తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pavitra Lokesh: మా బంధాన్ని ఫ్యామిలీ మెంబ‌ర్స్ యాక్సెప్ట్ చేశారు - న‌రేష్‌తో రిలేష‌న్‌షిప్‌పై ప‌విత్రా లోకేష్ కామెంట్స్‌

Pavitra Lokesh: మా బంధాన్ని ఫ్యామిలీ మెంబ‌ర్స్ యాక్సెప్ట్ చేశారు - న‌రేష్‌తో రిలేష‌న్‌షిప్‌పై ప‌విత్రా లోకేష్ కామెంట్స్‌

HT Telugu Desk HT Telugu

23 May 2023, 12:53 IST

  • Pavitra Lokesh on Naresh: న‌రేష్‌, తాను ఐదేళ్లుగా క‌లిసే ఉంటున్నామ‌ని ప‌విత్రా లోకేష్ చెప్పింది. త‌మ బంధాన్ని న‌రేష్ ఫ్యామిలీ అంగీక‌రించింద‌ని చెప్పింది.

న‌రేష్, ప‌విత్రా లోకేష్
న‌రేష్, ప‌విత్రా లోకేష్

న‌రేష్, ప‌విత్రా లోకేష్

Pavitra Lokesh on Naresh: సీనియ‌ర్ న‌రేష్‌తో అనుబంధంపై ప‌విత్రా లోకేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. న‌రేష్‌, తాను ఐదేళ్లుగా క‌లిసే ఉంటున్నామ‌ని చెప్పింది. సీనియ‌ర్ న‌రేష్, ప‌విత్రా లోకేష్ లివింగ్ రిలేష‌న్‌లో ఉన్న‌ట్లు, వారిద్ద‌రు పెళ్లిచేసుకోనున్న‌ట్లు గ‌త కొన్నేళ్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం న‌రేష్‌, ప‌విత్రా లోకేష్ క‌లిసి మ‌ళ్ళీ పెళ్లి అనే సినిమా చేస్తోన్నారు. వీరి జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు మ‌ళ్ళీ పెళ్లి ట్రైల‌ర్‌లో క‌నిపించ‌డం టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు

Heeramandi 2: హీరామండి వెబ్ సిరీస్‍ రెండో సీజన్ వస్తుందా? డైరెక్టర్, యాక్టర్ ఏం చెప్పారంటే..

OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

ఈ సినిమాతో పాటు న‌రేష్‌తో బంధంపై మ‌ళ్ళీ పెళ్లి ప్ర‌మోష‌న్స్ ప‌విత్రా లోకేష్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. న‌రేష్‌తో త‌న రిలేష‌న్‌షిప్‌ను అత‌డి ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసింద‌ని, సోసైటీ అంగీక‌రిస్తుందా? లేదా? అన్న‌ది త‌మ‌కు అవ‌స‌రం లేద‌ని పేర్కొన్న‌ది. మేమిద్ద‌రం బాగుంటే చాలు అని ఫ్యామిలీ మెంబ‌ర్స్ కోరుకుంటున్నార‌ని చెప్పింది న‌రేష్‌, తాను ఐదేళ్లుగా క‌లిసి ఉంటున్నామ‌ని, మా రిలేష‌న్‌ను బ‌య‌ట‌కు చెప్పాల‌ని అనుకోలేద‌ని ప‌విత్రా లోకేష్ చెప్పింది.

కొంద‌రికి మాత్ర‌మే ఇబ్బంది...

కానీ మ‌మ్మ‌ల్ని కొంద‌రు తీసుకొచ్చి గ్రౌండ్‌లో ప‌డేశార‌ని , ఆ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌కు ఎలా రావాల‌న్న‌దాని గురించే తాము ఆలోచిస్తోన్న‌ట్లు పేర్కొన్న‌ది. మా రిలేష‌న్ గురించి అంద‌రికీ చెప్ప‌డానికే ఈ సినిమా చేశామ‌ని అనుకోవ‌డంలో అర్థం లేద‌ని చెప్పింది. న‌రేష్‌కు, త‌న‌కు మ‌ధ్య‌ ఉన్న రిలేష‌న్ గురించి దాచేది ఏం లేద‌ని, తాను ఎక్క‌డికైనా ఒంట‌రిగా వెళితే న‌రేష్ రాలేదా అని అంద‌రూ అడుగుతుంటార‌ని చెప్పింది.

త‌మ బంధం గురించి కొంద‌రికి ఇబ్బందిగా మారింది త‌ప్పితే సోసైటీకి కాద‌ని చెప్పింది. న‌రేష్‌, తాను క‌లిసి ఈ సినిమా చేస్తేనే బాగుంటుంద‌ని ఎమ్.ఎస్ రాజు ప‌ట్టుబ‌ట్టారు. ఆయ‌న ఒప్పించ‌డంతోనే మ‌ళ్ళీ పెళ్లి సినిమా చేశాన‌ని చెప్పింది. మ‌ళ్లీ పెళ్లి సినిమా మే 26న తెలుగుతో పాటు క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ కానుంది. ఎం.ఎస్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను న‌రేష్ స్వ‌యంగా నిర్మించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం