తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aryan Khan Dating : పాకిస్థాన్ నటితో షారూఖ్ ఖాన్ కుమారుడి డేటింగ్​పై క్లారిటీ

Aryan Khan Dating : పాకిస్థాన్ నటితో షారూఖ్ ఖాన్ కుమారుడి డేటింగ్​పై క్లారిటీ

HT Telugu Desk HT Telugu

10 January 2023, 20:49 IST

    • Sadia Khan on Dating Rumours : పాకిస్థానీ నటి సాదియా ఖాన్‌తో ఆర్యన్ ఖాన్ ఫోటో వైరల్ అయింది. దీంతో ఇద్దరు డేటింగ్ చేస్తున్నారని పుకార్లు లేచాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది సాదియా ఖాన్.
సాదియా ఖాన్‌తో ఆర్యన్ ఖాన్
సాదియా ఖాన్‌తో ఆర్యన్ ఖాన్ (twitter)

సాదియా ఖాన్‌తో ఆర్యన్ ఖాన్

సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్(Sharuk Khan) కుమారుడు ఆర్యన్ ఖాన్ ఇటీవల పాకిస్థానీ నటి, మోడల్ సాదియా ఖాన్‌(Sadia Khan)ను కలిశాడు. ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. అది కాస్త సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అయింది. దీంతో డేటింగ్ పుకార్లకు దారితీసింది. ఆర్యన్ పాకిస్థాన్ మోడల్‌తో సంబంధం కలిగి ఉన్నాడని నెటిజన్లు భావించారు. తాజాగా సాదియా ఖాన్ పుకార్లపై స్పందించింది. పూర్తి వివరాలు తెలియకుండా తన గురించి, ఆర్యన్ గురించి ఎలా రాస్తున్నారని చెప్పింది. ఇలా చేయడం చాలా వింతగా ఉందని తెలిపింది. ప్రతిదానికీ ఒక పరిమితి ఉండాలని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

Madgaon Express OTT: ఓటీటీలోకి వచ్చేసిన యానిమల్ యాక్టర్ సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

Yuvaraj OTT: ఓటీటీలోకి వ‌చ్చేసిన కాంతార‌ హీరోయిన్ యాక్ష‌న్ డ్రామా మూవీ - తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!

Bollywood Actor: 200 సినిమాల్ని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ న‌టుడు - సూప‌ర్‌స్టార్ కావాల్సినోడు .. సీరియ‌ల్స్ చేస్తోన్నాడు

Prabhas Marriage: ప్రభాస్ లైఫ్‌లోకి స్పెషల్ పర్సన్.. కాబోయే భార్య గురించేనా డార్లింగ్ పోస్ట్?

'మేం ఫొటో దిగినంత మాత్రన.. డేటింగ్ చేస్తున్నామని దీని అర్థం కాదు. ఆర్యన్‌తో ఫోటో దిగింది.. నేనొక్కదాన్నే కాదు. ఇంకా కొంతమంది కూడా తీసుకున్నారు. వారు కూడా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. కానీ ఏదో ఒకవిధంగా నాపైనే ఇలా రూమర్స్ చేశారు.' అని సాదియా(Sadia) చెప్పింది. ఈ డేటింగ్ పుకార్లను ఖండించింది.

ఆర్యన్ చాలా స్వీట్ అని, చాలా మంచి మర్యాదగల అబ్బాయి అని సాదియా ఖాన్(Sadia Khan) చెప్పింది. దయచేసి మా గురించి పుకార్లన్నింటినీ ఆపండని రిక్వెస్ట్ చేసింది. సాదియా ఖాన్ ప్రముఖ పాకిస్తానీ టెలివిజన్ నటి. ఆమె ఖుదా ఔర్ మొహబ్బత్, షాయద్, మరియమ్ పెరీరా, యారియన్ వంటి పలు సీరియల్స్‌లో కనిపించింది. ఖుదా ఔర్ ముహబ్బత్ సీజన్ 1, 2లో తన పాత్రకు సాదియాకు బాగా పేరు వచ్చింది.

కొద్ది రోజుల క్రితం, దుబాయ్‌లో న్యూ ఇయర్ వేడుకలో ఆర్యన్, సాదియా కలిశారు. ప్రముఖ డ్యాన్సర్ కమ్ నటి నోరా ఫతేహితోనూ ఆర్యన్ ఖాన్ డేటింగ్ లో ఉన్నాడని కూడా పుకార్లు వచ్చాయి.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం