎప్పుడంటే?
రజనీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీ ముత్తు రీ రిలీజ్.. ఎప్పుడంటే?

రజనీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీ ముత్తు రీ రిలీజ్.. ఎప్పుడంటే?

Muthu Re Release With 4K Version: ఇప్పుడంతా 4కె రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుంది. అప్పట్లో ప్రేక్షకాధరణ పొందిన సినిమాలను హీరోల పుట్టిన రోజులకు, సినిమా యానివర్సరీలకు అభిమానులు రీ రిలీజ్ చేస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ముత్తు సినిమాను మళ్లీ విడుదల చేస్తున్నారు ఆయన అభిమానులు.

ట్రెండింగ్ వార్తలు

Kalki 2898 AD Bujji: ‘బుజ్జీ’ కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన కల్కి 2898 ఏడీ టీమ్.. ఎప్పుడు.. ఎక్కడ అంటే!

OTT: ఓటీటీలో అదరగొడుతున్న అభినవ్ గోమఠం కామెడీ డ్రామా సినిమా.. మరో మైల్‍స్టోన్ దాటేసింది

Brahmamudi: డబ్బు కోసమే మాయా బిడ్డ డ్రామా.. కావ్యకు రాజ్ వార్నింగ్.. భయపడిపోయిన శైలేంద్ర.. కొత్తగా మీరా అబార్షన్ డ్రామా

OTT Movies To Watch: ఓటీటీలో ఈ వారం ఈ 4 మిస్ అవ్వొద్దు.. దేని దానికే డిఫరెంట్.. ఇక్కడ చూసేయండి మరి!

డిసెంబర్ 12 న రజనీకాంత్ పుట్టిన రోజును పురస్కరించుకొని ముత్తు చిత్రాన్ని డిసెంబర్ 2న గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటక నాలుగు ప్రాంతాల్లోని వేలాది థియేటర్లలో బ్రహ్మాండంగా ముత్తు సినిమా విడుదలకు సిద్ధం అయింది. ఇదిలా ఉంటే తమిళ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ కెరియర్‌లో సూపర్ హిట్ చిత్రాలలో ముత్తు మొదటి వరుసలో ఉంటుంది.

ప్రముఖ తమిళ డైరెక్టర్ కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో 1995 సంవత్సరంలో విడుదలైన ముత్తు సినిమాలో రజనీకాంత్ సరసన మీనా హీరోయిన్‌గా నటించింది. ఎ. ఆర్. రెహమాన్ సంగీత సారథ్యంలో అద్భుతమైన పాటలు నేటికి శ్రోతలను, తలైవా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అక్టోబరు 23, 1995 న విడుదలైన ముత్తు చిత్రం ఆనాడు సూపర్ హిట్ చిత్రంగా నిలవడమే కాకుండా బాక్స్ ఆఫీస్‌ను కలెక్షన్లతో షేక్ చేసింది.

తమిళనాడులోని అనేక థియేటర్లలో 175 రోజులు ఆడి అందరిని ఆశ్చర్యంలో ముచ్చెత్తింది ముత్తు మూవీ. మన దగ్గర సంచలనం సృష్టించిన ముత్తు 1998లో జపనీస్ భాషలో విడుదలై సంచలన విజయం అందుకోవడమే కాకుండా దాదాపు 400 మిలియన్ యాన్లను రాబట్టింది. దాంతో రజనీకాంత్ జపాన్‌లో కూడా వీరాభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఈ చిత్రం డిసెంబర్ 2 న రీ రిలీజ్ అవుతుండంతో ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం