తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Operation Alamelamma Review: ఆప‌రేష‌న్ అల‌మేల‌మ్మ రివ్యూ - జెర్సీ హీరోయిన్‌ శ్ర‌ద్ధా శ్రీనాథ్ ఓటీటీ మూవీ ఎలా ఉందంటే?

Operation Alamelamma Review: ఆప‌రేష‌న్ అల‌మేల‌మ్మ రివ్యూ - జెర్సీ హీరోయిన్‌ శ్ర‌ద్ధా శ్రీనాథ్ ఓటీటీ మూవీ ఎలా ఉందంటే?

29 October 2023, 12:15 IST

  • Operation Alamelamma Review: రిషి, శ్ర‌ద్ధా శ్రీనాథ్ హీరోహీరోయిన్లుగా న‌టించిన ఆప‌రేష‌న్ అల‌మేల‌మ్మ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన క‌న్న‌డ అగ్ర ద‌ర్శ‌కుడు సింపుల్ సునీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఆప‌రేష‌న్ అల‌మేల‌మ్మ
ఆప‌రేష‌న్ అల‌మేల‌మ్మ

ఆప‌రేష‌న్ అల‌మేల‌మ్మ

Operation Alamelamma Review: జెర్సీ ఫేమ్ శ్ర‌ద్ధాశ్రీనాథ్(Shraddha Srinath) హీరోయిన్‌గా న‌టించిన ఆప‌రేష‌న్ అల‌మేల‌మ్మ మూవీ ఆహా ఓటీటీ (Aha OTT) ద్వారా ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. సింపుల్ సునీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో రిషి క‌థానాయ‌కుడిగా న‌టించాడు. 2017లో క‌న్న‌డంలో విజ‌య‌వంత‌మైన ఆప‌రేష‌న్ అల‌మేల‌మ్మ అనువాదంగా ఓటీటీలో(OTT) రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే…

ట్రెండింగ్ వార్తలు

Brahmamudi May 17th Episode: బ్రహ్మముడి- అనామికకు కల్యాణ్ విడాకులు- లేచిపోదామన్న అప్పు- తాతయ్య వార్నింగ్- కావ్యకు 2 డేస్

Ntr Prashanth Neel Movie: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీ టైటిల్ ఇదేనా? - కేజీఎఫ్‌కు మించి యాక్ష‌న్‌…ఎలివేష‌న్స్?

Krishna mukunda murari serial:ముకుందకు మురారి సేవలు.. మీరా నెల తప్పిందన్న భవానీ, షాక్ లో కృష్ణ

Karthika deepam 2:కార్తీకదీపం 2 సీరియల్..కాంచనని మోసం చేస్తున్న శ్రీధర్.. కార్తీక్ గురించి మరో నిజం తెలుసుకున్న పారిజాతం

పరమేష్ కథ…

ప‌ర‌మేష్ అలియాస్ ప‌ర్మీ (రిషి) ఓ అనాథ‌. వెజిటేబుల్‌ మార్కెట్‌ యార్డ్‌లో ప‌నిచేస్తుంటాడు. స్కూల్ టీచ‌ర్ అన‌న్య‌(శ్ర‌ద్ధా శ్రీనాథ్‌)తో ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారుతుంది.పెళ్లిచేసుకోవాల‌ని అనుకుంటారు. కానీ త‌న త‌ల్లి అనారోగ్యం డ‌బ్బులు బాగా అవ‌స‌రం కావ‌డంతో ప‌ర‌మేష్‌ను కాద‌ని మ‌రో వ్య‌క్తితో అన‌న్య పెళ్లికి సిద్ధ‌ప‌డుతుంది.

మ‌రోవైపు టాప్ బిజినెస్‌మెన్ కెన‌డీ కొడుకు జాన్‌ కిడ్నాప్ అవుతాడు.ఆ నేరం చేసింది ప‌ర‌మేష్ అనే అనుమానంతో పోలీసులు అత‌డిని అరెస్ట్ చేస్తారు. తాను ఆ కిడ్నాప్ చేయ‌లేద‌ని ప‌ర‌మేష్ ఎంత‌ చెప్పినా పోలీసులు న‌మ్మ‌రు. మ‌రోవైపు కిడ్నాప‌ర్ ఫోన్ చేసిన ప్ర‌తిసారీ ప‌ర‌మేష్ త‌న మ‌నిషే అని అన‌డంతో కిడ్నాప్ వెనుక అత‌డి ప్ర‌మేయం ఉంద‌ని పోలీసులు బ‌లంగా న‌మ్ముతుంటారు.

అస‌లు ఆ కిడ్నాప్ చేసింది ఎవ‌రు? జాన్ నిజంగా కిడ్నాప్‌కు గుర‌య్యాడా? జాన్ కిడ్నాప్‌తో ప‌ర‌మేష్‌కు ఎలాంటి సంబంధం ఉంది? ప‌ర‌మేష్‌, అన‌న్య మ‌ళ్లీ ఎలా ఒక్క‌ట‌య్యారు? పోలీస్ ఆఫీస‌ర్ అశోక్ (రాజేష్‌) అస‌లైన కిడ్నాప‌ర్‌ను ప‌ట్టుకున్నాడా? ఈ కిడ్నాప్ డ్రామాకు ఆప‌రేష‌న్ అల‌మేల‌మ్మ అనే పేరు ఎందుకు వ‌చ్చింద‌న్న‌దే ఈ సినిమా(Operation Alamelamma Revie క‌థ‌.

ల‌వ్ స్టోరీ...పోలీస్ ఇన్వేస్టిగేష‌న్‌...

ఫ‌న్ క్రైమ్ ల‌వ్ స్టోరీగా ఆప‌రేష‌న్ అల‌మేల‌మ్మ సినిమాను డైరెక్ట‌ర్ సింపుల్ సునీ తెర‌కెక్కించారు. ఓ వైపు పోలీసుల ఇన్వేస్టిగేష‌న్‌, మ‌రోవైపు ఓ జంట ప్రేమ‌క‌థ‌ను చూపిస్తూ డిఫ‌రెంట్ స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో ఎంగేజింగ్‌గా సినిమాను న‌డిపించారు డైరెక్ట‌ర్.

కిడ్నాప‌ర్ ఎవ‌ర‌న్న‌ది ఆడియెన్స్ ఊహ‌ల‌కు అంద‌కుండా ఎండింగ్ వ‌ర‌కు ఎంగేజింగ్‌గా న‌డిపించ‌డంలో డైరెక్ట‌ర్ సునీ చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాడు. కిడ్నాప‌ర్ మీలోనే ఉన్నాడు అంటూ హీరో పోలీస్ ఆఫీస‌ర్‌తో చెప్పే డైలాగ్‌తో సినిమాలో క‌నిపించే ప్ర‌తి క్యారెక్ట‌ర్‌పై అనుమానం రేకెత్తిస్తూ స్క్రీన్‌ప్లేను అల్లుకున్న తీరు కొత్త‌గా ఉంది.

రిషి కామెడీ టైమింగ్‌...

సైతాన్ వెబ్‌సిరీస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన రిషి ఆప‌రేష‌న్ అల‌మేల‌మ్మ‌లో హీరోగా న‌టించాడు. రిషి కామెడీ టైమింగ్ ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింది. వెజిటేబుల్ మార్కెట్‌లో ప‌నిచేస్తూ వ‌చ్చి రానీ ఇంగ్లీష్‌లో పెద్ద బిజినెస్‌మెన్‌గా బ‌ల్డిప్ ఇస్తూ అత‌డు చెప్పే ఫ‌న్నీ డైలాగ్స్ చాలా వ‌ర‌కు న‌వ్విస్తాయి.

కిడ్నాప‌ర్ తానే అయిన ఆ విష‌యం బ‌య‌ట‌ప‌డ‌కుండా అమాయ‌క‌త్వంతో పోలీసుల‌ను బోల్తా కొట్టించే సీన్స్ అల‌రిస్తాయి. ప‌ర‌మేష్‌, అన‌న్య ల‌వ్ స్టోరీని డైరెక్ట్‌గా చూపించ‌కుండా పోలీస్ ఆఫీస‌ర్‌కు ప‌ర‌మేష్ త‌న క‌థ చెప్ప‌డం ద్వారా స్క్రీన్‌పై ఆవిష్క‌రించ‌డం ఆక‌ట్టుకుంటుంది. అన‌న్య ఎంగేజ్‌మెంట్ ట్విస్ట్‌తో పాటు అస‌లైన కిడ్నాప‌ర్ ఎవ‌ర‌నే మ‌లుపు థ్రిల్లింగ్‌ను పంచుతాయి.

లాజిక్ లెస్‌...

ల‌వ్ స్టోరీని చాలా వ‌ర‌కు సాగ‌దీశారు. అన‌న్య‌కు ఎంగేజ్‌మెంట్ పూర్త‌యిన త‌ర్వాత మ‌ళ్లీ ప‌ర‌మేష్ ఆమె మ‌న‌సును గెలుచుకునే సీన్స్ సిల్లీగా అనిపిస్తాయి. పోలీసుల ఇన్వేస్టిగేష‌న్ లాజిక్‌ల‌కు దూరంగా సాగుతుంది.

బ్రాండెడ్ వ‌స్తువుల‌పై మోజు...

బ్రాండెడ్ వ‌స్తువుల‌పై మోజు క‌లిగిన యువ‌కుడి పాత్ర‌లో రిషి అద‌ర‌గొట్టాడు. త‌న ప్ర‌మేయం లేకుండానే కిడ్నాప్ కేసులో ఇరుక్కున్న అమాయ‌కుడైన ప్రేమికుడిగా అత‌డి కామెడీ టైమింగ్‌, యాక్టింగ్ బాగున్నాయి. శ్ర‌ద్ధా శ్రీనాథ్ పాత్ర‌కు పెద్ద‌గా ఇంపార్టెన్స్ లేన‌ట్లుగా అనిపిస్తుంది. సెకండాఫ్ చాలా వ‌ర‌కు ఆమె స్క్రీన్‌పై క‌నిపించ‌దు. పోలీస్ ఆఫీస‌ర్‌గా రాజేష్‌, హీరోయిన్ త‌ల్లి పాత్ర‌లో అరుణతో పాటు జాన్ త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు.

Operation Alamelamma Review -క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ...

ఆప‌రేష‌న్ అల‌మేల‌మ్మ ఫ‌న్‌తో సాగుతూనే థ్రిల్లింగ్‌ను పంచే క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ. డ‌బ్బింగ్ కూడా బాగుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం