తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ntr: ఆస్కార్ రేసులో ఎన్టీఆర్ - వైర‌ల్ గా మారిన హాలీవుడ్ మ్యాగ‌జైన్ క‌థ‌నం

NTR: ఆస్కార్ రేసులో ఎన్టీఆర్ - వైర‌ల్ గా మారిన హాలీవుడ్ మ్యాగ‌జైన్ క‌థ‌నం

HT Telugu Desk HT Telugu

14 August 2022, 12:17 IST

  • ఎన్టీఆర్‌(Ntr), రామ్ చ‌ర‌ణ్ (Ramcharan)హీరోలుగా న‌టించిన ఆర్ఆర్ఆర్ (RRR)చిత్రం అంత‌ర్జాతీయ స్థాయిలో సినీ అభిమానుల ప్ర‌శంస‌ల్ని అందుకుంటోంది. తాజాగా ఈ సినిమా పలు విభాగాల్లో ఆస్కార్ (Oscar ) ఎంట్రీలను దక్కించుకోవచ్చునని హాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్  కూడా అవార్డు బరిలో నిలిచే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. 

ఎన్టీఆర్‌
ఎన్టీఆర్‌ (twitter)

ఎన్టీఆర్‌

ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్ర‌లో అస‌మాన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు ఎన్టీఆర్‌. స్నేహానికి విలువ‌నిచ్చే వ్య‌క్తిగా, త‌న జాతి కోసం పోరాడే వీరుడిగా ఎమోష‌న‌ల్ క్యారెక్ట‌ర్‌లో అత‌డి న‌ట‌న‌ను విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. దేశ‌విదేశాల‌కు చెందిన‌ ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, అభిమానులు ఎన్టీఆర్ న‌ట‌న‌కు ఫిదా అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో అద్వితీయ అభిన‌యాన్ని క‌న‌బ‌ర‌చిన ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డుల్లో ఉత్త‌మ న‌టుడి కేట‌గిరీలో నామినేట్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌ముఖ హాలీవుడ్ మ్యాగ‌జైన్ వెరైటీ ఓ క‌థ‌నాన్ని రాసింది.

ట్రెండింగ్ వార్తలు

NNS May 17th Episode: మళ్లీ భూలోకానికి అరుంధతి.. ఈసారి యముడు కూడా.. అమర్​కి తలంటిన భాగీ.. పిల్లలను రెచ్చగొట్టిన మనోహరి

Brahmamudi May 17th Episode: బ్రహ్మముడి- అనామికకు కల్యాణ్ విడాకులు- లేచిపోదామన్న అప్పు- తాతయ్య వార్నింగ్- కావ్యకు 2 డేస్

Ntr Prashanth Neel Movie: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీ టైటిల్ ఇదేనా? - కేజీఎఫ్‌కు మించి యాక్ష‌న్‌…ఎలివేష‌న్స్?

Krishna mukunda murari serial:ముకుందకు మురారి సేవలు.. మీరా నెల తప్పిందన్న భవానీ, షాక్ లో కృష్ణ

నికోల‌స్ కేజ్‌, ఇరానియ‌న్ యాక్ట‌ర్ మెహ‌దీ బ‌జేస్థానీ, నికోల‌స్ హాల్ట్‌, ఓవెన్ టీగ్ తో పాటు ఎన్టీఆర్ కూడా ఉత్త‌మ న‌టుడి కేట‌గిరీలో పోటీ పడవచ్చునని పేర్కొన్నది. బెస్ట్ యాక్టర్ తో పాటు ఉత్త‌మ సినిమా, , బెస్ట్ డైరెక్ట‌ర్‌, ఒరిజిన‌ల్ స్క్రీన్‌ప్లే విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమా ఎంట్రీల‌ను ద‌క్కించుకోవ‌చ్చ‌ని పేర్కొన్న‌ది. తొలిత‌రం స్వాతంత్ర్య‌స‌మ‌ర‌యోధులు కొమురంభీమ్‌, అల్లూరి సీతారామ‌రాజు జీవితాల‌కు ఫిక్ష‌న‌ల్ అంశాల‌ను జోడిస్తూ ఆర్ఆర్ఆర్ సినిమాను రాజ‌మౌళి తెర‌కెక్కించారు.

ఈ సినిమాతోనే అలియాభ‌ట్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మార్చి 25న రిలీజ్ అయిన ఈ సినిమా ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత కొర‌టాల శివ‌తో ఓ సినిమాను చేయ‌బోతున్నారు ఎన్టీఆర్‌

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం