తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rage Of Bholaa Song: 'మెగామాస్ మావోడే': భోళా శంకర్ నుంచి స్పెషల్ ర్యాప్ సాంగ్ వచ్చేసింది.. ఫుల్ జోష్‍తో..

Rage of Bholaa song: 'మెగామాస్ మావోడే': భోళా శంకర్ నుంచి స్పెషల్ ర్యాప్ సాంగ్ వచ్చేసింది.. ఫుల్ జోష్‍తో..

05 August 2023, 16:08 IST

    • Rage of Bholaa song: భోళా శంకర్ సినిమా నుంచి ‘రేజ్ ఆఫ్ భోళా’ అనే సాంగ్ వచ్చింది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ ఈ పాటను లాంచ్ చేశారు.
భోళా శంకర్ నుంచి స్పెషల్ సాంగ్ వచ్చేసింది
భోళా శంకర్ నుంచి స్పెషల్ సాంగ్ వచ్చేసింది

భోళా శంకర్ నుంచి స్పెషల్ సాంగ్ వచ్చేసింది

Rage of Bholaa song: మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా మరో ఆరు రోజుల్లో (ఆగస్టు 11న) థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ యూనిట్ ప్రమోషన్లను వేగంగా చేస్తోంది. ఇప్పటికే ట్రైలర్‌ను విడుదల చేసింది. దీనికి సూపర్ రెస్పాన్స్ రావటంతో ఫుల్ జోష్‍లో ఉంది. భోళా శంకర్ మూవీ డైరెక్టర్ మెహర్ రమేశ్ సహా నటీనటులు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్లలో వేగం పెంచారు. ఈ తరుణంలో భోళా శంకర్ సినిమా నుంచి ‘రేజ్ ఆఫ్ భోళా’ అనే ప్రత్యేకమైన ర్యాప్ పాటను చిత్ర యూనిట్ నేడు విడుదల చేసింది. అకాడమీ అవార్డ్ విన్నర్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ ఈ సాంగ్‍ను లాంచ్ చేశారు. సాంగ్ ఎలా ఉందంటే..

ట్రెండింగ్ వార్తలు

OTT: ఓటీటీలో అదరగొడుతున్న అభినవ్ గోమఠం కామెడీ డ్రామా సినిమా.. మరో మైల్‍స్టోన్ దాటేసింది

Brahmamudi: డబ్బు కోసమే మాయా బిడ్డ డ్రామా.. కావ్యకు రాజ్ వార్నింగ్.. భయపడిపోయిన శైలేంద్ర.. కొత్తగా మీరా అబార్షన్ డ్రామా

OTT Movies To Watch: ఓటీటీలో ఈ వారం ఈ 4 మిస్ అవ్వొద్దు.. దేని దానికే డిఫరెంట్.. ఇక్కడ చూసేయండి మరి!

Silk Saree Movie: సీరియల్ నటుడు హీరోగా మూవీ.. సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరీగా సిల్క్ శారీ

భోళా శంకర్ మూవీ నుంచి వచ్చిన ఈ ‘రేజ్ ఆఫ్ భోళా’ స్పెషల్ ర్యాప్‍ సాంగ్‍గా ఉంది. మహతీ స్వరసాగర్ మ్యూజిక్ అందించాడు. నవాబ్ గ్యాంగ్ ర్యాపర్స్ అసుర, ఫిరోజ్ ఇజ్రాయెల్ పాడారు. దర్శకుడు మెహర్ రమేశ్, ఫిరోజ్ ఇజ్రాయెల్ లిరిక్స్ రాశారు. “ఒకటి, రెండు, మూడు.. వచ్చాడు అన్న చూడు.. స్టేటంత వెతికి చూడు.. ఎదురొచ్చేవాడు లేడు” అంటూ ఈ రేజ్ ఆఫ్ భోళా ర్యాప్ సాంగ్ మొదలైంది. ఈ పాటలోని చిరంజీవి విజువల్స్‌లో అదిరిపోయాయి. ‘మెగామాస్ మావోడే’ అంటూ ఫుల్ జోష్‍తో సాంగ్ ఉంది. అయితే, ఈ పాట మూవీలో ఉంటుందా.. లేకపోతే బ్యాక్‍గ్రౌండ్‍లో వస్తుందా అనేది చూడాలి.

భోళా శంకర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు (ఆగస్టు 6) సాయంత్రం 7 గంటల నుంచి జరగనుంది. హైదరాబాద్‍లోని శిల్పకళావేదికలో ఈ ఈవెంట్ ఉండనుంది. ఆగస్టు 11వ తేదీన ఈ చిత్రం విడుదల కానుండగా.. ఇప్పటికే కొన్ని చోట్ల ఆన్‍లైన్‍లో టికెట్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా టికెట్ రేట్లను పెంచలేదు నిర్మాతలు. స్టాండర్డ్ రేట్లే ఉండనున్నాయని తెలుస్తోంది.

భోళా శంకర్ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా భాటియా హీరోయిన్‍గా చేసింది. ఈ చిత్రంలో తని ఫుల్ లెన్త్ రోల్ అని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది. మూవీ ప్రమోషన్లలోనూ పాల్గొంటోంది. స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలి పాత్ర చేసింది. సుశాంత్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్.. భోళా శంకర్ చిత్రాన్ని నిర్మించింది. 

 

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం