తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pirates Of The Caribbean Ott: తెలుగులో పైరెట్స్ ఆఫ్ ది కరీబియన్ చిత్రాలను చూడాలని అనుకుంటున్నారా? ఏ ఓటీటీలో ఉన్నాయంటే..

Pirates of The Caribbean OTT: తెలుగులో పైరెట్స్ ఆఫ్ ది కరీబియన్ చిత్రాలను చూడాలని అనుకుంటున్నారా? ఏ ఓటీటీలో ఉన్నాయంటే..

25 April 2024, 20:28 IST

    • Pirates of The Caribbean Movies Telugu OTT: పైరెట్స్ ఆఫ్ ది కరీబియన్ సినిమాలు ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులో ఉన్నాయి. ఈ మూవీ సిరీస్‍లో ఐదు చిత్రాలు ఒకే ఓటీటీలో చూడొచ్చు. ఆ వివరాలివే..
Pirates of The Caribbean Telugu OTT: పైరెట్స్ ఆఫ్ ది కరీబియన్ చిత్రాలన తెలుగులో చూడాలనుకుంటున్నారా? ఏ ఓటీటీలో ఉన్నాయంటే
Pirates of The Caribbean Telugu OTT: పైరెట్స్ ఆఫ్ ది కరీబియన్ చిత్రాలన తెలుగులో చూడాలనుకుంటున్నారా? ఏ ఓటీటీలో ఉన్నాయంటే

Pirates of The Caribbean Telugu OTT: పైరెట్స్ ఆఫ్ ది కరీబియన్ చిత్రాలన తెలుగులో చూడాలనుకుంటున్నారా? ఏ ఓటీటీలో ఉన్నాయంటే

Pirates of The Caribbean Telugu OTT: హాలీవుడ్‍లో ‘పైరెట్స్ ఆఫ్ ది కరీబియన్’ సినిమాలు బ్లాక్‍బస్టర్ అవడంతో పాటు క్లాసిక్‍గా నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ సిరీస్ అత్యంత పాపులర్ అయింది. 2003 నుంచి 2017 మధ్య వచ్చిన పైరెట్స్ ఆఫ్ ది కరీబియన్ ఐదు సినిమాలు గ్లోబల్‍గా సూపర్ హిట్ అయ్యాయి. ఈ ఫ్యాంటసీ సూపర్ నేచురల్ యాక్షన్ డ్రామా మూవీస్ అత్యంత ఫేమస్ అయ్యాయి. పైరెట్స్ ఆఫ్ ది కరీబియన్ చిత్రాల్లో జానీడెప్ హీరోగా నటించారు. ఆ పోషించిన కెప్టెన్ జాక్ స్పారో పాత్ర ఓ కల్ట్ క్లాసిక్‍గా నిలిచిపోయింది. కాగా, పైరెట్స్ ఆఫ్ ది కరీబియన్ చిత్రాలు తెలుగులోనూ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అందుబాటులో ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Deepika Padukone Baby Bump: దీపికా బేబీ బంప్.. భర్తతో కలిసి ఓటేయడానికి వస్తూ చూపించిన బ్యూటీ

Laapataa Ladies: అందరినీ ఆలోచింపజేసేలా మంజూ మాయ్ చెప్పిన పవర్‌ఫుల్ హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ ఇవి.. మిస్ అవకండి

Devara Fear Song Lyrics: దేవర మూవీ ఫియర్ సాంగ్ లిరిక్స్ ఇవే.. అదరగొడుతున్న అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్

Anuvanuvuu song lyrics: సూపర్ హిట్ మెలోడీ అణువణువూ సాంగ్ లిరిక్స్ ఇవే.. నంబర్ వన్ సింగర్ పాడిన తెలుగు పాట

స్ట్రీమింగ్ వివరాలివే

పైరెట్స్ ఆఫ్ ది కరీబియన్ ఐదు సినిమాలు తెలుగు డబ్బింగ్‍లో ప్రస్తుతం ‘డిస్నీ+ హాట్‍స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉన్నాయి. ఒరిజినల్ ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, హిందీ, తమిళంలోనూ హాట్‍స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ ఫిల్మ్ సిరీస్‍లో ఐదు చిత్రాలు ఉంటాయి. ఈ సినిమాలను తెలుగులో కావాలంటే హాట్‍స్టార్‌ ఓటీటీలో చూసేయవచ్చు.

పైరెట్స్ ఆఫ్ కరీబియన్ సిరీస్‍లో ‘ది కర్స్ ఆఫ్ ది బ్లాక్ పర్ల్’ (2003), డెడ్ మ్యాన్స్ చెస్ట్ (2006), అట్ వరల్డ్స్ ఎండ్ (2007), ఆన్ స్ట్రేంజర్ టైడ్స్ (2011), డెడ్ మెన్ టెల్ నో టేల్స్ (2017) సినిమాలు వచ్చాయి. ఈ సిరీస్‍లో అన్ని చిత్రాలు మంచి హిట్ అయ్యాయి.

పైరెట్స్ ఆఫ్ కరీబియన్ సినిమాల్లో సముద్ర దొంగ కెప్టెన్ జాక్ స్పారోగా జానీ డెప్ అద్భుతంగా నటించారు. యాక్షన్, విన్యాసాలు, కామెడీ సహా అన్ని విషయాల్లో ఆయన నటన అందరినీ మెప్పించింది. జెప్ సహా ఆ పాత్రను మెరవరూ చేయలేరన్న స్థాయిలో ఆయన ప్రశంసలు అందుకున్నారు.

పైరెట్స్ ఆఫ్ కరీబియన్ సినిమాల గురించి..

పైరెట్స్ ఆఫ్ కరీబియన్ సిరీస్‍లో తొలి మూడు చిత్రాలకు గోర్ వెర్‌బిన్‍స్కి దర్శకత్వం వహించారు. నాలుగో భాగానికి రామ్ మార్షల్, ఐదో చిత్రానికి ఎస్పెన్ సాండ్‍బర్గ్, జోకియామ్ రోనీంగ్ డైరెక్షన్ చేశారు. ఈ సినిమాలను వాల్ట్ డిస్నీ పిక్చర్స్, జెర్రీ బ్రూక్‍హైమర్ పతాకాలు నిర్మించాయి. జెర్రీ బ్రూక్‍హైమర్ నిర్మాతగా వ్యవహరించారు.

పైరెట్స్ ఆఫ్ కరీబియన్ చిత్రాల్లో జానీ డెప్‍తో పాటు జియోఫ్రే రష్, కెవిన్ మ్యాక్‍నాలీ, ఒర్లాండో బ్లూమ్, కీరా నైట్లీ ప్రధాన పాత్రలు పోషించారు. తొలి మూవీకి క్లౌస్ బడెల్ట్ సంగీతం అందించగా.. రెండు, మూడు, నాలుగు చిత్రాలకు హాన్స్ జిమ్మర్, ఐదో మూవీకి జెఫ్ జానెలీ మ్యాజిక్ ఇచ్చారు.

పైరెట్స్ ఆఫ్ ది కరీబియన్ సిరీస్‍లో ఆన్ స్ట్రేంజ్ టైడ్స్ పేరుతో ఆరో సినిమాను కూడా తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంపై 2017లోనే డైరెక్టర్ రోనింగ్ ప్రకటించారు. ఈ మూవీ స్క్రిప్ట్ పూర్తవుతోందని 2020లోనే అప్‍డేట్ ఇచ్చారు. అయితే, తన భార్యతో పరువు నష్టం కేసులో తుదితీర్పు రాకముందే ఈ ఫ్రాంచైజీ నుంచి తనను తప్పిస్తున్నట్టు ప్రకటించటంతో జానీ డెప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పరువు నష్టం కేసులో జానీ డెప్ గెలువటంతో అతడిని మళ్లీ రావాలని వాల్ట్ డిస్నీ పిలిచింది. అయితే, అందుకు ఇంకా ఆయన అంగీకారం తెలుపలేదు. మళ్లీ పైరెట్స్ ఆఫ్ ది కరీబియన్ ఫ్రాంచైజీలో నటించనని తేల్చిచెప్పారు. దీంతో ఈ సిరీస్‍లో ఆరో సినిమా వస్తుందో రాదో అనేది ఇంకా క్లారిటీ లేదు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం