తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar Live Updates: ప్ర‌భాస్ హోమ్ టౌన్‌లో స‌లార్ రికార్డ్ - అన్ని షోస్ ఫుల్‌
ప్రభాస్ సలార్
ప్రభాస్ సలార్

Salaar Live Updates: ప్ర‌భాస్ హోమ్ టౌన్‌లో స‌లార్ రికార్డ్ - అన్ని షోస్ ఫుల్‌

22 December 2023, 13:24 IST

Salaar Live Updates: స‌లార్ మేనియాతో థియేట‌ర్లు మొత్తం ఉగిపోతున్నాయి. ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

22 December 2023, 13:24 IST

ప్ర‌భాస్ హోమ్ టౌన్‌లో స‌లార్ ఒక్క రోజే 66 షోస్‌ ఫుల్‌

స‌లార్ మూవీ ప్ర‌భాస్ హౌమ్ టౌన్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. శుక్ర‌వారం రోజు భీమ‌వ‌రంలో 66 షోల‌కు స్క్రీనింగ్ అవుతోండ‌గా అన్ని హౌజ్‌ఫుల్ కావ‌డం గ‌మ‌నార్హం.

22 December 2023, 12:03 IST

మ‌హేష్ బాబు రికార్డు బ్రేక్ చేయ‌లేక‌పోయిన స‌లార్‌

హైద‌రాబాద్ ఐమాక్స్ థియేట‌ర్‌లో ఒకేరోజు అత్య‌ధిక షోలు స్క్రీనింగ్ అయిన సినిమాల్లో మ‌హేష్‌బాబు బిజినెస్‌మెన్ టాప్ ప్లేస్‌లో ఉంది. బిజినెస్‌మెన్ మూవీ రిలీజ్ రోజు 32 షోలు స్క్రీనింగ్ అయ్యాయి. శుక్ర‌వారం రోజు ఐమాక్స్‌లో స‌లార్ 29 షోలు స్క్రీనింగ్ కానున్నాయి.

22 December 2023, 11:42 IST

స‌లార్ శాటిలైట్ రైట్స్

ప్ర‌భాస్ స‌లార్ మూవీ శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా ఛానెల్ సొంతం చేసుకున్న‌ది. భారీ ధ‌ర‌కు స‌లార్ శాటిలైట్ హ‌క్కుల‌ను స్టార్ మా ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం.

22 December 2023, 11:22 IST

స‌లార్ చూసిన సుజీత్‌

స‌లార్ సినిమాను సాహో డైరెక్ట‌ర్ సుజీత్ ఫ్యాన్స్‌తో క‌లిసి హైద‌రాబాద్ కూక‌ట్‌ప‌ల్లిలోని విశ్వ‌నాథ్ థియేట‌ర్‌లో వీక్షించాడు.

22 December 2023, 11:06 IST

స‌లార్ బ‌డ్జెట్ ఎంతంటే?

స‌లార్ క‌న్న‌డ మూవీ ఉగ్ర‌మ్ ఆధారంగా తెర‌కెక్కింది. 2014లో ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఉగ్ర‌మ్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఉగ్ర‌మ్ సినిమాలో శ్రీముర‌ళి హీరోగా న‌టించాడు. ఉగ్ర‌మ్ బ‌డ్జెట్ నాలుగు కోట్లు కాగా స‌లార్ బ‌డ్జెట్ 270 కోట్లు కావ‌డం గ‌మ‌నార్హం.

22 December 2023, 10:53 IST

షారుఖ్‌పై ప్ర‌భాస్‌దే పై చేయి

ఈ వారం బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌భాస్ స‌లార్‌తో షారుఖ్ ఖాన్ డంకీ పోటీప‌డింది. రాజ్‌కుమార్ హిరాణీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన డంకీ సినిమా మిక్స్‌డ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్న‌ది. తొలిరోజు ఈ సినిమాకు 30 కోట్ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే వ‌చ్చాయి. స‌లార్ సినిమా వంద కోట్ల క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

22 December 2023, 10:34 IST

స‌లార్ షో క్యాన్సిల్‌

స‌లార్ సినిమా పెయిడ్ ప్రీమియ‌ర్స్‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. అర్ధ‌రాత్రి ఒంటిగంట నుంచే హైద‌రాబాద్‌లో స‌లార్ ప్రీమియ‌ర్స్ ప్రారంభ‌మ‌య్యాయి. హైద‌రాబాద్‌లోని మ‌ల్లిఖార్జున థియేట‌ర్‌లో థియేట‌ర్‌లో ఉన్న సీట్ల‌కు మించి అభిమానులు రావ‌డంతో గొంద‌ర‌గోళం నెల‌కొని స‌లార్ షోను కొద్ది సేపు నిలిపివేశారు. టికెట్స్ లేకుండా వ‌చ్చిన అభిమానుల‌ను పోలీసులు బ‌య‌ట‌కు పంపించిన త‌ర్వాతే షో మొద‌లైన‌ట్లు స‌మాచారం.

