తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pawan Kalyan Vs Chiru: బ్రో వ‌ర్సెస్ వాల్తేర్ వీర‌య్య - బుల్లితెర‌పై మెగా బ్ర‌ద‌ర్స్ పోటీ

Pawan kalyan vs Chiru: బ్రో వ‌ర్సెస్ వాల్తేర్ వీర‌య్య - బుల్లితెర‌పై మెగా బ్ర‌ద‌ర్స్ పోటీ

02 October 2023, 6:49 IST

  • Pawan kalyan vs Chiru: ద‌స‌రాకు బుల్లితెర‌పై మెగా బ్ర‌ద‌ర్స్ చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీప‌డ‌బోతున్నారు. చిరంజీవి హీరోగా న‌టించిన వాల్తేర్ వీర‌య్య‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్రో సినిమాలు ద‌స‌రా రోజును టీవీలో టెలికాస్ట్ కానున్న‌ట్లు స‌మాచారం.

చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్
చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్

చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్

Pawan kalyan vs Chiru: సిల్వ‌ర్ స్క్రీన్‌పై మెగా బ్ర‌ద‌ర్స్ చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టివ‌ర‌కు పోటీప‌డ‌లేదు. కానీ బుల్లితెర‌పై ఫ‌స్ట్ టైమ్ పోటీప‌డ‌బోతున్నారు. చిరంజీవి హీరోగా న‌టించిన వాల్తేర్ వీర‌య్య‌తో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్రో మూవీ వ‌ర‌ల్డ్ టెలివిజ‌న్ ప్రీమియ‌ర్ డేట్స్ ఖ‌రార‌య్యాయి. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 19న ఈ రెండు సినిమాలు టీవీల్లో టెలికాస్ట్ కాబోతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

Keerthy Suresh Kalki 2898 AD: కల్కి 2898 ఏడీలో కీర్తి సురేష్.. ప్రభాస్‌కు ప్రాణ మిత్రుడిగా మహానటి

బ్రో మూవీ జీ తెలుగులో టెలికాస్ట్ కాబోతుండ‌గా....వాల్తేర్ వీర‌య్య మూవీ జెమిని టీవీలో ప్రీమియ‌ర్ కానుంది. రెండు సినిమాలు ఒకే రోజు...ఒకే టైమ్‌లో టెలికాస్ట్ కానున్న‌ట్లు స‌మాచారం.ఈ అన్న‌ద‌మ్ముల బుల్లితెర పోరు ఆస‌క్తిక‌రంగా మారింది. చిరంజీవి వాల్తేర్ వీర‌య్య సినిమా సంక్రాంతికి రిలీజైంది. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది.

ఈ సినిమాలో చిరంజీవితో పాటు ర‌వితేజ మ‌రో హీరోగా న‌టించాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సీన్స్ మాస్ ఆడియెన్స్‌ను మెప్పించాయి. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్రో మూవీ జూలై 28న థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఈ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో మెగా యంగ్ హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ మ‌రో హీరోగా క‌నిపించాడు. ఈ మామాఅల్లుళ్ల కాంబోలో రూపొందిన ఈ సినిమాకు స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

భారీ అంచ‌నాల‌తో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ యావ‌రేజ్ రిజ‌ల్ట్‌ను సొంతం చేసుకున్న‌ది. ప్ర‌స్తుతం చిరంజీవి వ‌శిష్ణ‌, క‌ళ్యాణ్ కృష్ణ డైరెక్ష‌న్‌లో సినిమాలు చేస్తున్నాడు. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌, హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమాల్లో న‌టిస్తూనే రాజ‌కీయాల‌పై ఫోక‌స్ పెడుతోన్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం