తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Viral: పంత్ సెంచరీ తర్వాత ద్రవిడ్ రియాక్షన్ చూశారా.. వీడియో వైరల్

Viral: పంత్ సెంచరీ తర్వాత ద్రవిడ్ రియాక్షన్ చూశారా.. వీడియో వైరల్

02 July 2022, 16:07 IST

    • ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో పంత్ సెంచరీ తర్వాత రాహుల్ ద్రవిడ్ రియాక్షన్ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ద్రవిడ్ రియాక్షన్ కు ఫిదా అవుతున్నారు. ఈ మ్యాచ్‌లో తొలి రోజు ముగిసే సమయానికి భారత్ 7 వికెట్ల నష్టానికి 338 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది.
రిషభ్ పంత్-రాహుల్ ద్రవిడ్
రిషభ్ పంత్-రాహుల్ ద్రవిడ్ (Twitter)

రిషభ్ పంత్-రాహుల్ ద్రవిడ్

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత బ్యాటర్ రిషభ్ పంత్ శతకంతో అదరగొట్టిన విషయం తెలిసిందే. టాపార్డర్ బ్యాటర్లంతా విఫలమైన వేళ.. పంత్ తన అద్భుత ప్రదర్శనతో ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. టీ20 తరహా ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో తొలి రోజే టీమిండియా 7 వికెట్ల నష్టానికి 338 పరుగులతో ఆట కొనసాగిస్తోంది. తాజాగా ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రిషభ్ పంత్ సెంచరీ సాధించిన తర్వాత టీమిండియా కోచ్ ద్రవిడ్ రియాక్షన్ వైరల్‌గా మారింది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఎప్పుడూ కామ్, కూల్‌గా ఉండే ద్రవిడ్.. పంత్ సెంచరీ తర్వాత ఆయన స్పందించిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. డ్రెస్సింగ్ రూంలో కూర్చున్న ఆయన ఒక్కసారిగా కూర్చిలో నుంచి లేచి పంత్‌ను అభినందిస్తూ అరవడం మొదలుపెట్టాడు. రెండు చేతులతో గట్టిగా చప్పట్లు కొడుతూ సంబురాలు చేసుకోవడం ప్రారంభించాడు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు.

సాధారణంగా కంపోజ్‌గా ఉండే ద్రవిడ్ ఈ విధంగా సంబరాలు చేసుకోవడం చూస్తుంటే ఆనందంగా ఉందని ఓ వ్యక్టి టీట్ చేస్తే.. రిషభ్ పంత్ ఆడిన గొప్ప ఇన్నింగ్స్‌కు ద్రవిడ్ అభినందనలు ఇవే అంటూ మరోకరు స్పందించారు. పంత్ సెంచరీ తర్వాత ద్రవిడ్ రియాక్షన్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ ఇంకోకరు పోస్ట్ పెట్టారు.

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా ముందుకెళ్తోంది. ఆరంభంలో వెంట వెంటనే వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను.. రిషభ్ పంత్(146 )అదిరిపోయే ఆటతీరుతో ఆదుకున్నాడు. అద్భుతమైన సెంచరీతో కదం తొక్కి భారత అభిమానుల్లో ఆశలు చిగురించారు. పంత్‌కు తోడు జడేజా(68) అబ్బుర పరిచే ప్రదర్శనతో అర్ధ శతకంతో నిలకడగా రాణిస్తున్నాడు. తొలి రోజు ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేశాడు.

టాపిక్

తదుపరి వ్యాసం