22 December 2023, 10:25 IST

గంట‌లో 44 వేల టికెట్లు

స‌లార్ టికెట్స్‌కు శుక్ర‌వారం రోజు భారీగా క్రేజ్ నెల‌కొంది. గంట వ్య‌వ‌ధిలోనే 44 వేల టికెట్స్ అమ్ముడుపోయిన‌ట్లు బుక్ బై షో చూపిస్తోంది.

22 December 2023, 9:57 IST

సలార్ రివ్యూ

స‌లార్ పూర్తి రివ్యూ కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

https://telugu.hindustantimes.com/entertainment/salaar-movie-review-prabhas-prashanth-neel-gangster-action-entertainer-movie-review-prithviraj-sukumaran-shruti-haasan-121703210762124.html

22 December 2023, 9:56 IST

తొలిరోజు స‌లార్ క‌లెక్ష‌న్స్ - రికార్డులు బ్రేక్‌

స‌లార్ తొలిరోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా 170 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 70 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకోనున్న‌ట్లు చెబుతోన్నారు.

22 December 2023, 9:36 IST

స‌లార్ అడ్వాన్స్ బుకింగ్స్ 49 కోట్లు

స‌లార్ అడ్వాన్స్ బుకింగ్స్ తెలుగు, హిందీతో పాటు మిగిలిన భాష‌ల్లో క‌లిపి 48.50 కోట్లు అయ్యాయి. అత్య‌ధిక అడ్వాన్స్ బుకింగ్స్ జ‌రిగిన మూవీగా ప్ర‌భాస్ స‌లార్ రికార్డ్ క్రియేట్ చేసింది. షారుఖ్ ఖాన్ డంకీ అడ్వాన్స్ బుకింగ్స్ 30 కోట్లు జ‌రిగాయి.

22 December 2023, 9:27 IST

తొలి రోజు బాలీవుడ్‌లో స‌లార్ రికార్డ్ క‌లెక్ష‌న్స్‌

తొలిరోజు బాలీవుడ్‌లో స‌లార్ మూవీ 48 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. కేజీఎఫ్ రికార్డును స‌లార్ బ్రేక్ చేస్తుంద‌ని అంటున్నారు.

22 December 2023, 8:04 IST

బాక్సాఫీస్ బ‌ద్ద‌లైపోద్ది - న‌వీన్ పొలిశెట్టి

చాలా రోజుల నుంచి అంద‌రూ ప్ర‌భాస్‌ను ఇలా చూడాల‌ని వెయిటింగ్‌. చెప్పాను క‌దా బాక్సాఫీస్ బ‌ద్ద‌లైపోతుంది అని. అంటూ హీరో న‌వీన్ పొలిశెట్టి ట్వీట్ చేశాడు. ప్ర‌భాస్‌తో పాటు చిత్ర యూనిట్‌కు కంగ్రాట్స్ చెప్పాడు.

22 December 2023, 7:42 IST

స‌లార్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌

స‌లార్ ఓటీటీ హ‌క్కుల‌ను నెట‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ది. తెలుగు, హిందీతో పాటు మిగిలిన ద‌క్షిణాది భాష‌ల స్ట్రీమింగ్ రైట్స్‌ను రికార్డు ధ‌ర‌కు నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం

22 December 2023, 7:35 IST

ఖ‌న్సార్ సిటీ

స‌లార్ సినిమా కోసం డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ఖ‌న్సార్ అనే ఫిక్ష‌న‌ల్ సిటీని క్రియేట్ చేశాడు. గ్రేమ్ ఆఫ్ థ్రోన్స్ స్ఫూర్తితోనే ఖ‌న్సార్ సిటీని డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ డిజైన్ చేశాడంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

22 December 2023, 7:08 IST

పూనకాలు లోడింగ్

ప్ర‌భాస్ అభిమానుల సంద‌డితో స‌లార్ థియేట‌ర్లు మోత‌మోగిపోతున్నాయి. ప్ర‌తి థియేట‌ర్ వ‌ద్ద సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి. ప్ర‌భాస్ క‌టౌట్స్‌, క్రాక‌ర్స్‌తో ద‌ద్ద‌రిల్లిపోతున్నాయి.

22 December 2023, 6:56 IST

ఉగ్రం రీమేక్‌

స‌లార్ ఉగ్ర‌మ్ సినిమా రీమేక్ అని నెటిజ‌న్లు ట్వీట్స్ చేస్తున్నారు. ఉగ్ర‌మ్ క‌థ‌లో చాలా మార్పులు చేస్తూ లార్జ్ స్కేల్‌లో ప్ర‌శాంత్ నీల్ స‌లార్ సినిమాను తెర‌కెక్కించాడ‌ని అంటున్నారు.

22 December 2023, 6:47 IST

స‌లార్...ప‌క్కా బ్లాక్‌బ‌స్ట‌ర్‌

ప్ర‌భాస్ హీరోయిజం...ప్ర‌శాంత్ నీల్ టేకింగ్ ఎలివేష‌న్స్‌, గూస్ బంప్స్ యాక్ష‌న్ సీక్వెన్స్‌...టెరిఫిక్ బీజీఎమ్‌తో స‌లార్ ఆక‌ట్టుకుంటుంద‌ని నెటిజ‌న్లు చెబుతోన్నారు. ప‌క్కా బ్లాక్‌బ‌స్ట‌ర్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

22 December 2023, 6:38 IST

కేజీఎఫ్‌తో పోలిక‌

స‌లార్ సినిమాను కేజీఎఫ్‌, కేజీఎఫ్ 2ల‌తో కొంద‌రు కంపేర్స్ చేస్తున్నారు. యాక్ష‌న్ ఎపిసోడ్స్‌తో పాటు ప్ర‌శాంత్ నీల్ టేకింగ్ కూడా చాలా చోట్ల కేజీఎఫ్ సినిమాల‌ను స‌లార్ గుర్తుచేస్తుంద‌ని అంటున్నారు.

22 December 2023, 6:29 IST

స‌లార్ సెకండ్ పార్ట్ టైటిల్ ఇదే

స‌లార్ రెండు భాగాలుగా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. సెకండ్ పార్ట్ టైటిల్‌ను స‌లార్ పార్ట్ 1లో ప్ర‌శాంత్ నీల్ రివీల్ చేశాడు. ఈ సినిమాకు స‌లార్ 2 శౌర్యంగ‌ప‌ర్వం అనే పేరును క‌న్ఫామ్ చేశాడు ప్ర‌శాంత్ నీల్‌.

22 December 2023, 6:22 IST

స‌లార్ మ‌స్ట్ వాచ్ మూవీ - హీరో నిఖిల్‌

స‌లార్ మిడ్‌నైట్ ప్రీమియ‌ర్‌ను అభిమానుల‌తో క‌లిసి వీక్షించాడు టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్‌. ప్ర‌భాస్ స్క్రీన్‌పై క‌నిపించిన ప్ర‌తిసారి గూస్‌బంప్స్ అని నిఖిల్ ట్వీట్ చేశాడు. మ‌స్ట్ వాచ్ మూవీ ఇద‌ని చెప్పాడు.

22 December 2023, 6:15 IST

యాక్ష‌న్ మైండ్ బ్లోయింగ్‌

స‌లార్ ఓవ‌ర్ సీస్ ప్రీమియ‌ర్స్ బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్ వ‌చ్చేసింది. ప్ర‌భాస్‌పై వ‌చ్చే యాక్ష‌న్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్‌గా ఉంటాయ‌ని అంటున్నారు. ఫ‌స్ట్ హాఫ్‌లో ఇంట‌ర్వెల్‌కు ముందు వ‌చ్చే యాక్ష‌న్ సీక్వెన్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అని ట్వీట్స్ చేస్తున్నారు.

22 December 2023, 6:10 IST

రికార్డులు బ్రేక్‌

స‌లార్ మూవీ తొలిరోజు బాక్సాఫీస్ వ‌ద్ద చ‌రిత్ర‌ను సృష్టించ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. స‌లార్ దెబ్బ‌కు గ‌త బాక్సాఫీస్ రికార్డుల‌న్నీ నేల‌మ‌ట్టం అవుతాయ‌ని అంటున్నారు.

    ఆర్టికల్ షేర్ చేయండి