తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pooja Hegde: బోల్డ్ మూవీతో సౌత్‌లోకి పూజా హెగ్డే రీఎంట్రీ - డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్‌

Pooja Hegde: బోల్డ్ మూవీతో సౌత్‌లోకి పూజా హెగ్డే రీఎంట్రీ - డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్‌

25 December 2023, 9:33 IST

  • Pooja Hegde: బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. విక్ర‌మ్ కోబ్రా డైరెక్ట‌ర్ అజ‌య్ జ్ఞాన‌ముత్తుతో ఓ బోల్డ్ మూవీని పూజాహెగ్డే చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. ఈ సినిమా థియేట‌ర్ల‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం.

పూజాహెగ్డే
పూజాహెగ్డే

పూజాహెగ్డే

Pooja Hegde: గ‌త ఏడాది బ్యాక్ టూ బ్యాక్ డిజాస్ట‌ర్స్ ఎఫెక్ట్ కార‌ణంగా 2023లో పూజాహెగ్డే కెరీర్‌కు బ్రేక్ వ‌చ్చింది. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో ఈ ఏడాది ఒక్క సినిమా చేయ‌లేదు పూజాహెగ్డే. సౌత్‌లో రీఎంట్రీ కోసం ఎదురుచూస్తోన్న పూజాహెగ్డే తాజాగా ఓ బోల్డ్ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.లేడీ ఓరియెంటెడ్ జాన‌ర్‌లో తెర‌కెక్క‌నున్న

ట్రెండింగ్ వార్తలు

Guppedantha Manasu Serial: శైలేంద్ర‌కు దిమ్మ‌తిరిగే షాకిచ్చిన మ‌ను - బిల్డ‌ప్‌లు తుస్ - ఎండీ సీట్‌ను కాపాడుకున్న వ‌సు

Jr NTR Hrithik Roshan: బాలీవుడ్ స్టార్ హీరోకి జూనియర్ ఎన్టీఆర్ వంట నేర్పిస్తున్నాడా.. తారక్‌కు బర్త్ డే విషెస్ వైరల్

Krishna mukunda murari serial: ఊహించని మలుపు, బ్లాక్ మెయిల్ కి దిగిన ముకుంద.. గుట్టు రట్టు చేయబోతున్న కృష్ణ

Brahmamudi May 21st Episode: ప్లేట్ ఫిరాయించిన మాయ - క‌ష్టాల్లో కావ్య కాపురం - రాజ్‌పై నింద‌లు నిజ‌మ‌య్యాయి!

ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్ట‌ర్‌, కోబ్రా, డిమాంటే కాల‌నీ ఫేమ్ అజ‌య్ జ్ఞాన‌ముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో పూజాహెగ్డే క్యారెక్ట‌రైజేష‌న్‌, లుక్ బోల్డ్‌, ర‌స్టిక్‌గా ఉంటాయ‌ని స‌మాచారం. కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌న‌టువంటి డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో పూజాహెగ్డే క‌నిపించ‌నున్న‌ట్లు చెబుతోన్నారు. పూజాహెగ్డే, అజ‌య్ జ్ఞాన‌ముత్తు కాంబినేష‌న్‌లో రాబోతోన్న ఈ మూవీ థియేట‌ర్ల‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు తెలిసింది.

నెట్‌ఫ్లిక్స్ కోస‌మే వీరిద్ద‌రు ఈ సినిమా చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. త‌మిళంతో పాటు తెలుగు, హిందీ భాష‌ల్లో పూజాహెగ్డే, అజ‌య్ జ్ఞాన‌ముత్తు రిలీజ్ కానున్న‌ట్లు చెబుతున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు తెలిసింది. టాలీవుడ్‌కు దూర‌మైన పూజాహెగ్డే ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో షాహిద్‌క‌పూర్‌తో దేవా సినిమా చేస్తోంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ 2024 అక్టోబ‌ర్‌లో రిలీజ్ కానుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం